SATYA PAVAN GANDHAM

Horror Crime Thriller

4  

SATYA PAVAN GANDHAM

Horror Crime Thriller

"యోధ (ఓ ఆత్మ ఘోష) - 13"

"యోధ (ఓ ఆత్మ ఘోష) - 13"

13 mins
1.2K



గమనిక: పాఠకులకు విజ్ఞప్తి, నిడివి ఎక్కువ ఉందని, స్కిప్ చేయకండి... కొంచెం జాగ్రత్తగా, నిదానంగా చదవండి. ఒకవేళ టైం లేకపోతే, మీకు ఫ్రీ అయినప్పుడు మాత్రమే చదవండి. ఎందుకంటే, ఈ పార్ట్ కొంచెం మానవతా విలువలతో కూడుకున్నది.

"యోధ (ఓ ఆత్మ ఘోష) - 12" కి

కొనసాగింపు...

"యోధ (ఓ ఆత్మ ఘోష) - 13"

రాత్రైంది .. ఉరుములు, మెరుపుల శబ్దాల దాటికి ఒకసారిగా ఉలిక్కిపడుతూ స్పృహలోకి వచ్చాడు పార్ధు. చుట్టూ ఎటు చూసిన చీకటే!

దానికి తోడు బయట నుండి పెళ్ పెళ్ మంటూ పెద్ద పెద్ద శబ్దాలు చేస్తున్న భయంకరమైన పిడుగులు, ఉరుముల కాంతి ఆ గెస్ట్ హౌస్ లోకి చొచ్చుకుని వస్తుంది.



కింద తడుముతుంటే, తనకి మెత్తగా ఒక పరుపులాంటిది తగలడంతో, తను మంచం మీద ఉన్నట్టు గ్రహించాడు.

"అదేంటి..!

కొద్ది సేపటి క్రితం నేను స్పృహ కోల్పోయి పడిపోయింది రూం బయట కదా!

ఇక్కడికెలా వచ్చాను?,

నన్నసలు ఈ బెడ్ మీదకెవరు తీసుకొచ్చారు? " అంటూ తనలో తానే ప్రశ్నలు సంధించుకుంటున్నాడు.

అలా తను అనుకుంటున్నాడో..? లేదో..?

అదంతా విని ఎగతాళి చేసినట్టుగా

"హా..హాహాహ్హ... హాహ్హహ్హ..." అంటూ ఆడ, మగ కలగలిపిన స్వరంతో కూడిన నవ్వులు పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ, ఆ రూం గోడలకి ప్రతిధ్వనిస్తూ మరింత భయకరంగా పార్ధుకి వినిపిస్తున్నాయి.

భయంతో పార్ధుకూ మింగుడు పడడం లేదు. ఒక పక్క బయట తుఫాను పడుతూ వాతావరణమంతా చల్లగా ఉన్నా కూడా... తన ఒళ్లంతా , మొహం నిండా చెమటలు పడుతున్నాయి. తను వేసుకున్న టీ షర్ట్ అయితే, తడిసి ముద్దైంది.

అలాగే బిక్కు బిక్కు మంటూ...

"ఎవరు...?

ఎవరు మీరు ....?

మీకేం కావాలి...?" అంటూ మళ్ళీ కనిపించకుండా తనని ఏడిపిస్తున్న ఆ అజ్ఞాత వ్యక్తులను ప్రశ్నిస్తున్నాడు పార్ధు.

వాళ్ల దగ్గర నుండి సమాధానం లేదు, సరి కదా...

మళ్ళీ మళ్ళీ వెటకారంగా పగల బడి నవ్వడం ప్రారంభించారు వాళ్ళు మరింత గట్టిగా....

అప్పటికే నశించిన సహనంతో పార్ధు...

తనలో ఉన్న భయాన్ని అది అధిగమించింది.

కోపం...ఆవేశం తనలో కట్టలు తెంచుకున్నాయి.

"అసలు ఎవరు మీరు..?" అంటూ గట్టిగా గర్జించాడు.

"నీ మృత్యువును..." అంటూ ఒక ఆడ స్వరం...

"నీ స్నేహితుల దగ్గరికి పంపించడానికే వచ్చాం..!" అంటూ ఇంకో మగ వాయిస్ కూడిన మాటలు మరింత బిగ్గరగా నవ్వుతూ వినిపించాయి పార్ధుకి.

"చంపాలనుకుంటే మరి రా...!

దాక్కుని నాతో ఈ దాగుడు మూతలేందుకు..?

ఇప్పటికే ఏ పాపం తెలియని నా స్నేహితులను పొట్టనబెట్టుకున్నారు..?

ఇప్పుడు నన్ను కూడా బలితీసుకుంటారు...!

అసలేం మీకేం ద్రోహం చేశాం మేము..?

రా...రండి..!

వచ్చి నా ప్రాణాలు కూడా తీసుకోండి..?" అంటూ దుఃఖంతో పొంగుకొస్తున్న కన్నీళ్లను ఆపుకోలేక ఆవేశంతో నిండిన మాటలతో వాళ్ళని రెచ్చగొడుతూ తన మృత్యువును ఆహ్వానిస్తున్నాడు పార్ధు.

(చూసారా..! సైన్స్ నీ మాత్రమే నమ్ముతూ... దెయ్యాలు భూతాలన్నవి లేవంటూ మొదట్లో ప్రగల్భాలు పలికిన పార్ధు కూడా చివరికి భయం గుప్పిట్లో తలదాచుకొక తప్పడం లేదు. దీన్నే అంటారు కాబోలు విధి రాత అని)

"ఏంటి.....?

వాళ్లేం పాపాలు ఎరుగని అమాయకులా..?

మేము అన్యాయంగా వాళ్ల ప్రాణాలు తీసుకున్నామా?"

అంటూ ఆ అడ స్వరం ...

"అసలు వాళ్లేం చేశారో తెలుసా నీకు...?" అంటూ ఆ మగ స్వరం పార్ధుని ప్రశ్నించాయి.

"ఏం చేశారు...?

