ఆనందాల లోగిలి
ఆనందాల లోగిలి


అమ్మ చేసిన గారెలు
నాన్న తెచ్చిన బజ్జీలు
తాతయ్య ఇచ్చే పది రూపాయలు
అమ్మమ్మ కొనిచ్చిన కొత్తబట్టలు
గుర్తుచేస్తున్నాయి బాల్య జ్ఞాపకాలు
అమ్మ చేతిలో తిన్న దెబ్బలు
నాన్న చేరదీసి ఓదార్చిన మాటలు
తాతయ్య చెప్పిన బొమ్మల కథలు
అమ్మమ్మ అడిగిన పొడుపు కథలు
గుర్తుచేస్తున్నాయి మధుర బాల్య జ్ఞాపకాలు
I love my family