అక్షర బంధం
అక్షర బంధం
శ్వేత వర్ణబరితమైన కాగితాన్ని పరికించితే చాలు....
నా చేతి కలము నుండి అక్షరములు నాట్యమాడుతూ ....
ఒకటికి రెండు జతకట్టి
అందమైన సమూహాలు ఏర్పరుచుకుని
కాగితాన్ని ఆక్రమించుకుంటూ
శ్రేణులుగా పరిణితి చెందుతూ
నా మస్తిష్కంలోనే తర్జబర్జనలు పడుతూ
నా హృదయ స్పందనలను
లయబద్ధంగా చేసుకుని
కాగితము పై ముత్యాలవలే మెరిసి
లతలలా అల్లుకు పోతూ ఉంటే
అది కవిత్వమా
మనసు పరవశమా
గోచరించడము లేదు ...!
స్పందనకు అక్షర రూపం
ఓ శిల్పమైన ఆనందములో....!