అయినా ప్రాణాలు తీసుకునేంత పెద్ద తప్పులు వాళ్లేం చేశారు..?" అంటూ వాళ్ళని తిరిగి ప్రశ్నిస్తాడు పార్ధు అంతే బాధతో...

"అవును ..!

వాళ్ల ప్రాణాలు తీసుకునేటంత పెద్ద తప్పులే చేశారు..

వాళ్ల వల్ల, వాళ్ళు ప్రేమనే పేరుతో ఆడిన నాటకాల వల్ల.. ఎంతమంది జీవితాలు నాశనమయ్యాయో తెలుసా నీకు..?" ఆవేశంగా ఆ అడ స్వరం వినిపించింది పార్ధుకి...

దానికి పార్ధు దగ్గర నుండి సమాధానం లేదు, వాళ్ళు అడిగిన దానికి జవాబు చెప్పలేక బిత్తర చూపులు చూస్తున్నాడు పార్ధు.

"హుమ్...!

ఏంటి ఆలోచిస్తున్నావ్..!

ప్రాణ స్నేహితులు... ప్రాణ స్నేహితులు... అంటూ ఉదయం లేచిన దగ్గర నుండి, రాతి మళ్ళీ పడుకునే వరకూ రాసుకుపూసుకు తిరుగుతారుగా, మరి ఇలాంటి విషయాలేవి చెప్పలేదా నీకు?" అంటూ ఆ మగ స్వరం వినిపిస్తుంది.

"అసలు మీరేం మాట్లాడుతున్నారు..?

ఏంటి మీరు చెప్పేది, వాళ్ళు అలా చేయడం ఏంటి..?

లేదు మీరు నన్నేదో తప్పుదోవ పట్టిస్తున్నారు.

ఇదంతా మీరు ఆడుతున్న నాటకం" అంటూ వాళ్ళు చెప్పిన మాటలు మీద నమ్మకం లేనట్టు మాట్లాడతాడు పార్ధు.

" పిచ్చివాడా..?

వాళ్ళని గుడ్డిగా నమ్మడం నీ మూర్ఖత్వం?" అంటూ వాళ్ల(పార్ధు స్నేహితుల) గతంలో జరిగిన సంఘటనలు, వాళ్ళు చేసిన తప్పిదాలు, ఆ తప్పిదాల వల్ల బలైన వారి గురించి ఒక్కొక్కటిగా కళ్ళకు కట్టినట్లు వివరించి చెప్తుంది ఆ ఆడ అజ్ఞాత వ్యక్తి.

అదంతా పార్ధుకి అప్పటివరకూ నమ్మశక్యంగా లేనప్పటికీ, ఆ సిట్యుయేషన్ లో తనకి వాళ్ళు చెప్పేది నమ్మక తప్పడం లేదు.

"అంటే మీరు..?

వాళ్ల వల్ల బలైనవారా?

చనిపోయి ఆత్మ రూపంలో మీ ప్రతీకారాలు తీర్చుకుంటున్నారా?

అయినా నా గతంలో, నేనేం అలాంటివేం చేయలేదు కదా..!

మరి మీరెందుకు నన్ను చంపాలనుకుంటున్నారు..?" అంటూ తనలో ఉన్న అనుమానాన్ని కొంచెం బెదురుగానే భయపడుతూ బయటపెట్టాడు పార్ధు.

"హా.. హాహ్హ...హాహ్హహ్హ..." అంటూ వాళ్ళిద్దరూ మళ్ళీ పగలబడి నవ్వుతున్నారు. ఈ సారి అది అంత భయంకరంగా లేదు.

ఆశ్చర్యానికి గురైన పార్ధు...

"ఎందుకలా నవ్వుతున్నారు..?

నేనడిగిందానికి జవాబు చెప్పండి..!

వాళ్ళలా నేనేం మీకు అబద్ధం చెప్పడం లేదు.

నాకు తెలిసి ఇప్పటివరకూ నేను ఏ అమ్మాయి జోలికి వెళ్ళలేదు. పైగా నన్ను ఇష్టపడి, నాకు ప్రపోజ్ చేసినవాల్లని కూడా సున్నితంగానే తిరస్కరించాను. దట్ టూ... దానివల్ల వాళ్లు కూడా పెద్ద సీరియస్ గా తీసుకుని, నా వల్ల ప్రాణాలు కోల్పోలేదు. పైగా వాళ్లు కూడా ఇప్పుడు హ్యాపీ గానే ఉన్నారు?" అంటూ తన ప్రాణాలు కూడా వాళ్ళు ఎక్కడ హరిస్తారొననే భయంతో తనలో నిండుకున్న నిజాలన్ని కుండ బద్దలు కొట్టినట్టు వాళ్ళకి వివరిస్తున్నాడు.

"కంగారు పడకు పార్ధు...!

మేము నిన్నేం చెయ్యము !

నీ గురించి మాకు పూర్తిగా తెలుసు !

నువ్వు సైన్స్ నీ మాత్రమే నమ్ముతావని, దెయ్యాలు భూతాలు నువ్వు నమ్మవని, ఇక్కడికి నువ్వు వచ్చింది కూడా అవి లేవని ప్రూవ్ చేద్దామనే పర్పస్ మీదేనని మాకంతా తెలుసు!

ఏ అమ్మాయి వంక కన్నెత్తి చూడవని, ఎవర్ని మోసం చేసే తత్వం కలవాడివి కాదని తెలుసు,

నిన్న రాత్రి కూడా కృతి తన శరీరాన్ని, నీకు తనకి తానుగా అప్పగిస్తుంటే... నీ మంచితనంతో మరియు నిబద్ధతతో తనకి బుద్ధి చెప్పావ్..! అది కూడా మేము గమనించాము.

నువ్వనుకుంటున్నట్లు మేము మీ ఫ్రెండ్స్ వల్ల చనిపోయిన ఆత్మలం కాదు...

మాదొక సెపరేట్ కథ!

చెప్పుకోలేని గాథ!!"

