SATYA PAVAN GANDHAM

Horror Tragedy Thriller

4.2  

SATYA PAVAN GANDHAM

Horror Tragedy Thriller

"యోధ (ఓ ఆత్మ ఘోష) - 14"

"యోధ (ఓ ఆత్మ ఘోష) - 14"

8 mins
1.8K


"యోధ (ఓ ఆత్మ ఘోష) - 13" కి


కొనసాగింపు...


"యోధ (ఓ ఆత్మ ఘోష) - 14"


రూం బయట నుండి


"పార్ధు...


పార్ధు..." అంటూ ఎవరో పిలుస్తున్నట్టు పార్ధుకి వినిపిస్తున్నా, అతనిలో మాత్రం చలనం లేదు.


జారుగా గడియ పెట్టి ఉన్న, ఆ రూం డోర్ ని కాస్తా...


కొంచెం గట్టిగా తోయడంతో చివరికి అది తెరుచుకుంది. అలా ఆ వ్యక్తి పార్ధు దగ్గరికి వచ్చి, తనని తట్టి లేపే ప్రయత్నం చేస్తున్నాడు.


"హెల్ప్...


హెల్ప్ ...!


ప్లీజ్ కాపాడండి..


ప్లీజ్ నన్ను కాపాడండి..! " అంటూ పార్ధు ఒకటే మూలుగుతున్నాడు.


చిర్రేత్తిన ఆ వ్యక్తి, ముసుగులో ఉన్న పార్ధుని ఒక్క తన్ను తన్నడంతో బొక్క బోర్లా కిందపడ్డాడు.


"అమ్మా..!" అంటూ గట్టిగా అరుస్తూ ఆ మంచం మీద నుండి కిందపడ్డ పార్ధు, చుట్టూ చూస్తున్నాడు...


పక్కనే వాళ్ల నాన్న, పార్ధుని అలా తన్నింది కూడా ఆయనే!


"గాడిద...


సన్నాసి...


పనికిమాలిన వెధవ ...


నీకెన్ని సార్లు చెప్పాలి రా..!


పడుకునే ముందు ఆ దెయ్యం కథలు, క్రైమ్ వార్తలు చదవొధ్దని..!,


నైట్ అంతా అవి చదవడం,


నిద్రలో కలలు కనడం,


ఇదిగో తెల్లారాకా ఇలా కలవాట్లు పలకుతూ మమ్మల్ని చంపడం,


ప్రతిరోజూ మాకిది మామూలైపోయింది" అంటూ తిట్టిన తిట్లు తిట్టకుండా తిడుతున్నాడు పార్ధుని, పార్ధు వాళ్ల నాన్న.


తనకొచ్చిన ఆ కల నుండి, ఆ నిద్ర నుండి తేరుకున్న పార్ధు, అదంతా ఆ నైట్ తనకొచ్చిన కలని నమ్మలేకపోతున్నాడు.


(అంటే, ఇప్పటివరకూ పార్ధు తన ఫ్రెండ్స్ తో ఆ గెస్ట్ హౌజ్ కి వెళ్ళడం, అక్కడ వాళ్ల ప్రాణాలు పోవడం, చివర్లో యోధ తన కథ చెప్పడం, అతను కూడా ఆఖరికి అలా అవ్వడం జరిగిందంతా తను కన్న ఓ కలన్న మాట)


ఇంతలోనే పార్ధు ఆర్తనాదాలకి, భర్త అరుపులకి పరిగెత్తుకుంటూ వచ్చింది పార్ధు వాళ్ళమ్మ ఆ రూం లోనికి,


చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనిస్తున్న పార్ధు,


చివరికి అదంతా తనకొచ్చిన కలేనని కన్ఫర్మ్ చేసుకున్నాడు.


ఆ కలలో జరిగింది(వాళ్ల ఫ్రెండ్స్ మిస్సింగ్, ఆ క్రైమ్స్) ఒక్కోటిగా ఆలోచిస్తూ... అప్పుడే, అక్కడే, ఏదో వెతుకుతున్నాడు.


