అక్షరాలు మాలిక
అక్షరాలు మాలిక
మెరుపుల మధ్య మేఘాన్ని చూశాను
తళుక్కున మది గతాన్ని తెలిపే
వెలుగుల నీదు ముఖము గుర్తొచ్చే
చూపులతో చాలా భావాలు చూపేవు
మనసున ఎన్నో బాధల్ని దాచేవు
నవ్వులతో మది వెతల్ని బాపేవు
స్నేహముతో యద స్వచ్ఛత పంచేవు
మాటలతో హృది భారాన్ని తీసేవు
బ్రతుకున నీవు నడక నేర్పేవు
తెల్లవారు జాము మంచల్లే మాయమై
మరిచావు మన స్నేహాన్ని మాపుతూ
ఎదురుగా నీవు ఏనాడు నిల్చేవో!!
జ్ఞాపికవు నీవు స్నేహం మారుగా..

