SATYA PAVAN GANDHAM

Horror Tragedy Thriller

4  

SATYA PAVAN GANDHAM

Horror Tragedy Thriller

"యోధ (ఓ ఆత్మ ఘోష)-11"

"యోధ (ఓ ఆత్మ ఘోష)-11"

9 mins
1.6K


"యోధ (ఓ ఆత్మ ఘోష) -10" కి

కొనసాగింపు...

"యోధ (ఓ ఆత్మ ఘోష) -11"

శనివారం...

అప్పటికే వాళ్ళు ఆ గెస్ట్ హౌజ్ కి వచ్చి అయిదు రోజులు గడిచాయి.

యధావిధిగానే ఆ రోజు కూడా తెల్లారింది. సరిగ్గా అప్పుడే కృతి కి మెళుకువ వచ్చింది. తన తలంతా కొంచెం బరువుగా, ఏదో పట్టేసినట్లుగా ఉంది. అసలు తను ఎక్కడుందో, ఎలా ఉందో కూడా తనకి తెలియడానికి చాలా సమయమే పట్టింది. అలా కాసేపటికి తేరుకున్న తను, ఆ రూం మెయిన్ డోర్ దగ్గర పార్ధు పడి ఉండడం గమనించింది.

తన(పార్ధు) దగ్గరికి వెళ్ళి, పార్ధుని లేపే ప్రయత్నం చేస్తుంది కృతి..

"పార్ధు...

పార్ధు...

లే పార్ధు...

నీకేమైంది పార్ధు!" అంటూ తనని తట్టి లేపుతుంది.

అలా కాసేపటికి, కృతి పిలుపుకి మెలుకువ తెచ్చుకున్న పార్ధుకి కూడా స్పృహలోకి రావడానికి టైం పట్టింది. స్పృహలోకి వచ్చినా తన కళ్ళు సరిగ్గా కనిపించడం లేదు. (బహుశా రాత్రి కమ్మిన పొగ వల్ల అనుకుంటా)

ఆ మసక కళ్లతోనే పక్కనే ఉన్న కృతిని కొంచెం విచిత్రంగా, మరింత అనుమానాస్పదంగా చూస్తున్నాడు పార్ధు, అసలెందుకు తనక్కడ ఉందా అన్నట్టు...

అలా తనలో తాను అనుకుంటున్న వాటిని బయట పెడుతూ....

"నేనేంటి ఇక్కడ..?

అయినా నువ్వు నా రూం లో ఏం చేస్తున్నావ్?" అంటూ బరువెక్కిన తలను నిమురుకుంటూ కృతిని ప్రశ్నించాడు పార్ధు.

"అయ్యో...

అదేగా నేను కూడా నిన్ను అడగాలనుకుంటుంది.

నువ్విక్కడిలా ఎందుకు పడున్నావ్..?

నీ రూం లో నేనెందుకున్నానని..?

(ఆ రూమంతా బిత్తర చూపులు చూస్తూ)" బదులిచ్చింది కృతి.

అంతకుముందు రోజు జరిగిందంతా గుర్తుకొచ్చి

వెంటనే తనున్న చోటు నుండి లేచి,

"ఇంతకీ విశాల్ ఎక్కడ..?" కృతితో అంటూ హఠాత్తుగా అక్కడి నుండి ఆ రూం డోర్ తీసుకుంటూ బయటకి వచ్చి విశాల్ రూం వైపు వెళ్ళాడు పార్ధు.

విశాల్ రూంలో ఎంత వెతికినా, తన జాడ కనిపించలేదు...

మిగిలిన వాళ్ల రూం డోర్స్ తెరుధ్దామని ఎంత ప్రయత్నించినా అవి అసలు ఓపెన్ అవ్వడం లేదు.

ఏమరపాటుగా స్మశానం వైపు చూడగా, తనకొక కాలుతున్న చితి కనపడింది.

ఇక ఎంత వెతికినా లాభం లేదనుకుని, తానున్న చోటే పార్ధు నిరాశగా అక్కడే కుప్పకూలాడు.