సరిగ్గా ఆ సమయంలోనే, అసలే కోపంగా చిరాకుతో ఉన్న పార్ధు వాళ్ల నాన్న,


ఆ రూం నుండి బయటకు వెళ్తూ... వెళ్తూ...


"ఇందాకటి నుండి వీడి ఫ్రెండ్స్ ఒకటే కాల్ చేస్తున్నారు నాకు, వీడి ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ లో ఉంది అంట..!


ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నారు..


అయ్యగారు కొంచెం తేరుకున్నాక విషయం చెప్పు..!" అంటూ అది పార్ధుకి కూడా వినపడెంత గట్టిగా, తన భార్య వంక చూస్తూ, అది తనకి చెప్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు.


ఇంతకీ తను వెతుకుతున్నది కూడా ఆ ఫోన్ కోసమే,


పక్కనే టేబుల్ పై నున్న ఆ ఫోన్ తన చేతుల్లోకి తీసుకుంటున్న పార్ధు దగ్గరికి వచ్చిన అతని తల్లి


"ఏంట్రా...


ఇదంతా..!


నీకెన్ని సార్లు చెప్పాన్రా కన్నా..!


ఇలా నైట్ ఆ దెయ్యాల గురించి, భూతాల గురించి చదివి, వాటి గురించి ఆలోచిస్తూ నీ బుర్ర పాడు చేసుకోవద్దని...


ఇప్పుడు చూడు అనవసరంగా ఆయనతో తిట్లు తిన్నావ్...!"


అంటూ ఆవిడ కూడా కొంచెం సున్నితంగానే మందలించింది.


పార్ధు మాత్రం, ఒకపక్క ఆవిడ మాటలు వింటూ..


మరొక పక్క ఆ ఫోన్ చూస్తూ,


"అబ్బా...!


నువ్వు కూడా ఏంటమ్మా..?


ఆయనలాగా...


నేను చదివింది దెయ్యాలు... భూతాలు.. గురించి కాదమ్మా!


క్రైమ్ న్యూస్...


అంటే నేర వార్తలు..!" అంటూ బదులిచ్చాడు పార్ధు...


"హా... ఏదోకటి లేరా(తన బుర్ర గోక్కుంటూ)


రెండు ఒకటి కాదేంటి..!


అయినా ఈ రోజు ఎక్కడికో, ఏదో ప్రాజెక్ట్ పని మీద వెళ్ళాలి


అన్నావ్ కదా..!


లే.. లేచి.. రెఢీ అవ్వు ..!


ఈలోపు నేను టిఫిన్ రెఢీ చేస్తాను!" అంటూ అక్కడి నుండి తను కూడా వెళ్లిపోయింది.


ఆ ఫోన్ ఎంత ఆన్ చేసినా ఆన్ అవ్వకపోవడంతో, అది ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ లో ఉందని గ్రహించి,


పక్కనే ఉన్న సాకెట్ కి ఫోన్ ఛార్జింగ్ లో పెట్టీ


అప్పటికే గోడ గడియారం తొమ్మిదైనట్టు తొమ్మిది గంటలు కొట్టడంతో,


కంగారు కంగారుగా తను వాష్ రూం లోకి వెళ్ళిపోయాడు పార్ధు.


అలా పార్ధు వాష్ రూం లో ఫ్రెష్ అవుతూనే...


"ఇప్పటికీ ఇదంతా కలంటే, నేను నమ్మలేకపోతున్నాను..!


డాడీకి మా ఫ్రెండ్స్ కాల్ చేశారంటే, వాళ్ళకి ఏం అవ్వలేదన్నమాట...!


అయినా ఒకవేళ నా మొబైల్ వర్క్ అవ్వకపోయినా ఎప్పుడూ డాడీ మొబైల్ కి వాళ్ళు కాల్ చెయ్యరే, అలాంటిది పదే పదే ఎందుకు చేసినట్టు వాళ్ళు..?


