Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

sesi saradi

Abstract Drama Romance

4.5  

sesi saradi

Abstract Drama Romance

నీ రాకకై

నీ రాకకై

1 min
462



ఇంకా నా కనులలో నీ రూపు 

నిలుపుకొననే లేదు! 

ఇంకా నా హృదిలో నీ మోము 

 ముద్రించనే లేదు !

ఇంకా నీ చేతిలో చెయ్యి వేసి

 నడువనేలేదు! 

ఇంకా నీ సాన్నిహిత్యం లోని

 మాధుర్యాన్ని అనిభవించనేలేదు !

ఇంకా నీ పరిరంభనం లోని 

తియ్యదనాన్ని ఆస్వాదించనే లేదు! 

ఇంకా నీతో సహచర్యము

 మొదలు పెట్టనే లేదు! 

ఇంతలోనే 

సమయం ఆసన్నమయింది 

కాబోలు ,

నా రాకకై 

పుష్పక విమానము

 వేచి ఉన్నది .

సమయము మించక ముందే

ఒకసారి నువ్వు వస్తే, 

తనివి తీరా నిన్ను 

కనులలో నింపుకొని 

ఎవరూ కానరాని లోకాలకు

తృప్తిగా తరలి పోతాను! 



Rate this content
Log in