అంటూ పార్ధు ముందు ఒక ప్రకాశవంతమైన కాంతి ప్రకాశిస్తుంది, సరిగా అదే టైంలో దాంతో పాటు బయట నుండి వినిపిస్తున్న భీకరమైన ఉరుములు మెరుపుల శబ్దాలు. ఆ వెలుగు దాటికి తన కళ్ళు బైర్లు కమ్ముతూ సరిగా చూడలేకపోతున్నాడు.








తన కళ్ళకు చేతిని అడ్డుపెట్టుకుని, ఆ వెలుగుల కాంతి తీవ్రత కూడా తగ్గడంతో, మెల్లగా అటువైపు చూడసాగాడు.



ఆ వెలుగులో ఒక నడి వయసున్న వ్యక్తి, ఫార్మల్ డ్రెస్ తో ఇన్సర్ట్, టక్ చేసుకుని, కళ్ళకు కళ్ళ జోడు తగిలించి, పక్క పాపిడి తీసుకుని, నుదుటిన ఒక చిన్న బొట్టుతో, మంచి ఉద్యోగం చేస్తున్న ఒక మధ్యతరగతి యువకుడు పార్ధుకి దర్శనమిచ్చాడు.



తనని అలానే చూస్తుండిపోయాడు పార్ధు.

ఇంతలో ఆ వ్యక్తి పక్కకు తిరిగి,

"అమ్మా..

యోధ..! " అంటూ చేయిచాచి పిలవగానే,

"అన్నయ్యా..!" అంటూ ఇంచుమించు ఆ వ్యక్తికి అటుఇటుగా దగ్గర వయసుతో, లంగా ఓణీలో, పైన బొట్టు నుండి కాళ్ళ పట్టిల వరకూ మిరుమిట్లు గొలిపే అందంతో అచ్చతెలుగు ఆడపిల్లలా, లక్షణమైన రూపం కలిగి మహాలక్ష్మిలా అక్కడికి వచ్చి ఆ యువకుడి చేతిలో చేయి వేసింది ఆ యువతి.


ఇద్దరూ అలా నడుచుకుంటూ వచ్చి, పార్ధుకు ఎదురుగా కూర్చున్నారు.

పార్ధు వాళ్ళనలా చూస్తూ ఆశ్చర్యపోయి,

"ఆ...

ఆ... ఆత్మలు కాకపోతే,

ఎవరు మీరు...?" అంటూ

తన పంటి బిగువున వేలాడుతున్న మాటను గుటకలు మింగుతూ విదిల్చాడు.

పార్ధు ముందు కూర్చున్న వాళ్ళిద్దరూ,

ఒకరిమొకాలు ఒకరు చూసుకుంటూ ఆపై నవ్వుకుంటూ...

"నా పేరు యోధ..!

ఇదిగో ఇతను మా అన్నయ్య యోగి... యోగేంద్ర!

ఇంకా వివరంగా చెప్పాలంటే, మా కథ నీకు తెలియాలి" అంటూ తమని తాము పరిచయం చేసుకుంటూ, తన కథను చెప్పడానికి సిద్దమైంది మన కథలో కీలక పాత్రైన యోధ..!

                       *******************

మాదొక అందమైన మధ్య తరగతి కుటుంబం. నాన్న ఓ చిన్న ప్రభుత్వ ఉద్యోగి. అమ్మ మంచి చదువే చదువుకున్నా... మాకోసం, మా ఆలనా పాలనా చూసుకుంటూ ఇంటికే పరిమితమైంది. వారానికో సినిమా, నెలకొకసారి పిక్నిక్ పేరుతో సరదాగా ఫ్యామిలీతో అలా బయటకి వెళ్ళడం...

మా మధ్య తరగతి జీవితానికి, మా తల్లిదండ్రులు మమ్మల్ని పెంచిన విధానానికి అద్దం పడుతుంది.

నాకూ... అన్నయ్యకి ఆ ఇల్లే ప్రపంచం. అమ్మ నాన్న తప్ప మాకు మరే లోకం తెలీదు. మాకోసం వాళ్ల చేస్తున్న త్యాగానికి, వాళ్ళని ఇక ఆ వయసులో కష్టపడనివ్వకుండా...

మంచి మంచి జాబ్ లు చేసి వాళ్ళని బాగా కంటికి రెప్పలా చూసుకోవాలన్నదే మా చిరకాల వాంఛ!, మా జీవితాశయం కూడా...!

చదువుతున్న కాలేజ్ లో కూడా మా ఇద్దరికీ మంచి పేరు,

చదువులలో రాణిస్తామని, ఎవరి జోలికి వెళ్లకుండా క్రమశిక్షణతో ఉంటామని... అంత పద్ధతిగా పెంచారు మమ్మల్ని మా తల్లిదండ్రులు.

నాన్న... ఈ లంచాలకి, అక్రమాలకి లొంగకుండా ఆయనకొచ్చే ఆ చాలిచాలని జీతంతోనే నన్ను, అన్నయ్యని డిగ్రీ వరకూ చదివించారు. ఇద్దరం మంచి మంచి ఉద్యోగాలలో స్థిరపడితే చూడాలన్నది ఆయన కల!

అమ్మ ఆశ కూడా అదే...

ఆడపిల్ల ఎదిగిందంటే భయంతో పెళ్లి చేసి అత్తారింటికి పంపించేస్తున్న తల్లిదండ్రులున్న ఈ రోజుల్లో... మా పేరెంట్స్ మాత్రం వారికి పూర్తి భిన్నం.

అలా సరిగ్గా ఆరు నెలల క్రితం ఇద్దరికీ ఒకేసారి డిగ్రీ అయిపోవడంతో, మా తల్లిదండ్రులను వదిలి సిటీకి రావడం ఒకింత భారమనిపించినా...

వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టడానికి, వారు కన్న కలలను నిజం చేయడానికి.. జాబ్స్ వెతుకులాటలో ఇక్కడికి వచ్చాం.

ఇక్కడికి వచ్చిన మాకు ఒకరోజు ఆ రాహుల్, కావ్య కనిపించారు.

