STORYMIRROR

ARJUNAIAH NARRA

Tragedy Inspirational

4  

ARJUNAIAH NARRA

Tragedy Inspirational

ఆనందం నేల రాలింది

ఆనందం నేల రాలింది

1 min
553

కరోన కాలంలో కన్నీటి బొట్లతో

నాలో ఆనంద సాగరం కరిగింది

మనసంతా ఇంకపోయి

గుండె అంత ఎండిపోయి

సంతోషం ఎండమావి అయింది

గంటలన్ని బండబారి 

రోజులన్ని బీటలు బారి

నెలలన్ని నేలకొరిగి

సంవత్సరాలు చచ్చూబడి

వసంతాలు వాడిపోయి

ఆనందం ఎండుటాకుల రాలింది.......


చిరునవ్వులేరగని చిలిపి చేష్టల శిశు దశ

ప్రేమ పరిమళం ఎరుగని పడుచు వయసు కథ

మరుమల్లెలేరుగని మధ్య వయసు వ్యధ


వెన్నెల ఎరుగని చీకటి దారుల్లో.......

బంధాలు శాశ్వతం కావని తెలుసు....

అనుబంధాలు శిథిలం అవ్వకూడదని

బతికినంత కాలం బంధాలను 

బతికించుకుంటు బతకాలనే  

బాధా తప్త హృదయంతో............


అమ్మ క్యాన్సర్ ను 

నా కన్నీటి చుక్కల్లో క్షణాలుగా లెక్కిస్తునే

నాన్నకు మరణపు అంచుల్లో 

ఇచ్చిన మాటకోసం .........

భారమైన ఉమ్మడి కుటుంబ 'సంసార కావడిని' 

బతుకు సమరంలో అలుపె ఏరుగని 

మనసుతో భుజస్కంధాలపై మోస్తూ......


నా ముండ్ల బాటలో, పూల మొక్కలు నాటాను

నా ఎడారి దారుల్లో ,కన్నిటితో చెలిమలు తవ్వాను

దుఖఃపు కీకారణ్యంలో ,ఆనందం పూయించాను


కానీ కరోన......

ఏమని పిలువను నిన్ను, 

ఎలా మార్చవో చూడు నన్ను

చూడు నా దూర్బెద్యమైన 

మమతల వాకిట నీవు ఒక మశుచివి

నా ఆప్యాతల ఇంట నీవు ఒక అపశకునానివి

నా ప్రేమ నిలయంలో ఒక పురుగువి

నా అనురాగాల ఓడిలొ ఒక పిడుగువి

ఏమని పిలువను నిన్ను.......

ఎలా మార్చవో చూడు నన్ను....

నా అనంద సాగరాన్ని 

దుఃఖ సాగరంగా మార్చావు


నా సంతోష జీవితం  

తొడ బుట్టిన తమ్ములతో

ఇక ముగిసిన అధ్యయమే!

తోడై నీడై నీతోనే నా జీవితం 

అన్న నా 'మనసు'తో నా ఆనందం నేలరాలి  

మళ్ళీ 'దుఖం' మొదటి పాటమైంది (ఇక

అందులో మొదటి లైన్ "స్మశానానికి దారేది"!)

********************

ఈ కవిత నా జీవితం

కలం నా హృదయాన్ని చిలికింది

రాయాలంటే అక్షరాలు ఎదురు తిరిగినాయి

పదాలు కన్నీళ్ళయి కరిగిపోయాయి......అపుడే

*******************

సుదూరం నుండి సమీరం 

సీని గీతాన్ని లీలగా మోసుకొచ్చింది

'సంసారం ఒక చదరంగం

అనురాగం ఒక రణరంగం

స్వార్దలా మత్తులో సాగేటి ఆటలో

ఆవేశాలు ఋణపాషాలు తెంచే వేళలో............

బంధాలను ప్రేమించే తాపత్రయ హ్రదయులకు.........

మీ అర్జున్

21.10.2020....



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Tragedy