అక్షరాభిషేకం
అక్షరాభిషేకం
అక్షరాభిషేకం
తిరునగరి నీ పాట
తేనెలను చిందించు
తిరునగరి నీ మాట
సిరివెన్నెల పూ దోట
కమ్మని కవితల రేడ!
ఇమ్ముగ పదములకూర్చి
వెండితెరను ఏలినావు
మొండి పట్టు కలిగినోడ!
కష్టాలకు ఓర్చినావు
కన్నీళ్లను మింగినావు
సాహసమున కదలినావు
సాటి రారుఎవరునీకు
తెలుగుతల్లి మెడ లోన -నీ పాట
వెలుగులను చిమ్మాలి
అందాల విందొసగి-ఈ
అవని పులకరించాలి.