మానససరోవరం
మానససరోవరం
జీవితంలో అద్వితీయమైనది కౌముదీ కౌమారం,
పరస్పర మనసుల వినిమయం ఎంతో ప్రీతికరం,
హృదయంలో హిమాలయం తీసుకొనెను ఆకారం,
అందున నా ప్రణయం ఓ సరస సురస సరోవరం |౧|
నీ మణిహార అందం సహజంగానే మనోహరం,
అభిలాషించెను నీ వద్దనుండి అనురాగ వరం,
కావలెను నీ ప్రియుడు అవటానికి నీ అంగీకారం,
నింపుదాం మన యవ్వనంలో రసమయ సారం |౨|
నీ ఎఱుకే నా కోసం ఒక అరుదైన చమత్కారం,
నీ మాట పాటలో ఆలకించెను సుస్వర స్వరం,
నమ్మికతో నా అనురక్తిని చేయవలెను స్వీకారం,
అందమైన జీవితం కొరకు కావాలి నీ సహకారం|౩|
మన అసీమ అనురక్తి చేరుకుంది కైలాస శిఖరం,
ఈ నిశ్శబ్దంలో వినిపించెను ప్రణయ ఝంకారం,
మానసహంస హంసికల వలె చేద్దాం సమాహారం,
జంటగా సంతరిద్దాం విహరిద్దాం మానససరోవరం |౪|