STORYMIRROR

Praveena Monangi

Romance

4  

Praveena Monangi

Romance

అభిసారిక

అభిసారిక

1 min
304


 నను నీవు వలచిన నాటి చీర కట్టుకొని నీ హృదయ కుసుమాలను నా కురులలో మొలచి 

నీ ముఖ అద్ధాన్ని చూసుకుంటూ అలంకరించుకొని 

మిను వీధిలో కూర్చొని నీ హృదయంలో నిలచిన 

నా కనుపాపలు నా హృదయ వాకిల్ల వైపు  

నీ రాక కోసం ఎదురుచూస్తున్నాయి 

ఏ ద్వనిని విన్నా అది నాహృదయ సవ్వడేనని ఆనందపు ఉరకలతో హృదయ తలుపులను తెరిచాను  

కాని నాహృదయ సవ్వడి కాదు,భ్రమని తెలిసిన పిదప 

నీ హృదయము వద్ద నిలయమయిన నా నయనాలు 

 కన్నీటి జ్వాలను విసురుతున్నాయి 

నాకు తెలుసు నీవు నా కన్నీటి మంటను తట్టుకోలేవని 

నీ హృదయం స్పందించలేదా నా అందెల సవ్వడిని నీవు గ్రహించలేదా

మరిదేనికి ఈ జాప్యము ఎంతవరకు నాకు ఈ విరహము

నీ రాకకై నా నయానాలు మూసివున్నా 

నా హృదయ తలుపులును ఎప్పుడు తట్టినా 

అవి స్పందించి నిన్ను ఆహ్వానిస్తాయి.


Rate this content
Log in

Similar telugu poem from Romance