Ramesh Babu Kommineni

Romance

4.5  

Ramesh Babu Kommineni

Romance

అదను

అదను

1 min
22.9K


ప౹౹

 విరహమా విడిచి వెళ్ళలేవా వివరించకనే 

పరువమా తుళ్ళిపడకే ఎద సవరించకనే ౹2౹


చ౹౹ 

వయసున్నది వలపుతో చెలిమి కోరుకదా 

మనసన్నదీ మలపుతో మరులే చేరుకదా ౹2౹


కోరికలే కూడి తనువు ఎగతాళిగా చూసే 

ఊరికినే ఉండలేక ఊహలు కంగాళి చేసే ౹ప౹ 

చ౹౹

తరుణమన్నది తరమసాగే తహతహగా

 ఎలమి రణమన్నది ఎగసిపడినే ఊహగా ౹2౹


తొలకరి ఆశలు తోరణమై మదిని అల్లగా 

తొలిసారి ఎడదలోన ఏదో గిల్లినే మెల్లగా ౹ప౹ 

చ౹౹

కారణమే చెప్పలేనే కంగారులో వివరించి

 దారుణమే ధరణిలో కల్పించే ఆ విరించి ౹2౹


తోడువచ్చి తొలగించవా తుంటరి వేదనే 

కూడివచ్చి కూడిక చేర్చవా చూసి అదనే ౹ప౹


Rate this content
Log in

Similar telugu poem from Romance