Mahesh krishna

Comedy Drama Classics

4.0  

Mahesh krishna

Comedy Drama Classics

వర్ధినీవర్దనం

వర్ధినీవర్దనం

3 mins
232


అనగనగా తుణుకు అనే ఊరు.ఆ ఊరిలో వర్ధన్ అనే 12 ఏళ్ల కుర్రవాడు ఉండేవాడు.అతను ఏడ వ తరగతి చదువుతున్నాడు.అదే పాఠశాల లో దివ్యవర్ధిని అనే పిల్ల ఏడ వ తరగతిలో కొత్తగా చేరింది.వృత్తి రీత్యా వర్ధన్ కుటుంబం తుణుకు కు వలస వచ్చారు,వర్ధిని కుటుంబం తుణుకు లోనే పుట్టిపెరిగినవాళ్లు.వర్ధిని తండ్రికి ఒక సొంత చెల్లి ఉంది.ఆమెకు 15ఏళ్ల సురేష్ అనే కొడుకు ఉన్నాడు.

       

         వర్ధిని తండ్రికి ఏకైక పుత్రిక కావడంతో ఎంతో గారాల ముద్దుగా పెంచుకున్నారు.ఇక వర్ధిని విషయానికి వస్తే తుణుకులో అందరికంటే ఎక్కువ సుందరమైన అమ్మాయి.ముఖ్యంగా పద్ధతి బాగా తెలిసిన అమ్మాయి.కొంచెం భయం,ఎక్కువ జాలి కలిగిన అందమైన అమాయకురాలు.తన తండ్రి అంటే వర్ధినికి చాలా ఇష్టం.వారిరువురు తండ్రి కూతురు లా కాకుండా స్నేహితుల లా ఉంటారు.రోజులో జరిగే ప్రతి చిన్న విషయం తన తండ్రితో పంచుకునేది.


         వర్ధన్ తల్లిదండ్రులకు వర్ధన్ పెద్ద పుత్రుడు,అతనికి ఒక చెల్లి ఉంది తనపేరు వర్షిని తన వయసు12 సంవత్సరాలు,విషయం ఏంటంటే వాళ్లిద్దరూ కవలపిల్లలు.మనలో చాలా మంది లాగా ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం.అందరి లాగానే ఇళ్లు-బడి-ఆటలు ఇవే అతని ప్రపంచం.కొంచెం తుంటరి ఎక్కువ అల్లరి చేసే అల్లరి పిల్లవాడు.తండ్రి అంటే చచ్చేంత భయం.సంతోషమైనా బాధైనా,అవసరమైనప్పుడు తల్లితో పంచుకునేవాడు.

      

            వర్ధన్,వర్ధినిలు ఇద్దరివీ రెండు భిన్నమైన ప్రపంచాలు.వారి ఆలోచనలు వేరు,పధ్దతులు వేరు,జీవితం అంటే అంతే కదా భిన్న మనుషులు,భిన్న మనస్తతత్వాలు,భిన్న మార్గాల లో సాగిపోయే ప్రయాణం.


         చదువులో ఇద్దరూ చురుకుగా ఉండేవారు.పరిస్థితుల కారణంగా వర్ధిని,వర్దన్ చదివే పాఠశాలలో చేరవలసి వచ్చింది.ఆరవ తరగతి అవ్వగానే వచ్చిన వేసవి సెలవులలో ఖాలీగా ఉండకుండా వర్దన్ ఒక కిరాణా దుకాణం లో పనిచేసి,పాత సైకిలు కొన్నాడు.


        వేసవి చల్లారగానే,మూతపడిన పాఠశాలలు తెరుచుకున్నాయి.కొంత మంది కొత్త విధ్యార్ధులు మిగతా మంది పాత విధ్యార్ధులతో నిండిపోయింది.పాఠశాలకు మొదటిరోజు వెళ్లటానికి వర్దన్ ఎంతో కుతూహలంతో ఎదురు చూస్తున్నాడు ఎందుకంటే ఆరవ తరగతి వరకూ లాగు తొడుగుకుని వెళ్లినవాడు మొదటిసారిగా ప్యాంటు ధరించబోతున్నాడు.అదే ఉత్సాహంతో పాఠశాలకు తను కొనుక్కున్న సైకిలు మీద వాయువేగంతో బయలుదేరాడు.కొంత దూరం వెళ్లగానే తన స్నేహితుడు తారసపడ్డాడు.అలా ఇద్దరూ కలసి పోటాపోటీగా వెళ్తుండగా ఎదురుగా ఉన్న రిక్షాను చూసుకోకుండా ఢీ కొట్టి పడిపోతాడు వర్దన్.

          వర్దన్ కు స్వల్ప గాయాలు తగలడంతో తన స్నేహితుడి సాయంతో తిరిగి ఇంటికి చేరుకుంటాడు.కొడుకు ని గాయాలతో చూడగానే తట్టుకోలేక తల్లి రోదిస్తూ గాయాలకు మందు రాస్తుంటుంది.అంతలోనే వర్దన్ తండ్రి ఇలా అంటారు

తండ్రి : నేను ముందు నుండి చెప్తూనేవున్నా వాడిని సైకిలు మీద బడికి పంపొద్దని.ఇప్పుడు చూడు ఏం చేసుకొచ్చాడో.దిక్కుమాలిన ఇనుము పాతది వద్దురా అంటే వినలేదు.

