kondapalli uday Kiran

Abstract Inspirational Children

4  

kondapalli uday Kiran

Abstract Inspirational Children

తల్లి విలువ!

తల్లి విలువ!

1 min
365



ఒక ఊరిలో శివ ,నరసమ్మ ,

ఉండేవారు. నరసమ్మ వేరే వాళ్ళ ఇంట్లో చాకిరీ పనులు చేసి ఇల్లు నడిపించేది. శివ మాత్రం ఏ పని చేయకుండా గాలికి తిరుగుతూ అమ్మ మాట వినేవాడు కాదు. ఒక నాడు శివ ఇంట్లో ఉన్న డబ్బంతా తీసుకొని వాడి జల్సాల కోసం డబ్బు అంతా ఖర్చు చేశాడు. సాయంత్రం అయింది శివ ఇంటికి వచ్చాడు. వాళ్ళ అమ్మ అడిగింది .ఏరా శివ ఇక్కడ డబ్బులు పెట్టాను కదా నువ్వేమైనా తీసావా. లేదమ్మా నేను తీయలేదు. నిజం చెప్పు రా అని వాళ్ళ అమ్మ గట్టిగా అరిచింది. అమ్మ నేనే తీసాను. ఎంత పనిచేశావురా! వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఎందుకురా తీసావు ఆ డబ్బు లు నేను నా మందులకోసం ఉంచుకున్నాను రా.ఆ డబ్బు నేను రేయింబవళ్లు కష్టపడితే గానీ రాలేదు. మన జీవితాలు రెక్కాడితే గాని డొక్క నిండని బతుకులు రా మనవి. ఆ బాధతో వాళ్ళ అమ్మ రాత్రంతా నిద్రపోలేదు. పొద్దున్నే అవ్వగానే శివ వాళ్ళ అమ్మని లేపడానికి ప్రయత్నించాడు. వాళ్ళ అమ్మ లేవలేదు. అప్పటికే వాళ్ళ అమ్మ చనిపోయింది. వాళ్ళ అమ్మకు క్యాన్సర్ ఆ విషయం శివకు తెలియదు. దాంతో శివ భోరున ఏడ్చాడు. ఇంకేం లాభం ఎంత ఏడ్చినా వాళ్ళ అమ్మ మాత్రం తిరిగి రాదు కదా. శివ అనుకున్నాడు నా జల్సాల కోసం డబ్బంతా ఖర్చు చేశాను. అదే డబ్బు గాని ఉంటే ఈ పాటికి అమ్మ నాతో ఉండేది కదా.

శివకు కు దాంతో అమ్మ విలువ ఏంటో తెలిసింది.


 తల్లిదండ్రుల విలువ ఉన్నప్పుడు తెలియదు, వాళ్ళు లేనప్పుడు తెలుస్తుంది.



Rate this content
Log in

Similar telugu story from Abstract