అగమ్య గోచరం
అగమ్య గోచరం
ఎంతో విలువైనది ఈ జీవితం,
సరైన మార్గంలో ప్రయాణించి చేసుకోవలెను పునీతం |౧|
ఎప్పడూ కనిపించెను మనకి మంచీ- చెడు,
చెడ్డ దారిని అనుసరిస్తే కలిగెను తప్పక కీడు |౨|
అప్పుడప్పుడు నిర్ణయాలు తీసుకోలేక మాది వచ్చెను కలవరం,
అస్థిరత చాచల్యం వలన మనసులో అయ్యెను గందరగోళం |3|
తొందరపాటుతో తీసుకోకూడదు తప్పుడు తేరుగడ,
తీసుకున్న అనంతరం ప్రభావితం అయ్యెను మూల్యమైన మనుగడ |౪|
దారి ఏంచోకోవటంలో తీసుకోవాలి పెద్దలు అనుభవిజ్ఞుల అభిప్రాయం,
వారి సరైన మార్గదర్శనంతో జీవితం ఎన్నడూ అవదు అగమ్యగోచరం |౫|