ఆకాశం సముద్రం ఓ ముద్దు
ఆకాశం సముద్రం ఓ ముద్దు
సూరీడు ఇంటికి పోతున్నాడు
సందురుడు తొంగి సూసేస్తాడు
ఆమె అటు వైపు తిరిగి నిలుసుంది
సొంత శ్వాసే బరువుగా ఉంది
పక్షులు ఇంటికి పోతున్నాయి
పైరగాలి సద్దుమణిగింది
అతడు కాస్త అటూ ఇటూ చూశాడు
మెల్లిగా అడుగులు వేశాడు
మేఘాలు కొండల దగ్గరికి చేరాయి
ఏదో జరుగుతున్నట్టు ఆగాయి
అతడు ఆమె పెదాల్ని తాకాడు
సముద్రం హోరు తగ్గింది
ఆమె పెదాలు అతణ్ణి ముద్దాడాయి
ఆకాశం సముద్రంలో కలిసిపోయింది
ఒక్క ముద్దుకే ఆమె మురిసిపోయింది
ఆకాశం రంగులు మార్చింది
కాస్సేపు ప్రణయం
రోజంతా విరామం
ఆకాశం సముద్రం ఓ ముద్దు
అని నేను వ్రాసుకుంటూ కూర్చున్నా
సముద్రాన్ని చూస్తూ
కాదు కాదు
ఆకాశాన్ని తనలో కలుపుకున్న సముద్రాన్ని చూస్తూ