హా.. ఈ రోజు టూర్ కి వెల్దామనుకున్నాం కదా,


ఇప్పటికే లేటయ్యిందని చేసుంటారు లే...!


కానీ, ఆ కల అచ్చం కళ్ళకు కట్టినట్లు ఉందే!


ఇదంతా అక్కడికి వెళ్ళక ముందే నాకెందుకు తెలిసింది?


ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్,


ఇప్పుడు ఇదంతా వీళ్లతో(తన ఫ్రెండ్స్) చెప్తే భయపడి రావడం మానేస్తారేమో..?"


అనుకుంటూ అనేకరకమైన ఆలోచనలతో సతమవుతూ స్నానాన్ని ముగించుకుని బయటకి వచ్చాడు.


అలా బయటకి వచ్చిన పార్ధు, వచ్చీ రావడంతోనే సరాసరి ఆ ఫోన్ ఉన్న టేబుల్ వద్దకు వెళ్ళి ఆ ఫోన్ తీసి చూడగా...


అప్పటికే, ఆ ఫోన్లో వాళ్ల ఫ్రెండ్స్ దగ్గర నుండి కాల్స్ వచ్చినట్టు, చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి అందులో.


ఆ ఫోన్ సైలెంట్ మోడ్ లో ఉండడం వల్ల కాబోలు, అవేవి తనకి వినపించలేదు.


"వీల్లెందుకిన్ని సార్లు చేశారు!


ఏమైంటుంది?" అనుకుంటూ విశాల్ కి కాల్ బ్యాక్ చేశాడు పార్ధు.


ఆ కాల్ లిఫ్ట్ చేసిన విశాల్..


" ఒరేయ్ పార్ధు..!


నీకెన్ని సార్లు ట్రై చేసినా రెస్పాన్స్ లేదంట్రా..!


మేమందరం ఎంత సేపటి నుండి నీకు ట్రై చేస్తున్నామో తెలుసా..!


అసలు ఏమైపోయావ్ రా..!" అంటూ కొంచెం కంగారుతో కూడిన ఆవేశంతో మాట్లాడుతున్నాడు.


" అది... అది... " అంటూ పార్ధు తనకి బదులిచ్చేలోపు


మధ్యలో


"సరే..!


సరే..!


నీకసలు విషయం తెలిసిందా..?" అంటూ పార్ధుని ప్రశ్నించాడు విశాల్...


"ఏ విషయం..?


అసలేమైంది..!" అంటూ పార్ధు ప్రశ్నార్థకం కలిగిన స్వరంతో విశాల్ ని ఆశ్చర్యంతో నిలదీయగా...


"అదే రా..!


మనం ప్రాజెక్ట్ పేరుతో ఈ టూర్ ప్లాన్ చేసిన విషయం


మా ఇంట్లో తెలిసిపోయింది.


మా ఇంట్లోనే కాదు, అందరి ఇళ్ళల్లో తెలిసిపోయింది.


మేమందరం ఈ టూర్ కి రావడం దాదాపు ఇంపాజిబుల్,


ఇక ఈ టూర్ కేన్సిల్ అయినట్టే,


అన్నట్టు ఈ విషయం మీ ఇంట్లో ఇంకా తెలీదా..?"


హా...


తెలిసినట్టు లేదులే...!


తెలిస్తే, మీ డాడీ... మేము కాల్ చేసినప్పుడు, అంత సాప్ట్ గా రెస్పాండ్ అవ్వరు." అంటూ విశాల్ జరిగిందాన్ని పార్ధుకి వివరించి చెప్పాడు.


దాంతో షాక్ అయిన పార్ధు


"అసలేం మాట్లాడుతున్నావ్ రా..!


అసలేమైంది..! ఏం జరిగింది...!


టూర్ కేన్సిల్ అవ్వడం ఏంటి..?


మీ ఇళ్ళల్లో ఈ విషయం గురించి ఎలా తెలిసింది..!


