ఆనందం
ఆనందం
ఎఱుకపూల తోటలోన..చేరితేనె..ఆనందం..!
తన నవ్వుల మెఱుపుతేనె..అందితేనె..ఆనందం..!
జ్ఞాపకాల లోయలలో..విహారాలు హాయేలే..
వాటిగోత్ర నామాలను..కాల్చితేనె..ఆనందం..!
అందమైన బంధాలకు..దాసోహమె అసలు ఖర్మ..
నిన్నునీవు గమనిస్తూ..ఆగితేనె ఆనందం..!
మనసుగాక తెలియజెప్పు..గురువెవ్వరు ఉండరులే..
తగిన శక్తి పొందేందుకు..మునిగితేనె ఆనందం..!
మాటలెన్ని చెప్పినా..పరిమితమే ఎంతైనా..
మౌనమనే గగనమేదొ..దొరికితేనె ఆనందం..!