వాళ్ల గురించి చెప్పలేదు కదూ..!

రాహుల్ ..

ఓ గొప్పింటి అబ్బాయి.

కాలేజ్ చదివే రోజుల్లో నాకు స్నేహం పేరుతో దగ్గరయ్యి, ప్రేమ పేరుతో నా వెంట పడ్డాడు. సున్నితంగానే నేను తన ప్రపోజల్ని తిరస్కరించినా, తను మాత్రం నా వెంట పడడం ఆపలేదు.

అసలే మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన నాకు, అలాంటివి నచ్చవని, ఎంత మొత్తుకున్నా తను వినేవాడు కాదు. ఇంట్లో చెప్పడానికి ఇబ్బంది పడి, దాన్ని ఎలా ఫేస్ చెయ్యాలో తెలియక, చివరికి కాలేజ్ యాజమాన్యానికి కంప్లైంట్ చేస్తే.. , అదే చివరి సంవత్సరం కావడం, కాలేజ్ నుండి సస్పెండ్ చేస్తే తన కెరీర్ నాశనమవుతుందనీ ఆలోచించి, వాళ్ళు పెద్దగా యాక్షన్ ఏమి తీసుకోకుండా తనని గట్టిగా మందలించి వదిలేసారు. అప్పటి నుండి తను వెంట పడడం ఆపేశాడు.

ఇలాంటి సంఘటనే, అన్నయ్య విషయంలో కూడా జరిగింది. కావ్య... అన్నయ్యని ప్రేమిస్తున్నానంటూ, తను లేకపోతే చచ్చిపోతానంటూ బెదిరించింది. నాలాగే తను కూడా ఎన్ని సార్లు నచ్చ చెప్పినా వినేది కాదు. అసలే నాకంటే సున్నిత మన్స్కుడైన అన్నయ్య కూడా... కాలేజీ యాజమాన్యానికి కంప్లైంట్ చేయడంతో, కావ్యని కూడా మందలించారు.

అక్కడితో మా కథలు సుఖాంతం అయ్యి, మా ఆశలకు, ఆశయాలకు మార్గం సుగమమైందనే అనుకున్నాం మేము.

కానీ, వాళ్ళిద్దరినీ ఆ రోజు అలా చూసిన మాకు, అదే చివరికి మా పాలిట శాపమవుతుందని మాత్రం మేమనుకొలేదు.

పాత గాయాలు నొప్పి పెడుతున్నా... ఇంత దూరంలో మళ్ళీ కలిశాం కదా, మళ్ళీ కలుస్తామో లేదోనని ఒకసారి పలకరిధ్దామనిపించింది.

కానీ, వాళ్ళని పలకరించడానికి మా మొహాలు చెల్లలేదు. అన్నయ్య కూడా వద్దన్నట్టుగా అలాగే వాళ్ళని చూసి చూడనట్టు, మా మొహాలు పక్కకి తిప్పుకుని వెళ్లిపోతుంటే,

ఇంతలో మమ్మల్ని చూసిన కావ్య, మమ్మల్ని పిలిచింది.

"హేయ్...

యోధ..

ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి,

కనీసం మాటైనా అనలేదు.

ఇప్పుడు కూడా చూసి చూడనట్లు అలా వెళ్లిపోతున్నారు?" అంటూ వెళ్లిపోతున్న మమ్మల్ని ఆపింది కావ్య...

"ఎలా ఉన్నారు..?

ఎక్కడుంటున్నారు..?" అంటూ రాహుల్...

వాళ్ళు ఆప్యాయత ప్రాయంగా పలకరించి మాతో ఒకప్పటిలా కలిసిపోయారు.

కానీ, మాకే వాళ్ళతో ఎలా మాట్లాడాలో, వాళ్ళు అడిగేవాటికి మరెలా స్పందించాలో తెలియక, అలా మౌనంగానే ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ నిశ్చలంగా ఉండిపోయాం.

"ఏంటి ..?

ఇంకా మీరు ఆ కాలేజ్ లో జరిగిన సంఘటనలు మర్చిపోలేదా..?" అంటూ కావ్య

"కామన్ యార్..!

వాట్ ఎవర్ ఇట్ హప్పెండ్, ఇట్స్ హప్పెన్..

లెట్స్ చియర్ అప్..!

వాటిని మర్చిపోయి, ఇప్పుడు మంచి ఫ్రెండ్స్ గా మెలగలేమా?" అంటూ రాహుల్ అనేసరికి.

వాళ్ల మాటల్లో ఆంతర్యం మాకప్పుడు అర్థం కాలేదు.

కానీ, ఆ క్షణం మేము కూడా అంతా మర్చిపోయి వాళ్ళతో కలిసిపోయాం.

"ఇంతలో...

లెట్స్ హేవ్ సమ్ కాఫీ!" అంటూ రాహుల్ ఆఫర్ చేయగానే,

దానికి ఇంకా మేము వాళ్ళని సందేహపడుతూ చూస్తున్నట్టు అనుమానిస్తున్న వాళ్ళతో..

"ఇట్స్ ఓకే, వి కెన్..! " అంటూ బదులిచ్చాను నేను, అన్నయ్య అభిప్రాయం ఏంటో తెలుసుకోకుండానే...

దానికి అన్నయ్య కూడా సరేనన్నట్టు తలాడించడంతో, అలా కాఫీ షాప్ లోకి వెళ్ళాం వాళ్ళతో కలిసి..

నాలో ఎక్కడో చిన్న భయం...

మళ్ళీ వాళ్ళు లవ్ అంటూ మమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడతారేమొనని,

అసలే ఇక్కడ మాకేవరూ లేరు, వీళ్ళేం చేసినా చెల్లుతుంది, జరిగిన ఆ పాత ఘటనలన్నీ మా దగ్గర మర్చిపోయినట్లు నటిస్తున్నారని నాకింకొక అనుమానం.

ఆ నా అనుమానాన్ని పటా పంచలు చేస్తూ...

"అన్నట్టు చెప్పడం మర్చిపోయాను,

నాకూ... కావ్యకి ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యింది." అంటూ రాహుల్ చెప్పడంతో..