ఇదంతా గమనిస్తున్న కృతికి, విశాల్ కూడా ఇక లేడన్న విషయం అర్థమయ్యి, ఘోల్లున ఏడుస్తూ తను కూడా ఉన్న చోటే కుప్పకూలింది. ఇద్దరూ శోక సముద్రంలో మునిగిపోయారు.

పార్ధు కొంచెం దైర్యం కొని తెచ్చుకుని, కృతిని ఓదార్చుతున్నాడు.

అక్కడుంటే, ప్రమాదమంటూ కృతిని అక్కడి నుండి తన రూంలోకి తీసుకొచ్చేసాడు పార్ధు.

ఇద్దరికీ, ఎంత ఆపుకుందామనుకున్నా దుఃఖం ఆగడం లేదు. దానికి తోడు వీళ్ళ ప్రాణాలు కూడా పోతాయేమొనన్న భయం. తలుపులు దగ్గరికి గడియ పెట్టుకుని, భిక్కు భిక్కు మంటూ,  భయం గుప్పిట్లో, బాధతో బ్రతుకుతున్నారు వాళ్ళు ఆ గడిచే క్షణాలు లెక్కపెట్టుకుంటూ...

"అసలు ఏ ముహూర్తాన మనం ఇక్కడికి వచ్చామో?

ఒక్కరు కూడా మనకి లేకుండా పోయారు. మనం కూడా ఎప్పుడుంటామో? ఎప్పుడు పోతమో?

అసలు ఇలా బ్రతికేకన్నా మనమే బలవంతంగా చావడం మేలు!" అంటూ తనకున్న బాధని, భయాన్ని ఏడుస్తూ వెళ్లగక్కుతుంది కృతి.

"అవసరం లేదు కృతి. రేపు తెల్లారే సరికి మనిద్దరిలో ఒక్కరే మిగులుతాం. ఒకవేళ నేను కనుక రేపు ఉదయం లేకపోతే...!"

అంటూ పార్ధు అనబోతుంటే,

"పార్ధు...!

అసలే అందరినీ పోగొట్టుకుని భయంతో నేనుంటే, ఈ టైంలో నువ్విలా మాట్లాడడం!" అంటూ పార్ధు మాటలకు అడ్డుపడుతుంది కృతి, కొంచెం కంగారుగా భయంతో కూడిన స్వరంతో..

"మనం ఎంతవద్దనుకున్నా.. జరిగేదేది ఆగక మానదు. బలవంతం కాకుండా, అప్పటివరకూ అయినా ఉంటే, కనీసం ఆ రాక్షసి మనల్ని ఎందుకు చంపుతుందో తెలుస్తోంది గా...

మనం బ్రతికిన బ్రతుక్కీ విలువ లేకపోయినా...

మన చావుకి ఒక అర్థం అంటూ ఉండాలిగా" అంటూ తనలో కొద్దో గొప్పో దైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తాడు పార్ధు.

ఈ లోపే బయట నుండి వింత వింత అరుపులు, శబ్దాలు వాళ్ళకి వినిపిస్తాయి.

వాటికి కృతి కంగారు పడుతుంటే,

"అవి మనల్ని రెచ్చగొట్టి, బయటకి రప్పించి మన ప్రాణాలు తీసుకుందామని ఆ రాక్షసి ఆడుతున్న నాటకాలు. వాటి గురించి మనం అసలు పట్టించుకోవద్దు" అంటూ దైర్యం చెప్తాడు పార్ధు.

అయినా ఆ పిశాచి ఆగడాలు అంతటితో ఆగడం లేదు...

వాళ్ళని ఎలా అయిన బయటకి రప్పించాలనో ఏమో వాళ్ళని మరింతగా రెచ్చగొడుతూ...

కింద హల్ యొక్క ముఖ ద్వారం తలుపులు "డభేల్.. డభేల్.." మంటూ పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ వాటిని కొడుతుంది.

కృతి లో ఒక చిన్న ఆశా మొదలయింది.

"పార్ధు...

మెయిన్ డోర్ నీ ఎవరో బయట నుండి నాక్ చేస్తున్నారు.

