STORYMIRROR

T. s.

Classics Inspirational

4  

T. s.

Classics Inspirational

వేదం

వేదం

1 min
613

ఏంటోరా నువ్వు ఎప్పుడూ నాకు అర్థం కావు అన్నాడు శివ.

ఇప్పుడు నేను నీకు అంత అర్థం కాకుండా ఏం ఉంది అన్నాడు వేద్.

పొద్దున్నే ఏం పని లేనట్టు ఆ మంత్రాలు చదవడమేంటో

అసలు నువ్వు చేసే పని ఏంటి ఇప్పుడు ఈ అవతారం ఏంటి అని కిందికి మీదికి వేద్ ని పరికించి చూసాడు శివ.

అది నా ఫ్యాషన్, ఇది నా యాంభీషన్.

తెల్లమొహం వేసుకుని చూస్తున స్నేహితుడు శివని చూస్తూ అసలు నీ బాధ ఏంటిరా అన్నాడు వేద్.

నువ్వు ఫ్యాషన్ ప్రపంచంలో పెద్ద రాక్ స్టార్ వి

నీ చుట్టూ వేల మంది నీ అభిమానులు, నీ సంపాదన లక్షలలో ఉంటుంది.

అలాంటి నువ్వు తెల్లవారుజామున కాగానే ఈ పంచే కట్టుకుని పిలక వేసుకుని ఈ గుడికి వచ్చి మంత్రాలు చదువుతావు, గుళ్ళో దేవుడికి పూజలు చేస్తావు, వాళ్ళిచ్చే రెండువేల రూపాయల జీతం తీసుకుంటావు.

ఎందుకిలా అన్నాడు శివ.

అరే శివా నా అసలు పేరు నీకు తెలుసా.

ఎందుకు తెలీదు ది గ్రేట్ రాక్ స్టార్ వేద్.

కాదురా నా అసలు పేరు వేదశాస్ర్తీ.

నేను తరతరాలుగా అర్చకత్వం చేసి బ్రతికే బ్రాహ్మణ కుటుంబలో నుంచి వచ్చిన వాణ్ణి,

చిన్నప్పటి నుంచి వేదాలు విని, వేదాలు పఠించిన వాణ్ణి.

కానీ నాకు ఇలా గొప్ప రాక్ స్టార్ అవాలని కోరిక.

అందుకే రాక్ స్టార్ అయ్యా.

కానీ మా నాన్న కోరిక ప్రకారం మా తాత ముత్తాతలు నుంచి వచ్చే గుళ్లో వేదమంత్రాలు చదివే పని చేస్తూన్న అన్నాడు వేద్.

ఆశ్చర్యంగా చూస్తున్న శివతో మా నాన్న ముందే చెప్పారురా నువ్వు నీకు నచ్చిన పని చేయి కానీ తరతరాలుగా వచ్చే మన ఆచార వ్యవహారాలను మాత్రం వదలకు అని అందుకే నా పని నేను చేస్తున్న అన్నాడు వేద్.

నువ్వు నిజంగా గ్రేట్ రా వేద్ మనస్పూర్తిగా మెచ్చుకున్నాడు శివ.

ఇందులో నా గొప్పతనం ఏం లేదురా చిన్నప్పటి నుంచి 

మన ఆచారాలు, సాంప్రదాయాల గొప్పతనం వింటూ పెరిగినవాణ్ణి అందుకే వాటిని మన తెలుగు సంస్కృతిని నిలబెట్టడంలో నావంతు ప్రయత్నం ఇది అన్నాడు వేద్.



Rate this content
Log in

Similar telugu story from Classics