ఉత్తమ గురువు
ఉత్తమ గురువు


ఉత్తమ గురువులు కనుమరుగవుతున్న నేటి కాలంలో విద్యార్థుల పాలిట ఆశా కిరణం మీరు
ఇంజనీరు ఉద్యోగాన్ని వదిలి ఉపాధ్యాయుడిగా స్థిరపడి విద్యా బోధన చేస్తున్న ధన్యులు మీరు
విద్యార్థులకు నచ్చే విధంగా బోధించడంలో సిద్ధహస్తులు మీరు
బహుమతులకు, ప్రలోభాలకు లొంగని నిస్వార్థులు మీరు
నా రచనా ప్రయాణంలో అక్షర తప్పిదాలను సరిదిద్దుతున్న నిత్య గురువు మీరు
గుండెల నిండా ఉత్సాహాన్ని నింపుతూ రుధిరాన్ని ఉరకలు వేయిస్తూ ఉల్లాసాన్ని కలిగించేది గురువు