బహుశా ఎవరో మనల్ని రక్షించడానికి వచ్చి వుంటారు. ఒకసారి వెళ్లి చూద్దాం" అంటూ కృతి, పార్దుతో అంటుంటే

"మళ్ళీ మళ్ళీ ఆ పిశాచి మనల్ని తన ఉచ్చులోకి దించుదామని చూస్తుంది కృతి!. మనం దాని కవ్వింపులకి ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా... మన ఇద్దరి ప్రాణాలు అనుకున్న టైం కంటే ముందే భయంతో పోతాయి." అంటూ తనకి సర్ది చెప్తాడు పార్ధు.

ఈ సారి ఆ పిశాచి ఆగడాలు మరింత ఎక్కువయ్యి, వాల్లున్న రూం యొక్క మెయిన్ డోర్ దగ్గరికి వచ్చి, ఆ డోర్ నీ నాక్ చేయడం మొదలెడుతుంది పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ...

కృతి..., పార్ధు... ఇద్దరూ మాట మాట్లాడకుండా నిశబ్ధంగా అలానే ఉంటారు.

ఆ పిశాచి మరింతగా రెచ్చిపోయి ఆ డోర్ నీ పదే పదే గట్టిగా కొడుతూ భీకరమైన, భయంకరమైన శబ్దాలు చేస్తూ వాళ్ళని భయపెడుతుంది.

అయినా మొక్కవోని పట్టుదల, నిబ్బరం తో వాళ్ళు మాత్రం అలానే కాలు కదపకుండా... నోరు మెదపకుండా.. అంతే దైర్యంతో ఉంటారు.

ఆ పిశాచి వీళ్ళ ఎత్తుకి పై ఎత్తు వేస్తూ...

"కృతి...

నేను కృతి,

నీ విశాల్ ని..

నన్ను రక్షించు...

ఈ పిశాచి నన్ను ఏదో చేయబోతుంది..

నన్ను మీరే కాపాడండి!" అంటూ విశాల్ వాయిస్ తో కృతి నీ ఏమార్చే ప్రయత్నం చేయబోతుంటే..

అంతకుముందు రోజు అలాంటి ఘటనేకే విశాల్ బలయ్యాడన్న విషయం గ్రహించని కృతి...

ఆ పిశాచి మాటలకు కరిగిపోయి

"పార్ధు...

విశాల్ పార్ధు....

మన విశాల్ కి ఏం కాలేదు...

అదిగో మనల్ని పిలుస్తున్నాడు..

తనేదో ఆపదలో ఉన్నట్టున్నాడు..

రా... వెళ్లి తనని రక్షిద్ధాం..!" అంటూ ఆ డోర్ తెరవడానికి వెళ్తుంటే,

దానికి పార్ధు అడ్డుపడి...

మెల్లగా

"నీకైమనా పిచ్చా.. కృతి!

నీకు చెప్తుంటే అర్థం కాదా..?

నిన్న కూడా ఇలాంటి ఒక ఎత్తుగడకే విశాల్ బలైంది. అప్పుడు నువ్వు స్పృహలో లేవు.

తెలిసి ... తెలిసి... నిన్ను నేను బలివ్వలేను" అంటూ కృతికి నచ్ఛ చెప్తాడు పార్ధు

"ఇదంతా పార్ధు ఆడుతున్న నాటకం కృతి,

ఇలా నిన్ను మభ్య పెట్టి, ఎలాగైనా లొంగదీసుకుని, నీ శీలాన్ని కాజేసి, నిన్ను లోబర్చుకుందామని పార్ధు ఆడుతున్న ఒక గేమ్.

ఆ గేమ్ లో నువ్వు చిక్కుకోకు కృతి. దయచేసి నా మాట విను, ఈ రూం డోర్ ఓపెన్ చెయ్యి, వాడి సంగతి నేను చూస్తా...

మనవాల్లందరూ బయటే, నా దగ్గరే ఉన్నారు. 

కావాలంటే విను వీళ్ళ మాటలు కూడా " అంటూ బయట నుండి విశాల్ వాయిస్ తొ పాటు వాళ్ళందరి మాటలతో కూడిన శబ్ధం వినిపిస్తుంది.

