ఆకలి
ఆకలి
ఎంతతీపి ఐసుపుల్లో
కోతికి తెలిసింది,
ఆకలి గొడవకు
విరామం దొరికింది.
గుండెచాటు ఆకలి ఆవేదనకు
అల్లరే శాపమైంది,
మాయమైన చెట్టుచేమ
యాతనల బ్రతుకును దరిచేర్చింది,
ఆకలిమాటు తెగింపు
బ్రతుకును కాపాడే వరమైంది,
గుడి బడి అంగడి ఏదైనా
బ్రతుకుపాఠం చెప్పేటి గురువైంది.
మంచిచెడు తెలియని తనమే
శోధనలలో వేదనలు చూపించింది,
వా'నర'జాతి అనుబంధం
కంటిచుక్కల మనసుబాధ చూడలేకుంది,
వృధాచేయు ఆహారంలోనూ
హృదయపు అలజడి మాన్పలేని కాఠిన్యమే దాగుంది
కలహించే నడతే
నిప్పులపై నిదురించుట నేర్పింది,
ఆకలిదప్పులు తీర్చేటి దేవుడు
కానరాక కదిలిస్తుంటే జీవితానికి అర్ధం
ఉనికికి పరమార్ధం తెలియకుంది
