Mahesh Siripurapu

Drama

4.8  

Mahesh Siripurapu

Drama

అమ్మని అమ్ముకోకు

అమ్మని అమ్ముకోకు

3 mins
649


కథః అమ్మని అమ్ముకోకు

    

     అది సూర్యుడు అస్తమించు సమయం.6 గం కావస్తోంది.తన పెరట్లో పెరిగిన గులాబి పువ్వుని భార్యకిచ్చి,ఆమెను సంతోషపరచాలనుకున్నాడు రాజు.

మాపటేల పూలుకొయ్యొద్దని నీకెన్నిసార్లు చెప్పేదయ్యా అంటూ రాజు వద్దకు వచ్చింది తన భార్య సీతమ్మ.ఒక్కసారిగా తను చేస్తున్న పనిని ఆపేసి కత్తెరను ప్రక్కకు విసిరేశాడు రాజు.ఏం చేద్దామనుకున్నాడో వివరించేలోపే పువ్విచ్చి సంతోషపెడదాం అనుకున్న తన భార్య పూలన్దేవి లా మారిపోయేసరికి చేసేదేమీలేక విస్తుపోయాడు. ఇంతలో ఇంట్లోని ఒక మూలన ఉన్న సెల్

ఫోన్ నుండి శబ్దం రావటంచేత సీతమ్మ నోటికి తాళం పడింది.పచ్చబటను ఒత్తు అంటూ భర్తకి సలహా ఇచ్చింది సీతమ్మ.రాజు బటను నొక్కి చెవిదగ్గరపెట్టి "అలో "అన్నాడు.

నాన్నా ,నేను అంటూ జవాబొచ్చింది,(తన కొడుకు భారతీశం చదువు కోసం విదేశం వెళ్లి ఆరు మాసాలు కావస్తోంది.తనకున్న ఒక్క ఇంటిని తాకట్టుపెట్టి పంపిస్తాడు రాజు.అప్పటినుండి ఒక్కసారి కూడా ఫోన్ చెయ్యలేదు)

         అయ్యా,!భారతీశం, బాగున్నావా అయ్య?ఆరోగ్యం బాగుందా అయ్య?అన్నాడు రాజు.నేను బాగున్నా కానీ నువ్వు అమ్మ బాగున్నారా అంటాడు భారతీశం.ఆ ప్రశ్న వినగానే పుత్రోత్సాహంతో కల్లలో నీల్లు తిరుగుతాయి రాజు కి ,తుడచుకుంటూ మేము బాగున్నామయ్య అంటాడు.సరే ,అయితే నేను చెప్పేది జాగ్రత్తగా విను అని తను చెప్పదలచుకున్న విషయాన్ని ఇలా చెప్పాడు"నాన్న, నాకు ఇక్కడ చాలా ఇబ్బంది గా ఉంది .వేళకి నన్ను చూసుకునే వారులేక భోజనం సహించక కష్టాలు పడవలసి వస్తోంది.మీరు నాతో ఉంటే నాకు కాస్త అండగా ఉంటుంది కావున మీరు నా దగ్గరకి రావటానికి అన్ని ఏర్పాట్లు చేశాను.రేపు ఉదయం 5గం కు నా స్నేహితుడు వచ్చి మిమ్మల్ని దగ్గరుండి విమానం ఎక్కిస్తాడు.మీరు తను తెచ్చిన కాగితాల మీద సంతకాలు పెడితే సరిపోతుంది"అని అంటాడు భరత్(తను విదేశం వెళ్లాక మార్చుకున్నపేరు).

          

        ఒక్కసారిగా ఆలోచనలో పడతాడు రాజు.మరి తమ పొలం పరిస్ధితి ఏంటని కొడుకుని అడుగుతాడు రాజు.

పొలం తన స్నేహితుడి కుటుంబ పర్యవేక్షణ లో క్షేమంగా ఉంటుందని చెప్పి వారిని ఒప్పించి తెల్లవారేసరికి సిధ్దంగా ఉండమని అంతటితో సంభాషణ ముగించాడు.తమ కొడుకు  దిగులుగా ఉన్నాడని అర్ధమయింది వాళ్లకి.ఆ క్షణాన వారికి కొడుకుకంటే పొలం పెద్ద గొప్ప కాదనుకున్నారు.భూదేవి తల్లయితే పొలం కన్నబిడ్డ.అందుకే సొంత కొడుకు ఆలన పాలన కై కన్నబిడ్డని దత్తత ఇవ్వటానికి సిధ్దపడ్డారు.


     తెల్లవారింది ,ఇంటి ముందు నాలుగు చక్రాల వాహనం వచ్చి ఆగింది అందులోనుండి సూటు బూటు వేసుకున్న ఒక వ్యక్తి దిగి తనను తాను రుద్రప్రతాప్ అని తను భారతీశం స్నేహితుడని పరిచయం చేసుకుంటాడు.తనతో వెంటతెచ్చిన కొన్ని పత్రాలమీద సంతకాలు తీసుకుంటాడు.వారిని విమానం ఎక్కించి భారతీశం వద్దకు పంపిస్తాడు.విమానం లో ఎక్కటం మొదటిసారి కావటంచేత రాజు ,సీతమ్మ లకు అందులో వాతావరణం వింతగా అనిపించింది.