నాన్చకుండా జరిగిందేంటో స్ట్రెయిట్ గా చెప్పు..!" అంటూ ఎక్కడ తను ఆ విక్కి చేతిలో ఓడిపోతే, ఆ ఈవెంట్ తన చేజారి పోవడంతో పాటు, తన కాలేజ్ మేట్స్ అందరికీ ఏం సమాధానం చెప్పాలోనని పార్ధు కొంచెం కోపంగా అవేశ్ ని అడిగేసరికి,


" ఏమో రా పార్ధు ..!


నువ్వు... ఆ విక్కి ఛాలెంజ్ విసురుకుని, ఆ గెస్ట్ హౌజ్ వెళ్ళడానికి ప్లాన్ చేసిందంతా ఆ ప్రిన్సిపల్ కి తెలిసిందంటా..!


ఆ ప్రిన్సిపల్ మా అందరి పేరెంట్స్ కి కాల్ చేసి విషయం అంతా చెప్పేశాడు.


పైగా ఇంత చెప్పిన తర్వాత కూడా, మీ వాళ్ళకి ఏమైనా అయితే అది నా రెస్పాన్సిబుల్ కాదని, కొంచెం గట్టిగా మా పేరెంట్స్ నీ బెదిరించే సరికి,


ఇదంతా తెలిసుకున్న మా పేరెంట్స్...


మేము చెప్పిన అబద్ధాలకు అసలే మా మీద కోపంతో రగిలిపోతున్నారు,


బయటకి వెళ్తే కాళ్ళు విరగొడమంటూ మమ్మల్ని హెచ్చరించారు.


దాదాపు మన వాళ్ల అందరి ఇళ్ళలోని ఇదే పరిస్థితి...!


నీ సిట్యుయేషన్ కూడా ఏంటో తెలుసుకుందామని, నీకు మార్నింగ్ నుండి ట్రై చేస్తున్నాం.


మీ డాడీకి ఇంత వరకూ ఆ ప్రిన్సిపల్ చేయలేదంటే పర్లేదు...


ఎందుకైనా మంచిది, ఎప్పుడైనా ఆ ప్రిన్సిపల్ ఆయనికి కాల్ చెయ్యొచ్చు..


కొంచెం జాగ్రత్త రా..! " అంటూ విశాల్ పార్థుకి జాగ్రత్తలు చెప్తూ తనని అప్రమత్తం చేస్తుంటే,


ఆ ఫోన్ అక్కడే పడేసి,


పరుగున పరుగున హల్ లోకి వెళ్ళాడు పార్ధు..


అప్పటికే, తన తండ్రి టెలిఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు...


"హా...


స...స...సరే.. సార్..!


నే..


నేను చూసుకుంటాను అండి,


చాలా థాంక్స్ అండి..!


ఈ విషయం మాకు చెప్పినందుకు..!" అంటూ ఆ ఫోన్ పెట్టేస్తూ... అప్పటికే అక్కడికి వచ్చిన పార్ధు వంక చాలా కోపంగా చూస్తున్నాడు వాళ్ల నాన్న.


పార్థుకి విషయం అర్ధమయ్యి, అక్కడి నుండి మెల్లగా జారుబోతుంటుంటే,


సరిగా అప్పుడే, పార్ధు వాళ్ళమ్మ కూడా అక్కడికి అదే హాల్లో ఉన్న వాళ్ళందరికీ వచ్చింది.


తన భర్త కోపాన్ని గమనించని ఆవిడ...


"నాన్న.. టిఫిన్ చేసేయి,


ఎక్కడికో వెళ్ళాలి అన్నవ్ కదా..! అంటుంటే,


పార్ధు తన తల్లి వంక చూస్తూ ...


"ఇప్పుడేం మాట్లాడొద్దు..!" అన్నట్టుగా తన కళ్ళను వాళ్ల నాన్నకేసి చూపిస్తూ, ఆ కళ్ల సైగలతోనే వాళ్ళమ్మకి వివరించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు.


అర్ధమయ్యి... అది గమనించిన ఆవిడ,


అప్పటికే తన కోపంగా ఉండడం గమించింది.


ఇంతలోనే అందుకున్న పార్ధు తండ్రి,


"పంపించవే,


పంపించు...


