మధురస్మృతులు
మధురస్మృతులు
940 చలిమంటలు
ఓ శీతాకాలపు ఉషోదయాన
తుషార తళుకులద్దిన గడ్డిపరకలు
పవనవీచికలతో పరాచకాలాడే వేళ
మంచు దుప్పటి కప్పుకున్న
స్వచ్ఛమైన మా పల్లె సీమ
కోడి కూతతో నిదుర లేచి
కళ్ళాపి వాకిళ్ళు రంగవల్లిని అద్ది
కళకళలాడే తరుణాన
మెల్లమెల్లగా అడుగులన్నీ కలిసి చలిమంటల ముందు మోకరిల్లగా
వెచ్చని సెగలు అంతే వెచ్చని ఊసులతో
కొంటెతనాన్ని రంగరించి
గిలిగింతల కేరింతలతో
ఉల్లాస వీచికలు వెంటేసుకుని
తమతమ పనులకు
పురమాయించే పల్లె దినచర్య
ప్రశాంత వాతావరణం
ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని
మధురానుభూతులు మధుర స్మృతులు