దాంతో కొంచెం కోపంతో కలగలిసిన భయంతో పార్ధు వంక చూస్తూ ఆ డోర్ ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తుంది కృతి.

దాన్ని పార్ధు అడ్డుకోవడంతో, కృతికి మరింత అనుమానం ఏర్పడుతుంది తనపై...

అతన్ని తోసుకుంటూ ఆ డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తుంటే, పార్ధు మళ్ళీ మళ్ళీ దాన్ని అడ్డుకుంటాడు. అలా వాళ్ల పెనుగులాటలో పార్ధు, కృతిని గట్టిగా తోసేస్తాడు. పార్ధు అలా బలంగా నెట్టడంతో కింద పడ్డ కృతి...

"నన్నేం చెయ్యిద్దు...

నన్నేం చెయ్యొద్దు..."

అంటూ దూరం దూరం జరుగుతుంది. అలా కింద పడిన కృతి ఆదే ఫ్లోర్ పై పాకుతూ...

"అది కాదు...

నిన్ను నేనేం చెయ్యను..

నా మాట విను...

నా గురించి నీకు తెలుసుగా!

అన్ని తెలిసి నువ్వు కూడా ఏంటి కృతి!" అంటూ పార్ధు ఎంత బ్రతిమాలడుతున్న వినకుండా కృతి అలా దూరంగా వెళ్తూనే ఉంటుంది.

అలా వెళ్తున్న తన చేతికి తగిలిన ఒక ఫ్లవర్ వాజ్ తీసుకుని పార్ధు తలపై గట్టిగా కొట్టడంతో అతడు అక్కడే సొమ్మసిల్లి పడిపోతాడు.

ఇక ఆ డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తున్న కృతికి, సరిగా అప్పుడు అంతకుముందు రోజులలో జరిగినవి ఒక్కొక్కటిగా గుర్తుకువస్తాయి.

"అసలు ఇప్పటివరకూ మాయమైన వాళ్ళెవరూ ఇప్పటిదాకా కనిపించలేదు.

ఇన్ని రోజులు ఎవరూ రానిది, ఇప్పుడు సడెన్ గా ఒకేసారి ఉన్నపాటుగ ఊడిపడడం ఏంటి?

పైగా ఇన్నాళ్ళ పార్ధూతో పరిచయంలో తానెప్పుడూ నాతోనే కాదు, అసలు ఎవరితోనూ అసభ్యంగా ప్రవర్తించలేదు. కనీసం అలాంటి రూమర్స్ కూడా తనపై ఎప్పుడూ రాలేదు.

పార్ధు ఒకరి క్షేమం కొరేవాడే తప్ప, ఎవరికి హాని తలపెట్టే రకం కాదు." అంటూ తనలో తాను అనుకుంటూ ఆ డోర్ తీసే తన ప్రయత్నాన్ని విరమించుకుంటుంది. వెంటనే పార్ధు దగ్గరకి వచ్చి తనవల్ల గాయపడిన అతన్ని క్షమించమని కోరి, ఆ గాయం మానడానికి తనకి సపర్యలు చేస్తుంది.

ప్లాన్ బెడిసి కొట్టడంతో ఆ పిశాచి

"హేయ్...రావే!

ఇంత సేపు బ్రతిమాలుతుంటే తలకెక్కి కూర్చున్నావ్!

ఇప్పుడు నువ్వు బయటకి రాకపోతే, నీతో పాటు వాడి అంతు తేలుస్తా!" అంటూ కృతిని, పార్ధుని పదే పదే బెదిరిస్తూ తన అసలు రంగులు బయటకి తీస్తుంది.

ఆ పిశాచి బెదిరింపులకు ఏ మాత్రం లొంగని వాళ్ళు, కొంచెం కొంచెం దైర్యాన్ని కూడగట్టుకుని అదే రూంలో, ఆ పిచాచి కవ్వింపులకు ఏ మాత్రం బెదరకుండా, చప్పుడు కాకుండా నిశబ్ధంగా అలానే ఉండిపోయారు.

                           ***************

రాత్రైంది. కృతి చిరాకుతో ఫ్రెష్ అయ్యి వచ్చింది. అప్పటికే పార్ధు ఒళ్ళు కూడా నలగడంతో తను కూడా స్నానం చేయడానికి సిద్ధమయ్యి చొక్కా విప్పాడు. పార్థు శరీరం అంతా కండలు తిరిగిన దేహంతో బలిష్టంగా ఉన్నాడు.

తనని అలా చూస్తున్న కృతిలో శృంగార కాంక్షలు రేకెత్తాయి. తన యవ్వనం... "రోజులు కూడా దగ్గర పడుతున్నాయి, ఇంకెంతకాలం ఇలా ఉంటావు" అంటూ తన శరీరాన్ని రెచ్చగొడుతూ, తన మనసుని శృంగారానికి ప్రేరేపిస్తుంది.

పార్ధు స్నానం చేయడానికి అలా గదిలోకి వెళ్ళగానే,

కృతి ఆలోచనలు ఏ మాత్రం తనకి నియంత్రణలోకి రావడం లేదు. 

"అసలు రేపో మాపో చనిపోయేటోల్లం కనీసం ఈ చివరి కోరికైనా మంచివాడు, బుద్ధి వాడైన పార్ధుతో తీర్చుకుంటే తప్పేంటి!,

పోనీ, మోసం చేశాను అనడానికి పైగా అంతగా ప్రేమించిన విశాల్ కూడా మా మధ్య లేడు." అంటూ తన బుద్ధి గాడి తప్పుతుంది.

"కానీ, ఇంత దిగజారిపోతే, పార్ధు లొంగుతాడా?

అసలెప్పుడూ ఈ అమ్మాయిలు, రొమాన్స్ అంటూ వాటి జోలికి కూడా వెళ్ళడు.

ఇప్పుడు నేనిలా చేస్తే ఏమనుకుంటాడో?" అంటూ మరొక ఆలోచన

"ఎంతైనా తను ఒక మగాడే కదా!,

అసలు ముందు మనమే అడ్వాన్స్ అయితే, చివరికి తనకి తానే లొంగుతాడు" అంటూ ఇంకొక ఆలోచన కృతి మనసుని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.

ఇంతలో బాత్రూం నుండి డోర్ తీసుకుంటూ పార్ధు బెడ్ రూం లోకి వచ్చాడు.

అప్పటికే తను స్నానం చేసి టవల్ తో ఉన్నాడు. మరొక టవల్ తో తన శరీరాన్ని సుతారంగా తుడుచుకున్నాడు. కండలు తిరిగిన ఆ శరీర ఆకృతిని అలా చూస్తుంటే, కృతి కామ కోరికలు నషాళానికి అంటుతున్నాయి. ఇదేం గమనించని పార్ధు, తన పని తాను చేసుకుంటూ బట్టలు మార్చుకునే పనిలో పడ్డాడు.

ఇంతకు మించిన అవకాశం దొరకదన్నట్టుగా,

కృతి ... పార్ధు దగ్గరికి వెళ్ళి తనని గట్టిగా వాటేసుకుంది.

అసలక్కడేం జరుగుతుందో అర్థం కాని పార్ధు...

కృతి ఏంటిది..?

నువ్వు చేస్తుంది ఏంటి..?

అసలు నీకైనా అర్ధమవుతుందా..?

వదులు కృతి,

నన్నొదులు ..!" అంటూ తనని బలవంతంగా విడిపించుకునే ప్రయత్నం చేశాడు.

అప్పటికే తన ప్లాన్ లో తానున్న కృతి,

"అక్కడ బల్లి ...!

అదిగో ఆ గోడ మీద బల్లి...!" అంటూ కళ్ళబుల్లి కబుర్లు చెప్పి పార్ధుని వలలో వేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది.

తన ప్లాన్ అర్థం కాని పార్ధు.. కృతి చెప్పిందంతా నిజమని నమ్మి...

ఆ రూం చుట్టూ చూసి, అక్కడ ఏం లేదని కన్ఫర్మ్ చేసుకుని,

అదే విషయం కృతికి చెప్తూ తనని విడిపించుకునేందుకు ట్రై చేస్తాడు.

