STORYMIRROR

VENKATALAKSHMI N

Inspirational Others Children

4  

VENKATALAKSHMI N

Inspirational Others Children

బొమ్మలకొలువు

బొమ్మలకొలువు

1 min
412

శీర్షిక: కొలువు - నెలవు

*************************

నవరాత్రులలో నవ్యరీతిలో

కొలువైన కొలువు

అపురూపమైన అందాల కొలువు

ప్రాచీన సాంప్రదాయపు నెలవు

ఆడవారి అభిరుచులకు అందాల నెలవు

దసరా బొమ్మల కొలువు

సరదా ఆటపాటల వేడుక

ముక్కోటి దేవతలు ముచ్చటగా

కొలువైన కొలువు

కరుణతో కనకదుర్గమ్మ

ఏతెంచి కొలువైన కొలువు

కామధేనువు కదలివచ్చి

ఆసీనమైన కమ్మని కొలువు

కులుకులొలికే కొండపల్లి బొమ్మలు

హొయలొలికే నక్కపల్లి బొమ్మలు

సున్నితవేళ్ళతో అల్లిన బుట్టలు

మేమేం తక్కువ కాదంటూ

కళాత్మకతకు పదును పెట్టే బొమ్మలు

పంచాంగ బాపడు పచారికొట్టు కోమటి

మడికట్టుతో పెద్ద ముత్తైదువ

దేశాన్నేలిన నాయకుల బొమ్మలు

రంగుల లైట్లతో రయ్ రయ్ మంటూ ప్రయాణసాధనాల బొమ్మలు

తీరుగా పద్ధతిగా అమర్చి

మేలుకొలుపు పాటలతో సుప్రభాతమాలపించి

పేరంటాళ్ళకు తాంబూలమిచ్చి

పవళింపు సేవతో ముగింపు పలికి

సనాతన సాంప్రదాయపు వేడుకను

అంగరంగ వైభవంగా జరుపుకునే

దసరా బొమ్మల కొలువు

కమనీయం కడు రమణీయం


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational