Praveena Monangi

Inspirational

4  

Praveena Monangi

Inspirational

మనసులో మాట

మనసులో మాట

2 mins
1.2K


మనసులో మాట [మనము చేయలేని పని ]

శ్రావణ మాసపు తొలకరి జల్లులో రేయంతా సరిగంగ స్నానమాడిన పచ్చని చెట్లు పిల్ల గాలితో ఏకమై తమ దేహాన్ని శుద్ది చేసుకుంటున్నాయి. నవ వసంతాన్ని ఆస్వాదిస్తున్న పక్షులు కిలకిల ద్వనులతో ఆకాశములో విహరిస్తున్నాయి.వర్షములో తడిసిన మట్టి వాసన అన్నీ కలగలసి ఆసుందర మనోహరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ నేను,మావారు మా ఇంటి బాల్కనీ లో కూర్చుని వేడివేడి కాఫీ త్రాగుచున్నాము. ఆదివారము అవడము వలన పొద్దున్నే వంట హడావుడి లేనందున ప్రకృతిని ఆస్వాదిస్తూ,కాఫీని సేవిస్తున్నాము.అంతలోనే మావారు పేపరు చదవడము ప్రారంభించారు.నేను కూడా ఎడిషినల్ పేపరు తీసుకుని చూడంగానే మొదటి పేజీలో వార్త.సెల్ ఫోను మాట్లాడుతూ బండి నడుపుతున్న వ్యక్తి,ఎదురుగా వస్తున్న లారీని డీకొట్టడముతో అక్కడికక్కడే మృతి చెందాడు.లారీ డ్రైవరు పరారీ లో ఉన్నాడు.కేసు నమోదు చేసిన సి.ఐ,విచారణ జరిపిస్తామన్నారు.ఆ వార్త చదివిన నాకు,ఆ మధ్యన కొన్ని రోజుల క్రితము రోడ్డు మీద జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది.

ఒక రోజు మావారు ఆఫీసు నుండి వచ్చిన తరువాత కూరగాయలు,పండ్లు తెచ్చుకుందామని ఇద్దరం బజారుకు బండి మీద బయలు దేరాము.బజారులో అన్నీ కొనుక్కుని తిరిగి వస్తున్న మాకు హఠార్తుగా కీచుమని పెద్ద శబ్ధం వినిపించింది. ఏమిటా శబ్ధం అని మావారు బండిని ఆపారు,నేను బండి దిగి ఏమయిఉంటుందా అని గమనించి చూశాను.ఆ ప్రదేశములో రెండు రోడ్లు ఉన్నాయి.ఒక రోడ్డులో ఒక వైపు నుండి ఒక ఆమె నావయసే ఉంటుంది సుమారుగా,తన కొడుకుతో బండి మీద వస్తుంది.అటువైపు రోడ్డు నుండి ఒక వ్యక్తి సెల్ ఫోను మాట్లాడుతూ వస్తున్నాడు.ఇద్దరూ ఒకే మలుపు వైపు తిరుగుతున్నారు.అటువైపు నుండి హఠార్తుగా ఏ ఇండికేటరు వేయకున్నావస్తున్న వ్యక్తి ని చూసి ఈమె కంగారుగా చెప్పాలంటే ఎంతో ఒడుపుగా బండిని ఆపింది.ఆలాచేయడము వలన రెండు బళ్ళు ఒకేసారి హఠార్తుగా ఆగడముతో ఆ శబ్దం వచ్చింది.అయితే ఒకటి ప్రమాదము తృటిలో తప్పింది.ఈ హఠాత్ పరిణామానికి ఆమె వెంటనే బండి దిగి ఒక పక్కగా బండిని పెట్టి,ఏమీ పట్టనట్లుగా తన తప్పేమీ లేదన్నట్లుగా చూస్తున్న ఆ వ్యక్తిని ఆపి ఇలా నిలదీసింది “ఏమిటండీ మీరు చూసుకుని డ్రైవ్ చేయలేరా?మలుపు తిరిగేటపుడు ఇండికేటరు వేయాలని మీకు తెలియదా! బండి నడుపుతున్నపుడు సెల్ ఫోన్ మాట్లాడకూడదని తెలియదా?నేను అప్రమత్తముగా ఉన్నాను కాబట్టి ఏ ప్రమాదము జరుగలేదు.లేదంటే ఏమవుతుంది.అయిన సెల్ లో మాట్లాడాలనుకునేటప్పుడు బండిని ఒక పక్కగా ఆపి మాట్లాడాలని తెలియదా’’?అని చేడా మాడా కడిగేసింది.అంతటితో ఆమె ఊరుకుందనుకుంటున్నారా!ఆయన చేతిలోనుండి సెల్ తీసుకుని “ఇంత అర్జంటుగా ఎవరితో మాట్లాడుతున్నారు’’ అని అడిగింది.ఆమె ప్రశ్నలకి బిత్తర పోయిన ఆ వ్యక్తి నా భార్య తో అని సమాధానమిచ్చాడు.ఆమె వెంటనే ఫోన్ అందుకుని “చూడండి భార్యామణి గారు!మీరు మాట్లాడుతున్నపుడు మీవారు బండి నడుపున్నారని మీకు తెలియదా ?ఒక ప్రక్కగా బండిని ఆపి మాట్లాడమని చెప్పలేరా ?మీరు చెప్పే విషయము ముక్యమైనదే అవ్వవచ్చు,కానీ దాని వలన మీ భర్త ప్రాణాలకే ముప్పువాటిల్లుతుందని మీకు తెలియదా!అంటూ రోడ్డుమీద జరిగిన మొత్తము ఆమెకు వివరించింది.సెల్ ఫోన్ ఉన్నది అవసరానికి వాడుకోవడానికి, ఇలా అతిగా వాడమని కాదు,అని చెప్పి ఫోనుని ఆ వ్యక్తి చేతిలో పెట్టి,తన బండిని స్టార్ట్ చేయబోతున్న ఆమెతో ,ఆ వ్యక్తి [ఫోనులో తన భార్య ఏమి చెప్పిందో తెలియదు గానీ ]నన్ను క్షమించండి సిస్టర్ అని మొరపెట్టుకున్నాడు.ఇంకా ట్రాఫిక్ పోలీసు తను చేయవలసిన పని ఆమె చేసిందని సిగ్గుతో తల దించుకున్నాడు.ఇంకా అవాక్కవ్వడము మా వంతయ్యింది.

శ్రీమతి గారు అన్న మావారి పిలుపుతో జ్ఞాపకాల నుండి వర్తమానములోకి వచ్చాను.

సెల్ ఫోన్ లో మాట్లాడుతూ వాహనాలని నడిపే వాళ్ళ ని రోజూ మనము చూస్తూ ఉంటాము.కానీ మనము ఏమీ చేయలేక వదిలేస్తున్నాము.ఇలాంటి వాళ్ళ వలన ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు.కానీ ఎవరూ పట్టించుకోవడము లేదు.జారీమానా విడించబడును అనే సూక్తి గోడలకే పరిమితమైపోయింది.సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడిపే వ్యక్తులతో ఆమె స్పందించినట్లుగా ప్రతీ ఒక్కరూ స్పందిస్తే ఎంత బాగుంటుంది.ఒక్కోసారి మన మనసులోని మాట ఎవరి నోటయిన విన్నపుడు, మనము చేయలేని పని ఎవరయినా చేసి చూపించినపుడు భలే ఉంటుంది కదూ!.........


Rate this content
Log in

Similar telugu story from Inspirational