ఈ వంకతో ఎక్కడ ఈ అవకాశం చేజారి పోతుందోనని భయంతో పార్ధుని ఇంకా బిగించి పట్టుకుంటుంది కృతి.

దాంతో కొంచెం ఇబ్బందికరంగా, అంతకంటే అసభ్యకరంగా ఉన్న కృతి చేష్టలకు విసుగుపుట్టిన పార్ధు, కృతిని "ఏంటిది కృతి" అంటూ తనని ఒక్కసారిగా మంచం మీదకి తోసేస్తాడు.

అయినా తన కోరికని విరమించుకోని కృతి మాత్రం...

మళ్ళీ పార్ధుని పట్టుకుని, ఈ సారి తన మనసులో కలిగిన కోరికను బయటపెడుతుంది.

ఇద్దరం కలిసి నైట్ అంతా గడుపుదామని, ఎంజాయ్ చేద్దామని, తన కోరికలను తీర్చుకోవడం తో పాటు పార్ధు కి ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలంటూ పార్ధికి ఆఫర్ చేస్తుంది కృతి.

"నీకేమైనా పిచ్చా..?

ఏం మాట్లాడుతున్నావో కనీసం నీకైనా అర్థమవుతుందా...?

అసలు స్పృహలో ఉండే ఇలా ...?

చ.. ఛ...

నువ్విలాంటి దానివనుకొలేదు...?

నా గురించి తెలిసి కూడా ఏంటిది కృతి!" అంటూ కృతి అన్న మాటలకు తనని మందలిస్తాడు పార్ధు.

అయినా పట్టువదలని కృతి...

ఒక్కొక్కటిగా తన డ్రెస్ తీసేస్తూ ...

పార్ధుని తన అందాలకు దాసోహామయ్యెట్టు చేయడానికి ప్రయత్నిస్తుంది.

కానీ, పార్ధు ఏ మాత్రం తనకి లొంగడం లేదు. తను కృతి వైపు చూడకుండా పక్కకు తిరిగి, కృతి చేస్తున్న ఆ వికృతి చేస్టలను వారిస్తున్నాడు.

అయినా తన పని తాను చేస్తూ న్యూడ్ గా తయారయ్యి

"ఇటు తిరుగు..!

ఇటు తిరుగు పార్ధు...!! అంటూ గట్టిగా పార్ధుని పిలుస్తుంది కృతి.

"తప్పు కృతి,

నువ్వు చేస్తుంది చాలా తప్పు !

ఇది మంచిది కాదు!" అంటూ పార్ధు మళ్ళీ మళ్ళీ కృతిని వారిస్తున్నాడు.

కృతి తన గొంతు దగ్గర కత్తి పెట్టుకుని,

"ఇది మంచిది కాదు?

ఇంకా ఎంత సేపు ఎవరం ఉంటామో తెలీదు...

ఇక.. ఇప్పుడు.. అప్పుడూ ఏముంది!

నా ఈ చివరి కోరిక తీరుస్తావా?

లేక ఈ కత్తితో నా గొంతు కోసుకుని చచ్చిపోమంటావా? అంటూ పార్ధుతో బెదిరింపులకు దిగుతుంది కృతి.

దాంతో భయపడిన పార్ధు, నెమ్మదిగా కృతి వైపు తిరుగుతాడు. అలా తను పూర్తిగా తిరిగి,

కృతి... పార్ధు.... ఒకర్ని ఒకరు చూసుకునే లోపు సడెన్గా పవర్ ఆఫ్ అవుతుంది. ఆ రూం అంతా చీకటి ఆవహిస్తుంది. మొత్తం అంధకారమే, ఎటు చూసినా ఏం కనిపించదు.

కృత్తికి భయం మొదలవుతుంది.

"పార్ధు ...!

పార్ధు...!!" అంటూ ఆ చీకట్లో పార్ధు నీ పిలుస్తుంటే, తన దగ్గర నుండి రెస్పాన్స్ లేదు.

"ఏంటి పార్ధు...

నా మీద కోపమా?

చేసిందానికి సారీ..?

క్షమాపణలు అడుగుతున్నా కదా?

