ఆకులో -అకునై
ఆకులో -అకునై
పండు టాకును నేను
నేలరాలాను
మళ్ళీ మొక్కకు ఎరువుగా
వస్తానేమో...
చెట్టువేరే నాకు అమ్మ
అయ్యింది
కొమ్మకొమ్మలో రెమ్మనై
ఎదిగాను
సూర్యరశ్మి సోకి
ఇంపుగా ఎదిగాను
పిల్లగాలులు తాకి
పల్లవించాను
పూవులూ , కాయలు నాకు
అక్కలు , తమ్ముళ్లు
చెలిమితో మేమెపుడూ
కలసి వుంటాము
బలిమితో ఎవరైనా
విడదీయుగాని
లేకున్న మాభందం
అపురూపమే
ఎన్ని యేళ్లైన గాని
నిలిచి ఉంటాము
మానవునికి రక్షణ గా
బ్రతుకుతుంటాము
కాలముతీరాక ఇలా రాలుతుంటాము.