అసలు నువ్వే వాడినిలా తయారు చేసావ్..!


వాడు ఎక్కడికో వెళతాను అనడం,


ఏంటో..! ఎక్కడికో..! తెలుసుకోకుండా నువ్వు వాడికి సపోర్ట్ చేయడం...!" అంటూ తనపై కేకలు వేస్తున్నాడు.


"అది కాదు... డాడీ!" అంటూ పార్ధు అడ్డుపడుతుంటే,


"ఛీ...!


నువ్వు నోరు ముయి వెధవ..!


ఇన్నేళ్లలో ఎప్పుడూ లేనిది,


మీ కాలేజ్ ప్రిన్సిపాల్ కాల్ చేసి, నన్ననరాని మాటలు అన్నాడు.


ఇంకా నా మొహం చూసి, పైగా ఆ కాలేజ్ లో నీకున్న ఆ పేరు వల్ల, ఓ చిన్న వార్నింగ్ ఇచ్చి, నిన్ను ఇంతటితో వదిలేస్తున్నామని చెప్పాడు."


"అసలేం జరిగిందండి..!" అంటూ పార్ధు తల్లి కల్పించుకోబోతుంటే,


"ఇంకేం జరగాలి...!


ఈయన గారేదో కాలేజిలో ఏదో గొడవపడి,


ఎవడితోనో ఛాలెంజ్ చేసి వచ్చారంట ..!


ఛాలెంజ్ లు..


అవేవో పిశాచాలున్న గెస్ట్ హౌస్ లో ఒక వారం పాటు,


ఈయన గారి ఫ్రెండ్స్ తో ఉండి వస్తానని, అక్కడేం లేవని వీడేదో నిరూపిస్తానని ప్రగల్భాలు పలికాడంట!


ఇదంతా ఆ కాలేజ్ యానివర్సరీ ఫంక్షన్ కోసమంట,


ఎవడు గెలిస్తే వాడికి అది కండక్ట్ చేసే ఛాన్స్ వస్తుందని,


పోని, వీళ్ళ ప్రాణాల గురించి అటుంచితే,


ఎందుకంటే వీళ్లకెలాగో లెక్కలేదు కాబట్టి,


కానీ ఇంత చేసిన మనకు, కనీసం విషయం కూడా చెప్పకుండా వెళ్దామని ప్లాన్ చేసారంట


ఈ దొరగారు.. వీళ్ళ ఫ్రెండ్స్ కలిసి..


రేపు వీళ్లకేదైనా జరగరానిది జరిగితే,


ఇదంతా వీళ్ళ కాలేజ్ ప్రిన్సిపల్ ఇప్పుడే కాల్ చేసి చెప్పాడు.


"వాడెవడు...?


అదే...


నీతో ఛాలెంజ్ చేసిన వాడి పేరు...!


ఏదో చెప్పాడే... మీ ప్రిన్సిపల్..!


సరిగా గుర్తుకు రావడం లేదు...!" అంటూ ఆయన తడబడుతుంటే,


"వి..వి ..


విక్కి...


డాడీ!" అంటూ బదులిచ్చాడు పార్ధు..


"హా... వాడే !


వాడిని కాలేజ్ నుండి సస్పెండ్ చెద్ధామని అనుకున్నారు అంట, మిమ్మల్ని అలా రెచ్చగొట్టి ఛాలెంజ్ చేసినందుకు,


కానీ, వాడి పలుకుబడికి భయపడి ఏమీ చేయలేక, సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి వదిలేశారట.


నిన్ను కూడా కాలేజ్ నుండి సస్పెండ్ చేయమని నేనే చెప్దామని అనుకున్నాను..


కానీ, ఇప్పటివరకూ నువ్వేదో ఆ కాలేజిలో ఉద్దరించావని, ఆ ఈవెంట్ కండక్ట్ చేసే ఛాన్స్ కూడా నీకే ఇచ్చారట.