తల్లి : అవునండీ ! మీ మాట వినకుండా తప్పు చేశాను.రేపటి నుండి ఆ బాషా గాడి రిక్షా మాట్లాడండి.ఇంక ఈ వెదవ సైకిలు మూలకి పడేస్తా.

    ఇప్పుడున్న పరిస్థితిలో తనకు ఇంక ప్రత్యాన్మాయం లేదని గమనించి తల్లిదండ్రుల మాటలకి తలూపాడు వర్దన్.

ఆ మర్నాడు ఉదయాన్నే సగం తగ్గిన గాయాలు కొంత బాధిస్తున్నప్పటికీ తగినంత ఉత్సాసం తెచ్చుకుని బడికి వెళ్లేందుకు సిధ్దపడ్డాడు.ఇంతలో రిక్షా నడిపే బాషా ఇంటి ముందు ఆగి గంట కొట్టసాగాడు.వర్దన్ పరుగున వెళ్లి వస్తున్నా అన్నట్టుగా సైగ చేసి లోపలికి వెళ్తూ తనను తాను మహారాజులా తలచి కత్తి ఢాలు వలె ఒక చేత్తో భోజన సంచి మరో చేతిలో కలం పట్టుకుని వీపుకు రక్షణ కవచం లాగా పుస్తకాల సంచి తగిలించుకుని,మహారాజు పీఠాన్ని అధీష్టించుతున్నట్టు రిక్షాలో కూర్చున్నాడు.

        రిక్షా లో మాట్లాడటానికి ఎవరూ లేకపోవడంతో తప్పదన్నట్టుగా బాషాతో మాటకలిపాడు.ఆ మాటలతో కాలక్షేపం అయిపోయింది.బడి కి వచ్చేశాడు వర్దన్.రెండు నెలల క్రిందట చూసిన బడిని అందులోని తరగతి గదిని మరల చూడగానే రెట్టింపు ఉత్సాహం వచ్చేసింది వర్దన్ కి.వెళ్లగానే ముందుగా మొదటి బెంచిని ఎంచుకుని అందులో తన సంచిని ఉంచి తన పాత స్నేహితులతో పిచ్చాపాటి మాటలలో మునిగి తేలాడు.ఇంతకీ తన తరగతిలో ఉండే విధ్యార్ధుల సంఖ్య 15.అందులో 10 మీసాలు 5 జడలు.

ఇంతలో మొదటి గంట మోగింది .అందరూ లేచినిలబడి సరస్వతి పద్యం పాడారు.వెంటనే కూర్చోగానే రెండవ గంట మోగింది మళ్లీ లేచి నిలబడ్డారు కానీ ఈసారి పద్యం కాదు పద్మావతి గారు ,ఈవిడ 7వ తరగతికి తెలుగు భాష భోదించే ఉపాద్యాయిని.

           తన శిష్యులందరినీ ఉద్దేసించి అందరికీ స్వాగతం తెలిపి,తనతో తెచ్చుకున్న హాజరుపట్టిక ను తెరుస్తూండగా ఇంతలో ఇద్దరు ఆడపిల్లలు నవ్వటం గమనించి "ఏమ్మా ఆ తమాషా ఏంటో అందరికీ చెప్తే మేము కూడా నవ్విపెడతాం"అని వ్యంగ్యంగా అన్నారు పద్మావతి.

విధ్యార్ధిని 1 : అది కాదు టీచర్ ,తిను నిన్న జరిగిన ఒక సంఘటన గురించి చెప్పింది అది వినగానే నవ్వు వచ్చింది మన్నించండి టీచర్ అంటూ వేలు ను తన పక్కనే కూర్చున్న వర్ధిని వైపు చూపించింది

పద్మావతి : అబ్బో అంతగా నవ్వించే సంఘటనైతే అందరికీ చెప్పమ్మా అంటూ వర్ధిని ని నుంచోపెట్టింది.

వర్ధిని : అది ,నిన్న బడికి వస్తుండగా నేను వస్తున్న రిక్షా ను గుద్దుకుని ఆ అబ్బాయి(వర్దన్ )కిందపడిపోయాడు .క్రింద పడగానే తను తన గాయాలు చూసుకోకుండా తన సంచిలో నుండి జారిపడిన నెమలీక కోసం పరిగెట్టాడు,అందుకే అది గుర్తుకొచ్చి చెప్తున్నా ఇంతలో మీరు అరిచారు టీచర్ అంటూ జరిగిందంతా చెప్పుకొచ్చింది.

  అది విని తరగతి విధ్యార్ధులంతా నవ్వారు.తనని మొదటిరోజే నవ్వులపాలుచేసిన ఆ అమ్మాయి మీద మొదటిసారి కోపమొచ్చింది వర్దన్ కి.తల దించుకుని తన పక్కనున్న స్నేహితుడి ద్వారా తన పేరు వర్ధిని అని,ఈ ఊళ్లోనే అత్యంత అందగత్తె అని ,చదువులో సరస్వతి,గుణంలో సీతాదేవి కి ఏమీ తీసిపోదు అని పొగుడుతూ ఉండగా వర్దన్ కి కోపం పొంగుకొస్తోంది.

అమ్మాయికి చదువుతో పాటు పొగరు కూడా ఎక్కువే ఉంది అని మనసులో అనుకున్నాడు.

       ముందు ముందు జరిగే కథకు ఇది మొదటి భాగం మాత్రమే ఇకపై వర్ధినీవర్దను లలో ఎవరి పట్టు ఎంత అనేది మున్ముందు భాగాలలో చదవగలరు


Rate this content
Log in

Similar telugu story from Comedy