Naveen Surya

Classics Inspirational Others

4.5  

Naveen Surya

Classics Inspirational Others

వ్యామోహం

వ్యామోహం

1 min
354


ఓ రోజు.. ఒక రాజు వేటకు వెళ్లి మధ్యలో అలసి పోయాడు. ఆ అడవి దారికి దగ్గరిగా ఉన్న ఓ గ్రామానికి చేరుకున్నాడు. ఆ గ్రామం లో ఓ ఇంటి ముందు ఆగాడు. ఆ ఇంట్లో ఓ స్త్రీ తన భర్త కు భోజనం వడ్డించడాన్ని చూసాడు. ఆమె చాలా అందం గా ఉంది. ఆమె అందాన్ని చూసి.. అంతటి రాజే స్థాణువైపోయాడు. ఆమె భర్త భోజనం చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఆమె కూడా తలుపులు మూసేసి లోపలకి వెళ్ళబోతున్న సమయం లో రాజు అక్కడకు వెళ్లి ఆ ఇంటి తలుపు కొట్టాడు.


ఆమె తలుపు తీసి ఎవరు అని ప్రశ్నించగా.. ఆ రాజు లోపలకి వచ్చి కూర్చుని తనను తానూ పరిచయం చేసుకున్నాడు. తాను ఈ రాజ్యానికి రాజునని చెప్పి.. నీవు ఎంతో అందం గా ఉన్నావు. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాడు. దీనితో ఆమె ఆశ్చర్యపోయింది. తనకు మునుపే పెళ్లి అయినదని వారించింది. అయినా.. ఆ రాజు వినలేదు. దీనితో ఆమెకు పాలుపోలేదు. ఎదురు గా ఉన్నది మహారాజు. ఏమైనా తేడా వస్తే.. పరిస్థితి ఎలా ఉంటుందో అన్న భయం కలిగింది ఆమెకు. ఆమె గుణవంతురాలు..మరియు సంస్కారం కల అమ్మాయి.


వెంటనే, రాజా.. మీరు ముందు భోజనం చేయండి. చాలా దూరం నుంచి వచ్చి అలసి పోయి ఉంటారు అంటూ.. తన భర్త భోజనం చేసిన ఎంగిలి ఆకు వైపు చూపించింది. అది చూసి మహారాజు కు కోపం వచ్చింది. నీ భర్త భోజనం చేసిన ఎంగిలి ఆకులో నేను భోజనం చేయాలా అంటూ ఆగ్రహించాడు


అప్పుడు ఆమె” రాజా.. శాంతించండి. నా భర్త భోజనం చేసిన ఆకులో భోజనం చేయడానికి అడ్డు వచ్చిన ఎంగిలి ఇది వరకే పెళ్లి అయి ఒకరి సొంతం అయిపోయినన్ను నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి అడ్డు రాలేదా? అని ప్రశ్నించింది. దీనితో, రాజుకు విషయం బోధపడింది. వెంటనే, అక్కడనుంచి లేచి ఆమెకు నమస్కరించి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. 



పరాయి అమ్మాయినీ ఎప్పుడు చెడుగా చూడకూడదు , తప్పుగా ప్రవర్తించకూడదు



Rate this content
Log in

Similar telugu story from Classics