అక్షరాలు మౌనముతో
అక్షరాలు మౌనముతో
అక్షరాల మౌనముతో..బ్రతకాలని ఉన్నది..!
ప్రవహించే చెలిమినదిగ..మిగలాలని ఉన్నది..!
పుడమికన్న దివ్యజనని..విశ్వజనని తోడే..
అమృతమేఘ రాగమిలా..పాడాలని ఉన్నది..!
ఒకనిశ్చల హృదినిమించి..ఆకాశం ఏదో..
బహుమతియై దక్కినదే..చూపాలని ఉన్నది..!
నిరుపమాన సౌందర్యపు..లోకమనగ కణమే..
పరబ్రహ్మ తత్వసుధను..పంచాలని ఉన్నది..!
రంగులెలా మనగలవోయ్..తెలుపన్నది ఉండక..
వర్ణాలకు అతీతమును..చూపాలని ఉన్నది..!
ఊరుకోను చేతకాని..మనసుతోటి రభసే..
ఉపాయమే ధ్యానమని..చెప్పాలని ఉన్నది..!