ఒక్కసారిగా ఖంగుతిన్న మేము..

"ఏంటి..?" అంటూ ఆశ్చర్యపోతూ వాళ్ళని ఆరాతీసాము.

"అవును...

యోధ..!

మీరిద్దరూ మమ్మల్ని రిజెక్ట్ చేసాకా, పైగా కాలేజ్ లో జరిగిన అవమానంతో ఇద్దరం డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాం...

అలా ఇద్దరిది ఇంచుమించు ఒకేతీరు కావడంతో, ఒకర్ని ఒకరు ఓదార్చుకున్నాం... అది ప్రేమగా మారింది.

అలా ఒకరికొకరు ప్రేమలో పడ్డాము.

ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోవడంతో పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాం." అంటూ వివరించింది కావ్య.

ఆ రోజు అలా జరిగినదానికి, "సారీ..!" అంటూ నేను మధ్యలో కలుగజేసుకుని చెప్తే,

"హేయ్.. ఇట్స్ ఓకే, దానివల్లే కదా మేమిద్దరం ఒకటయింది."

అంటూ బదులిచ్చింది కావ్య....

(వాళ్ళలా కలిసి ఎదురైతే,

ఎంతసేపూ... మాకు, వాళ్ళకి మధ్య జరిగింది ఆలోచించాము తప్ప, అసలు వాళ్ల మధ్య ఏం జరిగిందో తెలుసుకోకపోయాము.)

ఏదైతేనేం, వాళ్ల నిర్ణయంతో మా ప్రాణాలు లేచొచ్చినట్టనిపించాయి. ఇక మాకే అడ్డు లేదనుకున్నాం.

వాళ్ళలా వాళ్ల లవ్ స్టొరీ చెప్తూనే...

"మా ప్రేమ సక్సెస్ కావడంతో,

ఈ వీకెండ్ లో ఒక చిన్న పార్టీ ఇస్తున్నాం, ఇక్కడున్న మన ఫ్రెండ్స్, కాలేజ్ మేట్స్ కూడా వస్తున్నారు. మీరు కూడా తప్పకుండా రావాలి. అందరినీ ఒకసారి చూసినట్టు ఉంటుంది. ఓ చిన్న గెట్ టూ గెదర్ అనుకోండి..!" అంటూ మమల్ని ఆ పార్టీకి ఇన్వైట్ చేశాడు రాహుల్...

"నీకు తెలుసుగా రాహుల్..!

పార్టీలు, పబ్ లు అంటే మాకు ఇష్టం ఉండదని, పైగా ఈ సిటీ కల్చర్ కి కూడా ఇబ్బంది పడుతూ ఇప్పుడిపుడే అలవాటు పడుతున్నాం." అంటూ అన్నయ్య బదులిచ్చాడు.

దానికి,

"ఏంటి..!

ఇంకా...!

ఇది మీ ఊరు అనుకుంటూ, మీ అమ్మ నాన్నలకి తెలుస్తుందని భయపడుతున్నరా? అంటూ కావ్య అంటుంటే,

"అదేం లేదు ..!" అంటూ నేను బదులిచ్చాను.

" అయినా మీరనుకుంటున్నట్టు, పార్టీ.. ఏ పబ్ లోనో కాదు, స్వయానా మా గెస్ట్ హౌస్ లో, పైగా అక్కడికి పెద్దగా ఎవరూ రారు.. కూడా ! మనం మాత్రమే.." అంటూ రాహుల్..

"అది..అది..." అంటూ నేను సందేహంగా నీలుగుతుంటే

"ప్చ్... ! ఇంకేం మాట్లాడకు మీరొస్తున్నారు అంతే, కాదుకూడదు అంటే ఇదిగో మా ప్రేమ మీద ఒట్టే..!" అంటూ నా చేతిని తన చేతుల్లోకి తీసుకొని బలవంతంగా ప్రామిస్ చేసుకుంది కావ్య.

అన్నయ్య వంక చూస్తే, తను కూడా కాదనలేక పోయాడు.

వాళ్ల బలవంతానికి మాకు "సరే..!" ఆనక తప్పలేదు.

                 **********************

అలా ఆ రోజు రానే వచ్చింది. మమ్మల్నిద్దరిని స్వయంగా వాళ్లిద్దరే రిసీవ్ చేసుకుని, ఇదిగో ఈ గెస్ట్ హౌజ్ కి తీసుకుని వచ్చారు. వచ్చేదారి అడువులు, కొండలు లోయలుతో సిటీ కి దూరంగా చాలా భయంకరంగా ఉంది. మాకది చూసి ఒక పక్క భయం వేస్తున్నా.. అన్నయ్య, నేను ఒకరికొకరు తోడుగా ఉన్నామనే దైర్యం, మాతో కలిసిపోయిన వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ సాఫీగా ఇక్కడికి చేరుకున్నాం.

తీరా వచ్చాకా, అప్పటికే అక్కడ వాళ్ల గెస్ట్లు (మొత్తం పదకొండు మంది అందులో నలుగురు అమ్మాయిలు, ఏడుగురు మగవాళ్ళు రాహుల్ ఫాదర్ తో కలిపి) ఉన్నారు. మన ఫ్రెండ్స్ ఎక్కడని అడిగితే కాసేపట్లో వస్తారని చెప్పారు వాళ్ళు. ఇంతలో పార్టీకి కావాల్సిన ఏర్పాట్లు చేసేశారు అక్కడి పని వాళ్ళు వీరయ్య.. లక్ష్మి..

అర్థరాత్రి అవుతుంది. పైన రూంలో కూర్చుని కూర్చుని అప్పుడే కిందికి వచ్చిన మాకు, ఎంతసేపటికీ మా కాలేజ్ మేట్స్ కనిపించలేదు. వాళ్లు మాత్రం రాలేదు. అప్పటికే మత్తులో తూగుతున్నారు ఆ పార్టీకి వచ్చిన వాళ్ళలో కొంతమంది. మరికొంతమంది కూడా తీసుకొచ్చిన ఆ అమ్మాయిలను తీసుకుని రూమ్స్ లోకి వెళ్ళారు.

