STORYMIRROR

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

అల్విదా

అల్విదా

1 min
1


ఈ రేయిని వీడినీవు చెప్పకుమా అల్విదా 

నాగుండెను కోసి నీవు చెప్పకుమా అల్విదా 


నిశ్చలమగు మనసుసరసు కల్లోలం అయ్యింది

ప్రేమరాయి విసిరినీవు చెప్పకుమా అల్విదా 


పూవునీవు తావినేను విడదీయని బంధమిది 

తావిలేని పూవునీవు చెప్పకుమా అల్విదా 


అంతదూరమున్న తార చంద్రునిదరి చేరదా

చెంతనన్ను వీడినీవు చెప్పకుమా అల్విదా 


నినుచూడని కళ్ళెందుకు రంధ్రములవి కావా

అంధుడ్నీ చేసినీవు చెప్పకుమా అల్విదా


Rate this content
Log in

Similar telugu poem from Romance