STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

అమ్మ దిద్దిన బోమ్మ

అమ్మ దిద్దిన బోమ్మ

1 min
0



సృష్టిలో అమ్మ దిద్దిన బొమ్మ 
ఈ అందాల ముద్దు గుమ్మ
అమ్మే కదా ఆది గురువు 
బతుకును ఇచ్చే కల్పతరువు 

అమ్మ మాటే తొలి పలుకు 
శిశువు వినే మాతృ పిలుపు 
శిక్షణ, సంరక్షణ అమ్మ విధి
బతుకంతా అమ్మే పెన్నిధి 

భాషా, వేషం, కట్టు బొట్టు 
ఇంట్లో కూర్చిన నడికట్టు
పెంపకంలోని సరిగమలు
అల్లారు ముద్దుగా పదనిసలు

పుట్టిన ప్రతి బిడ్డ ఓ మట్టి ముద్ద 
నవమాసాలు మోసిన అమ్మ శ్రధ్ధ 
పేగుబంధం పెనవేసిన బాధ్యత 
అమ్మ చేతిలో రూపొందే భవిత

అమ్మ చెక్కిన శిల్పం ఆ శిశువు 
పంచప్రాణలు పంచి పెంచే క్రతువు
సంస్కృతి, సాంప్రదాయాల నెలవు
విలువలతో కూడిన జీవనమే తలువు

దిద్దితే రాయి కాస్త రమణీయ శిల్పం 
ప్రాణం పోస్తే ఓ జీవ సౌందర్యం 
సంకల్ప, సాధనలే జీవన గమ్యం 
అమ్మ కష్టంతో ఒనగూరే బతుకు రమ్యం 

పుడమిపైన అందరూ అమ్మ దిద్దిన బొమ్మలే
నడక, నడతలు, నాగరికతలన్నీ అమ్మ మేలులే
కుటుంబ వ్యవస్థకు మూలం అమ్మ దిద్దుబాటు 
మానషి మనుగడకు అమ్మే సర్దుబాటు!!


Rate this content
Log in

Similar telugu poem from Classics