మీ ప్రిన్సిపల్ కి నీ మీదున్న నమ్మకంతో మన్నించి వదిలేయడమే కాకుండా, నువ్వు తలపెట్టిన ఈ మహా కార్యానికి నీకా బహుమతి కూడా ఇచ్చాడు(ఈవెంట్ కండక్ట్ చేసే ఛాన్స్)


అన్నట్టు మీ ప్రిన్సిపాల్ నిన్నొకసారి కలవమని చెప్పాడు." అంటూ ఆ ప్రిన్సిపల్ తో జరిగిందంతా వివరించి చెప్పాడు కోపోద్రిక్తుడైన పార్ధు తండ్రి... పార్ధుకి, పార్ధు తల్లికి.


లోపలికి వెళ్ళిన పార్ధుకి,


సరిగ్గా అప్పుడే ఆ కాలేజ్ ప్రిన్సిపల్ దగ్గర నుండి కాల్ వస్తుంది.


ఆ కాల్ లిఫ్ట్ చేసిన పార్థుతో


"ఏంటి.. పార్ధు


ఇదంతా....!


ఆ విక్కి గాడు, వాళ్ల ఫ్రెండ్స్ గురించి తెలిసి


నువ్వుకూడా ఏంటి పార్ధు..?


పోనీ, ఆ విశాల్, గోపాల్, అవేశ్ అంటే ఏం తెలియని తెలివి తక్కువ దద్దమ్మలు,


వాళ్ళతో కలిసి నువ్వు కూడా ఏంటి..?" అంటూ ఆ ప్రిన్సిపల్ కూడా పార్ధుని మందలించే ప్రయత్నం చేసాడు.


దాంతో పార్ధు...


"సార్...అది,


వాళ్ళు ఆ గెస్ట్ హౌస్ గురించి అనేకరకమైన అపోహలు సృష్టించి, స్టూడెంట్స్ లో అపోహలు, మూఢనమ్మకాలు సృష్టిస్తున్నారు..


ఇంత జ్ఞానం ఉండి, ఇంకా వాటినలా గుడ్డిగా నమ్మడమేంటి సార్..!


అవి వాళ్ళందరి మనసుల్లోంచి పోగడదామనే నేనలా...!" అంటూ పార్ధు ఆ ప్రిన్సిపల్ కి వివరించబోతుంటే,


"వాటి గురించి నీకెందుకు పార్ధు...!


(కొంచెం సీరియస్ అవుతూ..)


అయినా ఎవరి నమ్మకాలు వాళ్ళవి,


ఇప్పుడు నువ్వు అక్కడి వెల్లొచ్చి, అక్కడ ఏం లేదని చెప్తే,


వాళ్ళందరూ నీ మాట నమ్ముతారనుకున్నావా..?


ఈ సమస్య ఇంతటితో సమసిపోతుందనుకున్నావా?


ఒకవేళ ఇప్పుడు వాళ్ళు నమ్మినా, రేపు వాళ్ల అభిప్రాయం మార్చుకోకుండా అలాగే ఉంటారని నమ్మకం ఏంటి..?


దానికి నువ్వు గ్వారెంటీ ఇవ్వగలవా..?


మధ్యలో పార్ధు కలుగజేసుకుని,


"అది కాదు సార్..!


ఒకసారి నే చెప్పేది..." అంటూ అనబోతుంటే,


అదేం పట్టించుకోని ఆ ప్రిన్సిపల్..


తన వాదనను అలాగే కొనసాగిస్తున్నాడు.


"అయినా నువ్వెంత చేసినా...


అది ఈ కాలేజ్ వరకు మాత్రమే పరిమితం,


ఈ ప్రపంచాన్ని అంతా నువ్వు మార్చలేవు కదా..!


"భూమి గోలాకారంగా ఉందని చెప్తే, గెలీలియోని విషం పెట్టీ చంపారు.


సూర్య కేంద్ర సిద్దాంతాన్ని ప్రతిపాదించిన కోపర్నికస్ ను, మంటల్లో కాల్చి చంపారు ఈ జనం.


