ఆలోచన💭
ఆలోచన💭
1 min
415
పద్యం:
ముందునాలొచించిన భయమున్ గలుగును
చింత జెందకుము గతము నించి, బతుకు
వర్తమానమున గలుగు పరమసుఖము
బ్రహ్మచారిణి! శారద! భారతాంబ!
భావం:
ఓ బ్రహ్మచారిణి, శారదా, తల్లీ భారతీ! భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ కూర్చుంటే భయము కలుగుతుంది (ఎందుకంటే అది మన చేతిలో లేదు) కాబట్టి, జరిగిపోయిన గతాన్ని తలిచి బాధ పడుతూ కూర్చోరాదు (ఎందుకంటే అదీ మన చేతినుండి జారిపోయినదే), కాబట్టి ప్రస్తుతం ఏమి చేయాలో ఆలోచించాలి (ఎందుకంటే అదొక్కటే మన చేతిలో ఉన్నది) అలా చేసినట్లైతే అమితమైన సుఖాన్ని పొందగలము.