మాట్లాడు పార్ధు ..!

నాకు భయం వేస్తుంది..!

ప్లీజ్ పార్ధు...!" అంటూ అప్పటికే చెమటలు పట్టిన దేహంతో, తడబడుతున్న స్వరంతో పార్ధుని వేడుకుంటుంది కృతి.

అయినా పార్ధు దగ్గర నుండి, నో రెస్పాన్స్..!

"పార్ధు...!

పార్ధు...!

ప్లీజ్ పార్ధు ..!

ఎక్కడున్నావ్ పార్ధు..!" అంటూ మరింత గట్టిగా అరుస్తుంది కృతి.

"అరవకు..." అంటూ మరొక స్వరం వినిపిస్తుంది కృతికి.

భయాందోళనకు గురైన కృతి...

"పార్ధు ...!

పార్ధు...!" అంటూ భీతిల్లిన స్వరంతో మళ్ళీ పిలుస్తుంది.

ఆరవకు అని అన్నానా? అంటూ మళ్ళీ ఆ స్వరం కృతిని హెచ్చరిస్తుంది.

"ఎవరు నువ్వు..?

నీకేం కావాలి..?

పార్ధు ఎక్కడ..?" అంటూ ఆ అజ్ఞాత వ్యక్తిని ప్రశ్నిస్తుంది కృతి.

"హా... హాహ్హా..హాహ్హాహ్హా..." అంటూ విరగబడి నవ్వుతాడు ఆ అజ్ఞాత వ్యక్తి.

"అసలేవరు నువ్వు..!

పార్ధుని ఏం చేశావ్..!"

అంటూ మళ్ళీ మళ్ళీ తన మీద అరుస్తుంది కృతి.

"నిన్ను కాపాడడానికి ఎవరూ రారు..!

ఈ రోజు నీ చావు నా చేతుల్లోనే!" అంటూ మరింత భీకరమైన స్వరంతో తనని భయపెట్టేలా మాట్లాడతాడు ఆ అజ్ఞాత వ్యక్తి .

అప్పటికే చావులకు రాటు దేలిన కృతి..

"ఓహ్... నువ్వేనా ఇక్కడందరిని చంపుతుంది.

ఇప్పుడు నా వంతు వచ్చింది అన్న మాట!

రా...! ఇంత మంది నా ప్రాణ స్నేహితులు దూరమయ్యాక, నాకీ బ్రతుకు మీద ఆశేలా ఉంటుంది

రా...!" అంటూ రెచ్చగొడుతూ ఆ అత్మని ఆహ్వానిస్తుంది కృతి .

దాంతో ఆత్మ ఒక వెలుగును తన మీద ప్రసరించుకుంటుంది.

అలా తనని చంపడానికి వెలుగులోకి వచ్చిన ఆ రూపాన్ని చూసి కృతి ఆశ్చర్యపోతుంది.

ఎందుకంటే అది ఎవరో కాదు విశాల్..!

"వి...

వి...

విశాల్..!

నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా..?"

తడబడుతున్న స్వరంతో కంగారు పడుతూ అంటూ...

"చూడు నువ్వు లేవని, పార్ధు నన్ను రేప్ చెయ్యాలని చూస్తున్నాడు. బలవంతంగా నా డ్రెస్ అంతా ఎలా లాగేశాడో చూడు..!

ఇద్..

ఇదిగో ఇక్కడే ఎక్కడో ఉన్నాడు తను, తనని ఊరికే వదలకు" అంటూ ప్లేట్ మార్చేస్తుంది అప్పటికప్పుడు కృత్తి.

తన మాటలకు "హా... హాహ్హా..హాహ్హాహ్హా..." అంటూ మరింత బిగ్గరగా నవ్వుతాడు విశాల్ (అదే ఆ ఆత్మ.)

"ఏమైంది ?

ఎందుకలా నవ్వుతున్నావ్.?

ఇంత సీరియస్ గా చెప్తుంటే నీకు జోక్ లా ఉందా?" అంటూ ప్రశ్నిస్తుంది కృతి.

"ఎందుకే ఈ నాటకాలు...

నాకంత తెలుసే!