నిన్ను మాత్రం ప్రాణాలతో వదులుతారా..?


మనిషి నమ్మకంతో పెట్టుకుంటే అది ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదకరం. గుర్తుంచుకో పార్ధు..


అందుకే... నీ మంచి కోరి నీకు చెప్తున్నా,


వీటికి నువ్వు కొంచెం దూరంగా ఉంటే బెటర్...


కాదు...కూడదు అంటావా...!


ఈ కాలేజ్ లో నువ్వున్నంతవరకూ నీ సంరక్షణ నా బాధ్యత,


రేపేదైన జరిగి, ఈ కాలేజ్ కి చెడ్డ పేరు రావడం నాకిష్టం లేదు.


ఎలాగో ఇంకొంతకాలంలో మీకెలాగో ఇక్కడ కోర్సు అయిపోతుందిగా... అప్పటివరకూ ఓపిక పట్టు,


ఆ తర్వాత నీ ఇష్టం!" అంటూ ఆయన ముక్కుసూటిగా పార్ధుకి చెప్పాల్సింది చెప్పి ఆ కాల్ కాస్తా కట్ చేశాడు.


డైలమాలో పడ్డ పార్ధు...


తన ఫ్రెండ్స్ ఒక్కొక్కరికి కాల్ చేసాడు..


అందరి దగ్గర నుండి ఒక్కటే సమాధానం,


"వాళ్లింట్లో వాళ్ళు భయపడుతున్నారని, వాళ్ళని బయటకి వెళ్లనివ్వడం లేదని, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తాట తీస్తామని వాళ్ళని బెదిరిస్తున్నారని"


పార్ధు ఆలోచనలకు హద్దులు లేకుండా పోతున్నాయి.


"రాత్రి తనకొచ్చిన ఆ కల నిజమేనా..?


నిజంగా ఆ దెయ్యాలు భూతాలు ఉన్నాయా..?


ఎందుకు ఇంత చదువుకుని, ఇంత తెలివి ఉండి వీళ్లంతా అంత భయపడుతున్నారు?


ఇంకా ఈ రోజుల్లో కూడా వీళ్ళకి మూఢనమ్మకాలు ఏంటి..?


ఇంకెంతమంది శాస్త్రవేత్తలు నిజాల నిగ్గు తేల్చి, ఈ మూఢ నమ్మకాల దాటికి బలవ్వాలి.?"


అంటూ తనలో తానే ప్రశ్నించుకుంటున్నాడు.


రాత్రి కలలో తనకొచ్చిన ఆ కథను, తను అంతకుముందు చదివిన క్రైమ్ వార్తలతో ముడిపెడుతూ,


అప్పటికవరకూ తను కలెక్ట్ చేసిన న్యూస్ పేపర్స్ లో వాటి గురించి పదే.. పదే...వెతుకుతున్నాడు.


వాటితో పాటే, గూగుల్ లో సెర్చ్ చేస్తున్నాడు.


యూట్యూబ్ వీడియోలను చూస్తున్నాడు.


కానీ, ఎక్కడా ఒక చిన్న ఆధారం కూడా పార్ధుకి లభించడం లేదు.


అలా వాటి గురించి వెతికి వెతికి అలిసిపోయి


నిరాశగా మంచం మీద కూర్చుని దీర్ఘంగా వాటి గురించి ఒకటే దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు.


ఈలోపే..


"ఆ అన్నా చెల్లెళ్లు ఏమైనట్టు..?


వాళ్ళని ఎవరైనా కిడ్నాప్ చేశారా..?


లేక వాళ్ల విషయంలో మరేదైనా జరుగుంటుందా..?


ఆరునెలలగా లభించని వాళ్ల ఆచూకీ ఏమైనట్టు..?" అంటూ బయట హాల్ నుండి టీవీలో ఆ క్రైమ్ న్యూస్ రాగానే, అది వినిపించుకున్న పార్ధు పరుగు పరుగున బయటకి వెళ్ళాడు.


