అల్లరి ఊహ
అల్లరి ఊహ
అల్లరి ఊహే అల్లరిపాలు చేయడం అంటే ఇదేలే,
వినోదమే విషాద ఊసుగా మారితే బాధేలే,
మనసు తహతహల్లో మాయచేరితే ముప్పేలే,
చూపులమంత్రం హృదినిగెలిచేటి ప్రణయగీతం అవ్వదులే,
అలంకారశాస్త్రం
గుండెచాటు బాధగా మారితే
జీవిత అర్ధం మారిపోవులే,
పలకరించు ప్రతిచూపు
కామంతో కలవరపెడితే
శోకమే నేస్తమవ్వులే.
కుటుంబ నియంత్రణ సాధనం
దృశ్యకావ్యం కాదులే,
ఎఱుక కలిగిన తత్వమే
మేధస్సుకు బలములే,
కనురెప్పల నోరు
వినపడని చిత్రహింసేలే,
సహజమైన అందమే
నవ్వుతున్న పువ్వులాగ
హృదిని చేరును
