అచ్చం మన ప్రేమలాగే
అచ్చం మన ప్రేమలాగే
ఆకాశం నుంచి జాలువారి నను తాకీ తాకగానే మాయమవుతున్న
సన్నటి వాన తుంపర్లు నీ మోముపై క్షణంలో మెరిసి మాయమయ్యే
దొంగ నవ్వుని గుర్తుకి తెస్తున్నాయి.
హలో
నేల మీద మెలమెల్లగా అదృశ్యమవుతున్న మంచు మేట నీపైనున్న
నిన్నటి నా అలకని కూడా కరిగిస్తున్నట్టుంది.
ఇంతలోనే చప్పున మబ్బుల చాటునుంచొచ్చి నను ముద్దాడిన
సూర్యకిరణాలు నీ నులివెచ్చని స్పర్శని జ్ఞప్తికి తెచ్చాయి.
అంతలోనే యీ సూర్యకాంతి, ఆ స్వాతి చినుకులు రెండూ మమేకమై
అంబరాన అందమైన హరివిల్లుని చిత్రించాయి.. అచ్చం మన ప్రేమలాగే..!!!