ఆ టీవీ ముందు పార్ధు వాళ్ల నాన్న కూర్చుని వున్నాడు. పార్ధు అలా రావడం గమనించిన ఆయన ఒక్కసారిగా ఆ టీవీ ఆఫ్ చేసేసి, కోపంగా పార్ధు వంక చూస్తున్నాడు, అక్కడి నుండి తనని లోపలికి పొమ్మన్నట్టు. (మళ్ళీ ఆ క్రైమ్ వార్తలను పార్ధు విని, ఎక్కడ వాటి గురించే ఆలోచిస్తూ పిచ్చివాడిలా తయారవుతాడని భయం ఆయనికి)


దాంతో పార్ధు అక్కడి నుండి నిరాశగా వచ్చేసినా,


ఆ క్రైమ్ న్యూస్ మరియు తనకొచ్చిన కల గురించి తనలో ఉన్న ఆ అంక్సైటీ అయితే చావలేదు పార్థుకి.


ఆ టీవీ చానెల్ లో వచ్చిన న్యూస్ గురించి తన మొబైల్ యూట్యూబ్ లో సెర్చ్ చేశాడు.


చాలా సేపటి తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్ లో ఆ న్యూస్ కి సంబంధించిన వివరాలు పార్ధుకి దొరికాయి.


ఆ న్యూస్ వీడియో కూడా... అప్పటికే, తన ప్లే లిస్ట్ లో సేవ్ చేసి ఉంది.


(బహుశా ఇది వరకే ఆ క్రైమ్ న్యూస్ గురించి చూసుంటాడు పార్ధు.)


ఆ న్యూస్ ఛానల్ లో వాళ్ల చెప్తున్న దానికి, రాత్రి తన కలలో జరిగిన కథకి రెండింటికీ ఏదో దగ్గర సంబంధం ఉందనిపిస్తుంది పార్ధుకి


అంటే తనకొచ్చిన ఆ కల, ఈ కథ రెండూ మ్యాచ్ అవుతున్నాయి అన్న మాట.


"అసలదెలా సాధ్యం..?


నిజంగానే, ఆ యోధ ఆత్మ నా కలలో కనిపించి తనకి హెల్ప్ చేయమని కోరిందా..?


తన ఘోషను నాకు వినిపించిందా?


అసలు నన్ను మాత్రమే ఎందుకు ఎంచుకుంది..?


నాకూ తనకీ సంబంధం ఏమిటి..?


వాళ్ళందరూ అన్నట్టు నిజంగా దెయ్యాలు, భూతాలు , ఈ ఆత్మలు, దేవుళ్ళు ఉన్నాయా..?


లేదా ఇవన్నీ ఒట్టి నా భ్రమేనా...?


అంటూ ఆ ఆలోచనలతో తనలో తానే మధన పడుతున్నాడు.


పార్థుతో పాటు ఆ ఆలోచనలు మిమ్మల్ని కూడా మరింత ఆలోచించేట్టు చేస్తున్నాయా..?


అసలు తర్వాత ఏం జరగబోతోంది...?


అనే ఉత్కంఠ మీలో కలుగుతుందా!


అయితే కొంచెం ఓపిక పట్టండి, తర్వాతి భాగంలో వాటికి సమాధానం దొరుకుతుంది.


"యోధ (ఓ ఆత్మ ఘోష)" ఇంకా కొనసాగుతోంది.


తర్వాతి భాగం


"యోధ (ఓ ఆత్మ ఘోష)-15" లో మిగిలిన కథను కొనసాగిస్తాను...


అంతవరకూ ...


కొంచెం ఓపిక పట్టి,


మీ విలువైన అభిప్రాయాలను సమీక్షల ద్వారా తెలపండి. అవి నాకు మరింత ఉత్సాహాన్నిచ్చి, నా ఈ కథకు నూతనొత్తేజాన్నిస్తాయి.


నా రచనలను ఆదరిస్తున్న పాఠకులకు నా హృదయపూర్వక ధన్యవాదములు


రచన: సత్య పవన్ ✍️✍️✍️



Rate this content
Log in

Similar telugu story from Horror