     సుదీర్ఘసమయంపాటు ప్రయాణం చేయుట వలన అలసటగా అనిపించింది భార్యభర్తలకి.భారతీశం విమానాశ్రయంలో తన తల్లిదండ్రులను కలిసి తను అద్దెకు ఉంటున్న ఇంటికి తీసుకెళ్లాడు.అది చూడడానికి చాలా ఖరీదు గా అనిపించింది రాజుకి ,వెంటనే ఆపుకోలేక కొడుకుని ఈ విధంగా అడిగాడు" ఏరా అయ్య ఈ ఇంట్లో నీతో పాటు పదిమందుంటారా?" లేదు నాన్న నేనొక్కడినే ఉంటాను ఎప్పుడైనా స్నేహితులు సరదాగా గడపడానికి వస్తుంటారు.

నేను ఇక్కడకి వచ్చాక వాళ్ల సలహా మేరకు స్టాక్ మార్కెట్లో షేర్స్ కొన్నాను.ఇది చదువుకుంటూ సంపాదించే అవకాశం.

ఇందులో త్వరగా లక్షాదికారి అయిపోవచ్చు, అప్పుడు ఇదే ఇళ్లు కొనేయచ్చు అంటాడు భారతీశం.

    ఇళ్లు,పొలమే నయ్యా నాకు తెలిసినది,నాకు నీ అంత తెలివి,చదువు లేదు.కానీ భారతీశం ఒక్కటిమాత్రం గుర్తుపెట్టుకో ఏదైనా సరే సిరి నీదగ్గరకి ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా నీనుండి వెళ్లిపోతుంది.కనుక ఏపని చేసినా ఆలోచించి చేయమని అంటాడు రాజు.

    

ఆరునెలల క్రితం


భరత్ తను షేర్స్ లోపెట్టిన డబ్బులన్నీ కోల్పోయాడు.కలలు కన్న చదువు మానేశాడు.సరదాలకు బానిసయ్యాడు ఏంచెయ్యాలో పాలుపోక అప్పులు చేశాడు.ఆ అప్పులకి తీసుకున్న వడ్డీలు కట్టలేక సొంత ఊరిలో ఉన్న స్ధలాలు అమ్మటానికి సిద్ధపడి వాడి తల్లీదండ్రులకు ఫోన్ చేస్తాడు.తను నిజం చెప్తే ఆ పొలం అమ్మనివ్వరు కాబట్టి వారి చేత అమాయకంగా కౌలుకు భూమిని ఇస్తున్నట్టు నాన్నని నమ్మించి ఆ10 ఎకరాల భూమిని అమ్మి తన అప్పుని చెల్లించాడు.


ప్రస్తుతంః

వారం రోజుల పాటు తన తల్లి దండ్రులను ఊరంతా తిప్పి,వారి తో ఉల్లాసంగా గడిపి.తను కోలుకున్నానని వాళ్లని తిరిగి భారతదేశానికి వెళ్లిపోమని చెప్పాడు భారతీశం.


వారిని తిరిగి పంపించేశాడు.

వారం రోజుల తరువాత తన తండ్రికి నిజం చెప్పటానికి ధైర్యం తెచ్చుకుని ఫోన్ చేశాడు అప్పుడు ఆ ఫోన్ నంబరు రద్దయినట్టుగా తెలిసింది.ఒక్కసారిగా ఒళ్లు జలతరించింది భారతీశానికి,తన వాల్లకి ఏ హాని జరిగిందో అనే భయంతో భారతదేశంలోని తన స్వగృహానికి పరుగుతీశాడు.


ఇంటికొచ్చి చూడగా వారు ఉండరు పైగా తాళం వేసివుంటుంది.తను పొలం అమ్మిన రుద్ర ప్రతాప్ ని కలవటానికి వెళతాడు.అక్కడ తన తల్లిదండ్రులు అతనికి తారసపడతారు.వాళ్లు అక్కడ ఎందుకు ఉండవలసివచ్చిందో వివరించాడు రుద్ర ప్రతాప్.

"రాజు సీతమ్మలు తమ ఊరిని చేరుకుని పొలం చుట్టూ కట్టబడ్డ కంచెని చూసి ఆశ్చర్యోక్తులై ఆచూకి తెలుసుకుని రుద్రప్రతాప్ నుంచి విషయం తెలుసుకుని తన పొలాన్ని కొడుకు కోసం వదులుకోవటానికి సిద్దపడతారు".అని చెప్తాడు.

ఈ నిర్ణయానికి ఉత్తేజితుడై రుద్రప్రతాప్ వారి పొలాన్ని వారికే ఇచ్చేశాడు.కానీ,భారతీశానికి ఒక గుణపాఠం చెప్పదలచి వారిని తన దగ్గర పెట్టుకుని వారి దినచర్య ను చూసుకుంటూ భారతీశం రాకకై ఎదురుచూస్తున్నాడు.

తను ఎంత పెద్ద తప్పు చేశాడో తెలుసుకున్న భారతీశం వెంటనే తన తల్లిదండ్రుం కాళ్లకి నమస్కరించి.

నాన్న నా తప్పు తెలుసుకున్నాను ,భూదేవి అంటే తల్లి లాంటిదని తెలుసుకున్నాను.మీరు నా కోసం మీరు ఎన్నో తరాలనుండి నమ్ముకున్న భూమిని సైతం వదులకోవటానికి సిధ్దపడ్డారు.కానీ నేను అమ్మ లాంటి భూమి ని అమ్మాలనుకున్నాను.

ఇప్పటి నుండి మీతో పాటే నాగలి పట్టి పొలం పండించుకుంటూ జీవిస్తాను అని పలికి తన తలిదండ్రులతో కలిసి సంతోషంగా అక్కడినుండి వెళ్లిపోయాడు.

    ఇట్లుః మహేష్ కృష్ణ



Rate this content
Log in

Similar telugu story from Drama