ఒకప్పుడు నన్ను ప్రాణంగా ప్రేమించిన రాధని దూరం చేసావ్..

ఇప్పుడు నేను మీ మధ్య లేనని తెలిసి పార్ధుతొ...

ఛీ... ఛీ...!

నీలాంటి దాన్ని..!" అంటూ విశాల్ అంటుంటే, తన మాటలకి అడ్డుపడి...

"ఇన్నేళ్ల మన ప్రయాణంలో... ఇంతేనా విశాల్, నన్ను నువ్వు అర్థం చేసుకున్నది!" అంటూ తన కుయుక్తులు అల్లే ప్రయత్నం చేస్తుంటే,

చాల్లే ఇక ఆపవే !

నీ పనికిమాలిన వేషాలు ...

మదమెక్కి కొట్టుకుంటున్న నీకన్నా, పొట్టకూటి కోసం తమ దేహాలను అమ్ముకుంటున్న ఆ వేశ్యలు నయం కదే!

అయినా వాళ్ళని నీతో పోలిస్తే, వాళ్లకున్న ఆ కనీస విలువ కూడా పోతుంది."

ఇప్పుడు నువ్వు చెప్పేవన్నీ గుడ్డిగా నమ్మడానికి నువ్వనుకుంటున్నట్టు నేను నీ విశాల్ ని కాదే!

నువ్వు చేసిన పాపాలన్నీ తప్పులుగా మూట కట్టిన నీ పాలిట చిత్ర గుప్తుడనీ, నీ ప్రాణాలు హరించడానికి వచ్చిన నీ పాలిట యముడ్ని" అంటూ ఆ ఆత్మ బిగ్గరగా, మరింత భయంకరంగా నవ్వుతూ అంటుంటే,



"నన్నేం చెయ్యొద్దు..!

ప్లీజ్ నన్ను వదిలేయ్..!" అంటూ వేడుకుంటున్న కృతితో



"ఈ యోగి అంత తేలిగ్గా నీలాంటి వాళ్ళని వదలడు.

మరణమే...!

నీకు ఈ యోగి ఈ భూలోకంలో విధించే శిక్ష!" అంటూ వివస్త్రగా ఉన్న కృతి జుట్టు పట్టుకుని తన తలని గోడకేసి కొట్టి చంపేస్తాడు.


ఇక మిగిలింది పార్ధు ఒక్కడే,

తనకున్న మంచితనంతో ఇక్కడ నుండి తప్పించుకుంటాడా?

లేక, తను కూడా ఇలాంటి ఒక తప్పు చేసి ఆ పిశాచాలకి బలవుతాడా?

యోగి, యోధ కథ ఇప్పటికైనా తెలుస్తుందా..?

వాళ్ల కథను బయట పెట్టే మార్గం ఏమిటి, ఆ మార్గానికి కారకులెవరు?

ఇప్పటివరకు మన కథకి, కథా నాయకుడిగా భావించిన పార్ధుని రక్షించడానికి ఇప్పటికైనా బయట నుండి ఎవరైనా వస్తారా? లేక తను కూడా అందరిలాగే పక్కనున్న స్మశానానంలో సమాధవుతూ దానికే శాశ్వతంగా సొంతమవుతాడా?

లాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే, మిగిలిన భాగాలు అసలు మిస్ కాకండి.

"యోధ (ఓ ఆత్మ ఘోష)" ఇంకా కొనసాగుతోంది.

తర్వాతి భాగం

"యోధ (ఓ ఆత్మ ఘోష)-12" లో కొనసాగిస్తాను...

అంతవరకూ ...

కొంచెం ఓపిక పట్టి,

మీ విలువైన అభిప్రాయాలను సమీక్షల ద్వారా తెలపండి. అవి నాకు మరింత ఉత్సాహాన్నిచ్చి, నా ఈ కథకు నూతనొత్తేజాన్నిస్తాయి.

నా రచనలను ఆదరిస్తున్న పాఠకులకు నా హృదయపూర్వక ధన్యవాదములు

రచన: సత్య పవన్ ✍️✍️✍️



Rate this content
Log in

Similar telugu story from Horror