STORYMIRROR

Narra Pandu

Classics Fantasy Others

4  

Narra Pandu

Classics Fantasy Others

వానలతో మా పల్లె

వానలతో మా పల్లె

1 min
368

వానలతో మా పల్లె


కురుస్తున్న చిటపట చిరుజల్లులు


టపటప చప్పుళ్ళతో చినుకులు


చల్లదనంతో పుడమితల్లి పులకరింతలు తేలిపోతున్న వేడివాయువులు


సూర్యుడిని కప్పేసిన కారుమబ్బులు


ఉరుములు మెరుపులతో జడివానలు


దివి నుండి భువికి నిత్యం వాన దారలు


ఆగి ఆగి అరుపులు పెడుతున్న గోవులు


పాలకోసం ప్రాకులాడుతున్న లేగదూడలు


చినుకుల మధ్య చీమల పరుగులు


చలితో వణుకుతున్న చంటి పిల్లలు


విశ్రాంతి లేకుండా వీస్తున్న ఈదురు గాలులు


నేల కొరుగుతున్న పెద్ద పెద్ద వృక్షాలు


కూలిపోతున్న నిరుపేదల గుడిసెలు


జలమయమైన వీధులు


వీధి వీధిలో రోడ్లన్నీ బురదలు


అనుకోకుండా జరుగుతున్న అద్భుతాలు


అంతలోనే ఆనందంలో విషాదాలు


ఒక్కసారిగా మారిన వాతావరణ మార్పులు


కానీ రైతన్న కళ్ళల్లో మాత్రం కాంతి రేఖలు


నర్ర పాండు✍️


Rate this content
Log in

Similar telugu story from Classics