అలి అలక
అలి అలక
మల్లెలు తేలేదని అలక ఏలనే
ఘాటైన నీమనసు ఏల చేరనే.
మౌనపు అడుగుల బింకం వీడవేలనే,
మొండితనం వీడి
పరిమళ మనసు చదవవే,
వన్నె చిన్నెల వలపుముచ్చట్లకు
కాలమే చాలదే,
తరగని విరహం
మురిపం
పంచేది అయితే చాలునే.
మమతల ఊసులు కమ్మనికలగా మారకూడదే,
ప్రాణమిచ్చు ప్రేమకన్నా
మల్లెమాల గొప్పదికాదే,
అనురాగపు నిధులను నీకే అంకితం చేయుదునే,
వాడిపోని వసంతమై
అలజడి తీర్చగా రావే.
పక్కమంచం వెక్కిరింత చూడలేను మామయ్య,
నీగుండెచాటు గుబులు తీర్చేది
నా చిరునవ్వేనని తెలుసుకోవయా,
చిలిపిపూల సుద్దులకన్నా
మొగుడి ముచ్చటే ఆలికి గొప్పదయ్యా,
అనుబంధపు సూత్రానికి
వీడని చెలిమే భాగ్యమని తెలిసేనయా.

