ఆట
ఆట
పంపిందొక అద్భుతశక్తి మానవునీ లోకానికి
విసిరింది కాలమనే బంతిని సవాలుగా మనిషికి
మనిషి చేత కాలమనే మరీచిక పరుగులు పెట్టిస్తుంది
అందీ అందక, తన చేతులకది, జారిపోతూంటుంది
మంటలు పుట్టిస్తాయి పరిస్థితులనే నెగళ్ళు మనిషికి
ఇక కాలం వెనుక పరుగు లిడక తప్పదు మనిషికి
లేకుంటే నెగళ్ళ బారినపడి మారగలడు మసిగా
మున్ముందుకు సాగడమే కావాలి మనిషి ధ్యేయంగా
చేరుకోవాలని లక్ష్యాన్ని, కాలంతో కడతాడు పందెం
పణంగా పెట్టాలి ప్రాణాలనే, గెలవాలంటే పందెం
గెలిపిస్తుంది తనలో కల పోరాటపటిమ మనిషిని
స్వర్గం కూడా వరించదు పోరాటపటిమ లేని వాడిని
నిర్ణయించేది వివేక విచక్షణలే మన గెలుపోటములను
సాధించగలము బంతి మనచేత ఉన్నప్పుడే గెలుపును
భయపడి ఆపితే మరణమే, ఓటమికి వెరచి, ఆటను
ఓ మనిషీ! తిరిగి చూడక, ఆడుతూ గెలవాలి జీవితమనే ఆటను.