మాకందంతా వింతగా, చాలా అసభ్యకరంగా.. మరింత నీచంగా అనిపిస్తుంది. మరొక పక్క భయం కూడా వేస్తుంది.

సరిగ్గా అప్పుడే వేరొక వ్యక్తితో కలిసి బయటకి వచ్చింది కావ్య ఒక రూం లో నుండి ...

ఇంకొక రూం నుండి వేరొక అమ్మాయితో రాహుల్...

వాళ్ళని అలా చూస్తూ మేము ఆశ్చర్యపోతుంటే, మా దగ్గర కి వచ్చిన వాళ్ళు...

"ఏంటి..?

అంత వింతగా చూస్తున్నారు..!

ఇక్కడ సిటీలో ఇదంతా కామన్..n " అంటూ అంటున్నాడు రాహుల్.

రాహుల్ అప్పటికే డ్రింక్ చేసినట్టు ఉన్నాడు. అతని మాట్లాడుతుంటే నోటి నుండి వచ్చే వాసన చెప్తుంది అది.

"రా మనం కూడా వెళ్దాం..!

సరదాగా అలా ఎంజాయ్ చేద్దాం..!" అంటూ కావ్య అన్నయ్యని పట్టుకుని లాగబోయింది. అప్పటికే, తను కూడా డ్రింక్ చేసి మత్తులో ఉంది.

"హేయ్...!

వదలవే నన్ను..!" అంటూ అన్నయ్య బలవంతంగా తనని చీదరించుకుంటూ విడిపించుకోబోయాడు.

సరిగ్గా అప్పుడే అక్కడికి తూలుతూ(తాగడం వల్ల) వచ్చిన రాహుల్ వాళ్ల నాన్న కూడా...

"వీళ్లే కదా..! ఆ రోజు మిమ్మల్ని కాదని, అందరిలో అల్లరిపాలు చేసింది, ఇంకా ఆ తలపోగర్లు తగ్గినట్టు లేదు వీళ్ళకి" అంటూ మనసుకి నొచ్చుకునే విధంగా నోటికొచ్చినట్లు మాట్లాడడంతో నాలో వున్న భయం బయటపడింది.

"రాహుల్ ఏంటి ఇదంతా..!

మాకిక్కడ ఉండాలనిపించడం లేదు,

చాలా భయంగా ఉంది.

ఏ ఉద్దేశ్యంతో మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు..?

ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి, మేము ఇక్కడినుండి వెళ్ళిపోతాం..?" అంటూ అతన్ని వేడుకుంటుంటే,

"మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది, బయట పడేయడానికి కాదు. మాకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి...రావే!" అంటూ నా చెయ్యి పట్టుకుని లాగబోతుంటే,

(అప్పుడే రాహుల్ కపటి బుద్ధి అర్థమైంది)

అది చూస్తున్న అన్నయ్య తట్టుకోలేక,

"రేయ్... రాహుల్..!

వదలరా నా చెల్లిని" అంటూ ఆవేశంతో తనని ఒక నెట్టు నెట్టాడు. అలా నెట్టడంతో రాహుల్ కిందపడిపోయాడు. అప్పటికే షాక్ లోనున్న నాకక్కడేం జరుగుతుందో, అసలర్థం కావడం లేదు.

ఈలోపే రాహుల్ ఫ్రండ్ ఒకడు వెనుక నుండి వచ్చి, తన చేతిలోనున్న బీర్ బాటిల్ తో అన్నయ్య తల మీద బలంగా కొట్టాడు. పగిలిన ఆ సీసా పెంకులొచ్చి పక్కనే ఉన్న నా బుగ్గన గుచ్చుకున్నాయంటే, అర్థం చేసుకోండి అతను ఎంత బలంగా అన్నయ్యని గాయపరచాడో!. ఆ దెబ్బకి అన్నయ్య తల నుండి నెత్తురు ధారగా కారుతూ అక్కడే కుప్ప కూలి పడిపోయాడు.

ఉన్న ఒక్క బలం కూడా కోల్పోయిన నాకు,

అన్నయ్యని అలా చూస్తూ కళ్ళు తిరుగుతున్నాయి. అదే అదునుగా భావించి రాహుల్ నన్ను బలవంతం చేయబోయాడు..

దానికి ప్రతిఘటించిన నాపై దాడి చేస్తూ.. నన్ను చెంపలు మీద కొడుతూ, జుట్టు పట్టుకుని పక్కనున్న రూంలోకి ఈడ్చుకెల్లి, నన్ను బలవంతంగా రేప్ చేశాడు.. అది కూడా అన్నయ్య చూస్తుండగానే,

వాడి ఒక్కడితో ఆగలేదు. మిగిలిన వాళ్ళందరూ కూడా అన్నయ్య ఎదురుగా ఉండగానే, దారుణంగా..., మరింత క్రూరంగా నాపై అత్యాచారం చేశారు. ఒకడు కాదు ఇద్దరు కాదు రాహుల్ మరియు వాళ్ల నాన్న తో కలిపి మొత్తం తొమ్మిది మంది నన్ను వివస్త్రను చేసి, గ్యాంగ్ రేప్ చేశారు. అందులో ఆ వీరయ్య కూడా ఉన్నాడు.

ఒకపక్క నాకు ఓపిక నశిస్తున్నా... ఒకరి తర్వాత ఒకరు ఈ అసహనరాలిపై వాళ్ల కోరికలు తీర్చుకుంటూ, ఈ చచ్చుబడిన ఒంటిపై వాళ్ల ప్రతాపాం చూపించారు మరింతగా రెచ్చిపోతూ...



కాదు కాదు వాళ్ళు వాళ్ల రెచ్చిపోయి, వాళ్ళ కోరికలు తీర్చుకోవడం కాదు...

