Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

తెలుగు తెరియుమా

తెలుగు తెరియుమా

1 min
277


వినయ్! కాలేజ్ కి వెళ్ళవా? వినయ్ ని వాళ్ళ అమ్మ నిద్ర లేపింది. వినయ్ తమిళ్ లో ఏదో చెప్పేసరికి తల మీద మొట్టికాయ వేసింది.


కాలేజీకి వెళ్ళరా అని నిద్ర లేపితే తమిళ్ సినిమా డైలాగులు చెబుతున్నాడు అని రెడీ అవ్వమని చెప్పి వంట గదిలోకి వెళ్ళింది.


బయట హాల్లో వినయ్ వాళ్ళ బామ్మ తమిళ్ డబ్బింగ్ సీరియల్ ఒకటి చూస్తోంది.


పాటీ! తమిళ్ తెరీయుమా అన్నాడు వినయ్. తెరియుమా ఏంట్రా మిరియం లాగా..ఏం తెరవాలి అంది.


వినయ్ బుర్ర గోక్కున్నాడు. తనకి వాళ్ళు మాట్లాడేది అర్థం కావట్లేదు. తమిళం ఇంట్లో వాళ్ళకి అర్థం కావట్లేదు.


బహుశా తమిళ్ సినిమాలు, సీరియళ్లు ఫీల్ కోసం అదే భాషలో ఎక్కువగా చూసి తెలుగు మర్చిపోయానా అనే అనుమానం వచ్చింది అతడికి.


ఇక శంకరాభరణం , సాగర సంగమం చూడాల్సిందే అనుకున్నాడు..


Rate this content
Log in

Similar telugu story from Abstract