Praveena Monangi

Comedy Drama

4  

Praveena Monangi

Comedy Drama

వాళ్ల తిండి వాళ్ల ఇష్టం

వాళ్ల తిండి వాళ్ల ఇష్టం

4 mins
541


అమ్మా! ఇంకా కారు తుడిచింది చాల్లే పైకి వచ్చేసెయ్ ఈరోజు సినిమా ప్రోగ్రాం క్యాన్సిల్ డాడీ కి రావడానికి లేట్ అవుతుందంట అంటూ పై నుంచి మా అమ్మాయి అరవడంతో ఈ కాస్త తుడిచి వస్తాలే ఉండు అని చెప్పి పైకి వచ్చిన నేను మా అమ్మాయి ముభావంగా ఉండడం చూసి ఏమయ్యింది, డాడీ ఏమన్నారు అని అడిగాను. "డాడీకి ఆఫీస్ నుంచి రావడం లేట్ అవుతుందంట సినిమా ప్రోగ్రాం క్యాన్సిల్ అని చెప్పారు" నేను మాట్లాడుతానులే అని చెప్పి మా వారికి ఫోన్ చేయగా మా అమ్మాయికి చెప్పిన విషయమే చెప్పారు చేసేదేమి లేక సోఫాలో చతికిల పడ్డాను మా అమ్మాయి మాత్రం మన ఇంటి దగ్గరే కదా సినిమా ధియేటర్ మనము ఆటోలో వెళ్ళిపోదాం డాడీ లేటుగా వచ్చినా మనతో జాయిన్ అవుతారు, లేదంటే నేను మా ఫ్రెండ్స్ తో వెళ్ళిపోతాను ఇలా రకరకాల ప్లాన్ వేసింది. నేను మాత్రం ససేమిరా అన్నాను డాడీ రావడం ఎంత లేట్ అయిన పర్వాలేదు ముగ్గురం కలిసే వెళ్దాం లేదంటే ప్రోగ్రాం క్యాన్సిల్ అని చెప్పేసా! మా అమ్మాయి బుంగమూతి పెట్టుకుని గదిలోకి వెళ్లిపోయి అలకపాన్పు ఎక్కింది. కాసేపటికి మా వారి వద్ద నుంచి ఫోన్ వచ్చింది ఆఫీస్ నుంచి బయలుదేరుతున్నాను మీరు రెడీగా ఉండండి నేను వచ్చిన వెంటనే వెళ్దాము అని. మామూలుగా మనం పిల్లలని ఏదయినా పని ఉందని పిలిస్తే రా అని పిలిస్తే వినబడలేదు అంటారు కానీ ఈ మాటలు మాత్రం వినబడిపోతాయి. డాడీ వస్తున్నారు కదా అంటూ గదిలోనుండి బయటకి వస్తూ చిరునవ్వుతో తన ముఖం మెరిసిపోయింది. సరే ఈ పాలు తాగేసి తొందరగా తయారుకా అని చెప్పి నేను స్నానానికి వెళ్ళాను మావారు రావడంతో కాస్త ఆలస్యమైనా సరే ఒక అర్థగంట సినిమా అయిన తర్వాత థియేటర్ కి చేరుకున్నాము. చీకటిగా ఉండడంతో సీట్లు వెతుక్కొని కూర్చోవడం కొంచెం కష్టమైంది మొత్తానికి వెంకీ మామ సినిమా చూడసాగాము ఆలస్యంగా వెళ్లటం వలన కాసేపటికే విశ్రాంతి పడింది లైట్లు వేయడంతో అటుపక్క ఇటుపక్క ఎవరున్నారు ఒక సారి చూసుకున్నా ము మాకు పక్కన ఒక ఆరుగురు కూర్చున్నారు రెండు ఫ్యామిలీలు అనుకుంటా శరీర ఆకారాల్లో తల్లిదండ్రులకి పిల్లలకి పెద్ద తేడా లేదు అందరూ ఒకేలా సుమోల మాదిరిగా ఉన్నారు. మేము కిందికి దిగి మాకు సమోసాలు మా అమ్మాయికి పాప్కార్న్ తీసుకుని వచ్చి మరల కూర్చున్నాం. మా పక్కన కూర్చున్న వాళ్ళు సమోసాలు ,పాప్కార్న్ ,వెజ్ పుఫ్ లు,వెజ్ రోల్ లు ఇలా ఏవేవో తింటూనే ఉన్నారు. సరే సినిమా ముగిసింది. సినిమా హాల్ లో ఫుడ్ కోర్ట్ కి టిఫిన్ చేయడానికి వెళ్ళాం అదేమి చిత్రమో సినిమా హాల్లో మా పక్కన కూర్చున్న వాళ్లే ఫుడ్ కోర్ట్ లో కూడా ఇంచుమించు మా పక్కనే కూర్చున్నారు