STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

ఆమె

ఆమె

1 min
4


అమ...ఆమె

ఎందుకో...

అమ...ఆమె ఎపుడు చీకటిలోనే... పాపమో...పుప్నెమో...

పసిపాప నగవులా 

పక్షి కూతలా...

విచ్చే పూ మొగ్గలా

ఆనందమిచ్చే అందమో....

లుకలుకలాడే పురుగుల తుట్టెలా

దప్పికి కాని బురదగుంటలా...

బతుకు ఊహనీని ఊబిలా

అంతర్మథనం..ఆత్మ బోధ లేని మనసులా

కఠినతే కొలువైన కరకు గుండెలా

సమ్మోదమీయని...హితమవని పాటలా

వికారమో

ఆశనో...నిరాశనో హెచ్చిన

 కనుదోయి కెంపు తడి

పరచుకున్న చెంపలై మిగులుతూ....

పచ్చనై కనువిందౌ ఛదమో

పురి విప్పిన పీలి పింఛమో

వెలుగుల వరుసలై వసుధను వెలిగిస్తు న్న మిణుగురుల ప్రభలలో

విభవమై మిగులుతూ...

జీవమిచ్చు జలకళ కల రవాలలో

దృష్టై దృశై సృష్టికనువౌ 

పలు వింతలొలుకు పక్షాంతమై

 పల వింతలు ప్రభవింపజేయు ప్రమి( మ)దై

ఎవరి గణనకు రాని ...ఎవరు గమనించని..

గుర్తింపునందని ప్రమితై

వెన్నెలంచు చీకటి చీరతో...

మనసునే కాదు

మనో భావాలను 

తెలియనెవరు లేక

తెలుప నెవరు లేక

తెలుపకెవరికి...

కన్నీటనో...పన్నీటనో

తమను తామే దాచుకుంటూ


Rate this content
Log in

Similar telugu poem from Romance