గోళ్ళతో గుచ్చుతూ, పళ్ళతో కొరుకుతూ, సిగరెట్లతో కాల్చుతూ... కూడా తెచ్చుకున్న మందు నా నోట్లో పోసి, ఆపై నా నోటిని గుడ్డతో కుక్కి.. మందు బాటిల్ సీసాలను నా ప్రయివేటు భాగాలలో చొప్పిస్తుంటే, అప్పటికే తీవ్ర రక్తస్రావం అవుతున్న నేను వాళ్ల హింసకు తట్టుకోలేక



"అమ్మా..! అమ్మా..!

అన్నయ్యా..! అన్నయ్యా..!

నొప్పి..! నొప్పి...!

వదలండి..! ప్లీజ్ నన్నొదలండి..!" అంటూ ఆ నొప్పిని భరించలేక దిక్కులు పిక్కటిల్లేలా ఆ కుక్కిన గుడ్డలు కూడా బయటకి వచ్చేలా నే అరుస్తుంటే, ఆ అరుపులను వింటూ వాళ్ళు మరింత రాక్షస ఆనందం పొందారు తప్ప నా మీద కనీసం కనికరం చూపలేదు.



అప్పటికే, నిస్సాయతగా పడున్న అన్నయ్యని ఒక స్తంభానికి కట్టేసి, వాడికి ఇదంతా చూపిస్తుంటే...

ఏమీ చేయలేని స్థితిలోనున్న వాడిని అలా చూస్తున్న నాకు,

నా వల్ల, వాడి కళ్ళెదురుగా నాకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించలేక, వాడికి కలుగుతున్న ఆ నరకానికి, ఆ క్షణం నా ప్రాణాలు పోతే బాగుండనిపించింది.

చనిపోదామని ప్రయతించినా... ఆ నీచులు నన్ను మంచానికి కట్టేసి, వాళ్ల హింసాకాండ, వాళ్ల కామదాహం తీరేవరకూ నన్ను వదిలి పెట్టలేదు.

అలా వాళ్ల హింసకు, కామదాహానికి దాదాపు నాలుగు గంటలు నరకం అనుభవించాను. అప్పటికే ఒంటి నిండా రక్తం చిందుతూ ఏరులై పారుతుంది.

నాకింత అన్యాయం జరుగుతుంటే, అక్కడున్న ఆ అమ్మాయిలలో ఒక్కరు కూడా వాళ్ళకి అడ్డు చెప్పలేదు కావ్యతో సహా.. కనీసం ఆ లక్ష్మి ఇదేంటని ప్రశ్నించలేదు.

పైగా వాళ్లు కూడా ఇంకా వాళ్ళని రెచ్చగొడుతూ... నన్ను వాళ్ళు అలా హింసించేలా ప్రేరేపించారు.

చివరికి తండ్రి లాంటి వయసున్న ఆ రాహుల్ ఫాదర్ కూడా... వావి-వరుస మరిచి, కూతురు లాంటి వయసున్న దాన్నని కూడా చూడకుండా మృగంలా క్రూరంగా ప్రవర్తించాడు.

మేము ప్రాణాలతో బయట పడితే,

ఈ విషయం బయటపడి, చివరికి వాళ్ల దుర్మార్గాలు ప్రపంచానికి తెలుస్తాయని భయపడి...

నన్ను, అన్నయ్యని పక్కనే ఉన్న ఆ స్మశానానికి ఈడ్చుకెల్లి, అసలు కొంచెం కూడా కనికరం లేకుండా, అన్నా చెల్లెళ్ళు అనే జాలి కూడా లేకుండా... అన్నయ్యని సైతం వివస్త్రను చేసి నాపై పడేసి, ఆపై ఇద్దరి మీద పెట్రోల్ పోసి తగులబెట్టి, అత్యంత దారుణంగా మమ్మల్ని చంపేశారు.



ఆ క్షణం మా ఇద్దరి ఆలోచనల్లో మెదిలింది,

అమ్మ ... నాన్న... గురించి

కనీసం మేము ఎక్కడున్నామో?,

ఏమయ్యమో? కూడా వాళ్ళకి తెలియక పోతే,

మా భవిష్యత్ మీద అన్ని ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఏమైపోతారోనని భయం...!

ఇప్పటికీ మేము ఏమయ్యామో తెలియక, మా కోసం పిచ్చి వాళ్ళలా ఎదురు చూసి చూసి, ఆ న్యూస్ చానల్స్ లో మా గురించి రోజుకొకటి వచ్చే ఆ న్యూస్ చూస్తూ చూస్తూ తట్టుకోలేక, ఎన్ని పోలీసు స్టేషన్లు తిరిగినా, మరిన్ని కోర్టు మెట్లెక్కినా, ఇంకెన్ని చట్టాలు మారినా వాళ్ళకి న్యాయం జరగదని నిర్ణయించుకుని వాళ్ళు కూడా ఆఖరికి ఆత్మ హత్య చేసుకున్నారు.


ఆ తర్వాత తెలిసింది ఈ గెస్ట్ హౌజ్ ఒక వేశ్య గృహమని,

విక్కి చెప్పిన ఆ రిలేటివ్, ఆ ఎమ్మెల్యే రాహుల్ తండ్రే..

అలా రాహుల్... రాహుల్ తండ్రి తన ఎమ్మెల్యే పలుకుబడి ఉపయోగించి ఇక్కడికి అమ్మాయిలను తీసుకొచ్చి, వాళ్ళని వాడుకుంటారని,

ఒప్పుకోని వాళ్ళని ఇదిగో... నాలాగే ఆ పక్కన స్మశానంలో ఎవరికి తెలియకుండా తగలెట్టేస్తారని.

అందుకే, మేము ఇలా ఆత్మలుగా మారి అలాంటి తప్పులు చేస్తున్న వాళ్ళందరికీ మేమే శిక్షలు విధిస్తున్నాం. గడిచిన

ఈ ఆరునెలల్లో అలాంటి వారి పదుల సంఖ్యలో ప్రాణాలు తీసేసాం. అందులో మీ స్నేహితులు కూడా ఉన్నారు.