మా అమ్మాయి నేను ఒకరి మొఖం ఒకరు చూసుకొని నవ్వుకున్నాం . ఏమి తింటారో త్వరగా చెప్పండి మళ్ళి రేపు నాకు ఆఫీస్ ఉంది తొందరగా ఇంటికి వెళ్లాలని మా వారు అనడంతో సమోసాలు తిన్నాం కాబట్టి పెద్దగా ఆకలి లేదు అందుకే ఒక చపాతీ ,ఒక ఉల్లి దోశ ఆర్డర్ ఇచ్చాము అక్కడ ఈ రెండు కొంచెం పెద్ద సైజు లో దొరుకుతాయి అందుకే ముగ్గురికి కలిపి రెండు ఐటమ్స్ ఒకవేళ సరిపోకపోతే లాస్ట్ లో ఇడ్లి ఏదైనా చెప్పుకుందామని మా అమ్మాయి వెళ్లి ఆర్డర్ ఇచ్చి వచ్చింది. అమ్మా! చాలా మంది ఉన్నారు కొంచెం టైం పడుతుంది అని చెప్పి కూర్చుంది. మా అమ్మాయి మా వారు వాళ్ళ సెల్ ఫోన్లు చూసుకుంటున్నారు. నేను నా ఫోన్ ని ఇంటి వద్ద వదిలి పెట్టాను అందుకే చుట్టూ చూస్తూ కూర్చున్నాను సినిమా హాల్ లో మా పక్కన కూర్చున్నారు అని చెప్పాను కదా వాళ్లకి ఐటమ్స్ వస్తూ ఉన్నాయి ఫస్ట్ ఒక పెద్ద పిజ్జాలు రెండు వచ్చాయి, తరువాత ఒక నాలుగు బర్గర్స్ వచ్చాయి మూడు మిల్క్ షేక్ లు, ఒక మూడు కోక్ లు వచ్చాయి మూడు నిమిషాల్లో వాటిని లాగించేశారు ఈలోగా కెఎఫ్ సి చికెన్ ఒక మూడు ప్లేట్లు వచ్చాయి పానీ పూరి లు ఒక మూడు ప్లేట్స్ వచ్చాయి. వాటిని మూడు నిమిషాల్లో తినేశారు వాళ్ల తిండిని చూస్తుంటేనే నా ఆకలి సగం చచ్చిపోయింది మన టిఫిన్ ఇంకా రావట్లేదు ఏంటమ్మా అని మా అమ్మాయిని అడగడంతో సెల్ ఫోన్ ని అతి కష్టం మీద బల్ల మీద పెట్టి కౌంటర్ దగ్గరికి వెళ్ళింది వాళ్లే పంపిస్తాం అన్నారు అమ్మ అంటూ వచ్చి కూర్చుంది మళ్లీ సెల్ లో మునిగిపోయింది నేను మధ్యమధ్యలో పక్కవాళ్ళని చూడమంటూ మా వారికి మా అమ్మాయికి సైగ చేస్తూనే ఉన్నాను. వాళ్ళు చూస్తూ ఆశ్చర్యపోతున్నారు. ఈలోగా వాళ్లకి ఒక మసాలా దోశ వచ్చింది ఫాస్ట్ ఫుడ్స్ మొత్తం అయిపోయినట్లు ఉన్నాయి టిఫిన్ సెక్షన్ లోకి దిగిపోయారు ఈలోగా మా టేబుల్ దగ్గరికి చపాతీ దోస వచ్చాయి నేను తినడం ప్రారంభించాము. అప్పుడు పక్క బెంచ్ లోకి ఎమ్మెల్యే పెసరట్టు వచ్చింది అది చూసి నాకు నీరసం వచ్చింది మా అమ్మాయికి సగం చపాతికే కడుపు నిండిపోయింది వాళ్ల తిండి చూశానని ఏమో నాకు కూడా ఆకలి చచ్చిపోయింది ఒక రకంగా చెప్పాలంటే కడుపులో తిప్పి దేవేస్తున్నట్టు అనిపించింది. మా వారు తనకు ఏం పట్టనట్టుగా తన దోస తినేశారు. ఇక నాకు మా అమ్మాయికి ఆ ఒక్క చపాతీ తినడం అంటే చాలా కష్టం అనిపించింది. మా అమ్మాయిని నేను కోపంగా గా నీ వయసు కి ఒక చపాతీ తినలేవా? వాళ్లని చూడు ఎలా తింటున్నారు నిన్ను వాళ్ళ మధ్యలో కూర్చోబెట్టాలి అని అనడంతో తనకు భయం అనిపించిందో ఏమో మా అమ్మాయి ఏమనుకుందో ఏమో చపాతీనీ గబగబ తినేసింది. ఇంకా అక్కడే ఉంటే ఇంక వాళ్ళ ఏమి తింటారో చూడాల్సి వస్తుంది మేము తిన్నది బయటకు వచ్చేస్తుంది అని భయపడి గబగబా అక్కడినుంచి వచ్చేసాము.

