kondapalli uday Kiran

Abstract Inspirational Children

4  

kondapalli uday Kiran

Abstract Inspirational Children

ఉపాయం

ఉపాయం

1 min
347



ఒక మూలిపాడు అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో సుబ్బమ్మ, సీతయ్య, ఇంకా వాళ్ల కూతురు నవ్య కూడా ఉండేది.వాళ్ల ఇంటి పక్కనే ఒక పెద్ద వేపచెట్టు ఉండేది. ఆ గ్రామంలో ఎక్కడ చెట్లు లేవు. సీతయ్య వాళ్ళ ఇంటి దగ్గర తప్ప. నవ్య కు ఆ వేప చెట్టు అంటే చాలా ఇష్టం.చిన్నప్పటి నుండి ఆ వేపచెట్టు దగ్గరే ఆడుతూ,పాడుతూ చెట్టు కొమ్మకు ఉయ్యాల కట్టి ఊగుతూ ఉండేది. తనకు జ్వరం వచ్చిన దెబ్బతగిలినా ఆ వేప చెట్టు కషాయం తాగితే చాలు తగ్గిపోయేది. ఒక నాడు తుఫాను వచ్చి చెట్టు పడిపోయింది. ఇంకా ఇంటి కప్పులు కూడా పడిపోయాయి.నవ్య బోరున ఏడ్చింది.ప్రజలకు

ఏం చేయాలో తెలియక బాధతో కూర్చున్నారు.అప్పుడే నవ్య వచ్చి రండి మా ఇంటి దగ్గర ఉన్న వేప చెట్టు కొమ్మలను విరిచి మీ ఇంటి కప్పును బాగు చేసుకోండి అని చెప్పింది. దాంతో ప్రజలందరూ ఆనందపడ్డారు. నవ్య ఒక ఉపాయం ఆలోచించింది.

అది ఏంటంటే ఊర్లో ప్రజలందరినీ ఒక దగ్గర చేర్చి ఇలా అన్నది మన ఊరిలో కొన్ని వేప చెట్లు, మామిడి చెట్లు , కూరగాయలు చెట్లు ,ఇంకా ఎన్నో వేరు వేరు చెట్లు నాటుదాం.అవి పెరిగి మనకు ఏ ఇబ్బంది కలగకుండా, మంచి ఫలాన్నిస్తూ , స్వచ్ఛమైన గాలినిస్తూ, మనల్ని కాపాడుతుంది. నవ్య చెప్పిన మాటలకు ప్రజలందరు సరే అని కొన్ని వందల చెట్లు నాటారు. కొన్ని నెలలు గడిచాయి ఊరంతా పచ్చగా మారిపోయింది. దాంతో ఆ ఊర్లోనే ఒక కూరగాయల కొట్టు ప్రారంభించారు. వేరే ఊరు ప్రజలు కూడా అక్కడ నుంచే కూరగాయలు కొని తీసుకెళ్తున్నారు. అప్పుడు ఊరికి ఆదాయం వస్తుంది ఏ ఆపద వచ్చినా అందరూ కలిసిమెలిసి ఉంటారు.

చూశారా నవ్య ఇచ్చిన ఉపాయంతో ఆ ఊరు బాగోతం మారిపోయింది.


ప్రకృతి వనరులు, దేవుడిచ్చిన వరాలు.




Rate this content
Log in

Similar telugu story from Abstract