కానీ, అసలు దోషులైన ఆ రాహుల్, మరియు అతని తండ్రి ఆ రోజు నుండి ఇక్కడికి రాకపోవడంతో... వాళ్ళు మాత్రం ప్రాణాలతో తప్పించుకున్నారు. వాళ్ళకి సహకరించిన పని మనుషులు లక్ష్మి, వీరయ్యలని కూడా మేమే మట్టుబెట్టాం." అంటూ తమ కథను వివరిస్తూ కన్నీటి పర్యంతమైంది

యోధ ఆత్మ...

యోగి ఆత్మ కూడా..

ఇదంతా విన్న పార్ధుకి, కళ్ళు చెమ్మగిల్లాయి.

"ఇప్పుడు చెప్పు, ప్రేమ పేరుతో మనసులతో ఆటలాడుకుని, వాళ్ల వాళ్ళ కామధాహాన్ని, అవసరాలను తీర్చుకునే వాళ్ళని శిక్షించడం తప్పా..!

పిల్లల భవిష్యత్తు పై ఎన్నో ఆశలు పెట్టుకున్న, నా తల్లిదండ్రుల లాంటి వారికి కడుపు కోత మిగిల్చిన లాంటి వారిని వదిలేయడం ధర్మమా..?" అని చెప్తూనే

"అమ్మా... నాన్న... "అంటూ యోధ పిలిస్తే

ఇంకో రెండు ఆత్మలు పార్ధు ముందు ప్రత్యక్షమయ్యాయి.



వాళ్ళని చూసిన పార్ధు షాక్ అవుతూ ..

"మీరు...

మీరూ..." అంటూ తడబడుతుంటే,

"అవును నువ్వనుకున్నది నిజం కాదు..

వాళ్లు ఈ గెస్ట్ హౌజ్ లో పనివాళ్ళు లక్ష్మి, వీరయ్య కాదు.

ఆ నీచులకి సహాయపడ్డారనీ ఆ లక్ష్మి, వీరయ్య లను కూడా మేమే అంతమొందిచాము.

వాళ్ల రూపంలోనే మిమ్మల్ని, మా అమ్మా,నాన్నలు రిసీవ్ చేసుకున్నారు. నిజానికి అప్పటికే లక్ష్మి, వీరయ్య ఇద్దరిని చంపేసాము." అంటూ యోధ వివరిస్తుంది.

"ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రేమ పేరుతో కోరికలు తీర్చుకున్న వాల్లో, మోసం చేసిన వాళ్లో... మాత్రమే మాకు కనిపించారు. అందరినీ చంపేశాము.

కానీ, నువ్వు మాత్రమే మాకు మంచి మనసున్న వాడిలా... ఇప్పటివరకూ అలాంటి వాటి జోలికి(అక్రమ మార్గంలో శారీరక సుఖానికి)వెళ్లని నిబద్ధత కలిగిన వ్యక్తిలా కనిపించావు. అందుకే, నిన్ను ఏమీ చేయబోమని, నీకు హామీ ఇచ్చాము.

ఇదంతా నీకు వివరించి చెప్పాలనిపించింది.

ఇదంతా వింటున్న పార్ధు కళ్ళు సంద్రాన్ని తలపించాయి.

తన కంట నీరు నదిలా ప్రవహిస్తుంది.

"ఇప్పటికే తెల్లారుతుంది, ఇక ఇక్కడి నుండి నువ్వు వెళ్ళిపో...

మాకు దొరకని ఆ రాక్షసులని అంతమొందించడంలో నీ సహాయం కూడా అందుతుందని ఆశిస్తూన్నాము" అంటూ యోగి ఆత్మ, పార్ధుకలా వివరించాక,

ఆ ఆత్మలన్నీ(యోధ కుటుంబం అంతా) అక్కడి నుండి ఒక్కసారిగా మాయమైపోతాయి.

తానున్న ఆ రూం నుండి బయట పడడానికి,

ఆ మంచం మీద నుండి లేవబోతున్న పార్ధుని, ఎవరో కత్తితో వెనుక నుండి పొడవడంతో ...

ఆ గాయంతో ఏర్పడిన నొప్పిని భరించలేక, గట్టిగా అరుస్తున్న పార్ధు అరుపులకి ఎదురొచ్చేట్టుగా ఎవరో...

"పార్ధు...

పార్ధు...

తలుపులు తియ్యి, ఏమైంది?" అంటున్న అరుపులు బయట నుండి వినిపిస్తున్నాయి.

"యోధ వదిలేస్తే, పార్ధుని హత్య చేయబోయింది ఎవరు..?

అసలు పార్ధు రూం వరకూ అరిచింది ఎవరు...?

అతను అక్కడి వరకూ అసలు ఎలా వచ్చాడు..?

పార్ధుని అతను రక్షించుకోగలుగుతాడా?

పార్ధుని అంతగా నమ్మిన యోధ, ఇప్పుడు ఆపడలోనున్న తనను రక్షిస్తుందా?

యోధ కుటుంబానికి పార్ధు సాయం అందుతుందా?

యోధ తనకి అన్యాయం చేసిన ఆ రాక్షసుల మీద ఎలా ప్రతీకారం తీర్చుకుంటుంది."

లాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే, మిగిలిన భాగాలు అసలు మిస్ కాకండి.

"యోధ (ఓ ఆత్మ ఘోష)" ఇంకా కొనసాగుతోంది.

తర్వాతి భాగం

"యోధ (ఓ ఆత్మ ఘోష)-14" లో కొనసాగిస్తాను...

అంతవరకూ ...

కొంచెం ఓపిక పట్టి,

మీ విలువైన అభిప్రాయాలను సమీక్షల ద్వారా తెలపండి. అవి నాకు మరింత ఉత్సాహాన్నిచ్చి, నా ఈ కథకు నూతనొత్తేజాన్నిస్తాయి.

నా రచనలను ఆదరిస్తున్న పాఠకులకు నా హృదయపూర్వక ధన్యవాదములు

రచన: సత్య పవన్ ✍️✍️✍️



Rate this content
Log in

Similar telugu story from Horror