  అసలు ఏం తిండి బాబు! వామ్మో !! ఇలా కూడా తింటారా అనిపించింది పిల్లలు అనుకుంటే తల్లిదండ్రులు కూడా అలాగే తింటున్నారు వాళ్ళ అరుగుదలకు నా జోహార్లు ఒకపక్క అన్నమో రామచంద్రా అని అల్లాడుతుంటే జనాలు వీళ్ళేమో ఫాస్ట్ ఫుడ్డు ప్లేట్ల మీద ప్లేట్లు లాగిస్తూ శరీరాన్ని భారీగా పెంచుకుంటూ నడవలేక కూర్చోలేక ఏమిటో ఆ అవస్థలు ఎందుకు వచ్చిన కష్టాలు చెప్తారా నాకైతే తలుచుకుంటే ఇప్పటికీ అర్థం కావట్లేదు ఒక రకమైన జుగుప్స కలుగుతుంది సరే ఒబిసిటీ సెంటర్లు డాక్టర్లు బతకాలి కదా పాపం హోటళ్ళు కూడా బతకాలి కదా వీళ్ళు ఇలా చేయబట్టే అక్కడ పని చేసే వర్కర్లు సినిమా హాల్ వాళ్ళు ఫుడ్ కోట్లు ఇవన్నీ రాణించాలంటే ఇలాంటి వాళ్ళు ఉండాల్సిందే. మా అమ్మాయి లాంటి కస్టమర్ ఉంటే చాలు వీళ్ళందరూ దీవాల తీస్తారు.అయినా ఇంటర్వెల్లో అన్ని ఐటమ్స్ తిని ఒక గంట అయిందేమో మళ్లీ అంత తిండి అసలు పొట్టలో ప్లేస్ ఎక్కడుంది నాకైతే ఇప్పటికీ తలుచుకుంటే కోపం వస్తుంది. అలా ఎలా తింటారు అటు పక్క వాళ్ళ ఇటు పక్క వాళ్ళు చూస్తున్నారు అని కూడా ఉండదు ఇంటి పెద్దాయన కౌంటర్ దగ్గర నిలబడి పంపిస్తునే ఉన్నాడు వాడు కూడా అక్కడికి వచ్చి కూర్చుంటే ఇంక అతను ఎన్ని తింటాడో!  మేము అక్కడి నుంచి వచ్చేసి బతికిపోయాం అనుకోండి. ఆహారం కొరత, డబ్బు కొరత, ఆర్థికమాంద్యం ఇలాంటివన్నీ వస్తున్నాయంటే వీళ్ళ వల్లే కదూ! రాక చస్తుందా అసలు ఆ తల్లిదండ్రులకి వాళ్ల శరీరం మీద గాని వాళ్ళ పిల్లల ఆరోగ్యం మీద గాని ఒక భయం ఉందా ఒక అవగాహన ఉందంటారా! అది బలం అనుకుంటున్నారా ఒక్కొక్కడి శరీరం ఎలా ఉందో తెలుసా! సుమోలలా ఉన్నారు. కుర్చీలు  సరిపోవడం లేదు థియేటర్లో కూర్చోడానికి. కుర్చీకి బయటికి వచ్చేశారు. మా అమ్మాయి కుర్చీ మీదకి సగం వరకు వచ్చేసింది ఆ పక్కన ఉన్న అమ్మాయి. వామ్మో! మళ్లీ సినిమాకి వెళ్తే అలాంటి వాళ్ళు మా కంట పడకుండా ఉండేలా చూడు భగవంతుడా! నీకు శతకోటి వందనాలు.అయినా "వాళ్ల తిండి వాళ్ల ఇష్టం" మధ్యలో నాకెందుకు లెండి ఉంటానండి మరి.


Rate this content
Log in

Similar telugu story from Comedy