Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

స్వేచ్ఛ

స్వేచ్ఛ

1 min
546


డబ్బులు లేవని చెప్పాల్సిన అబద్ధాల నుంచి.. సేవింగ్స్ చేసుకోలేని పరిస్థితుల నుంచి... అతిగా నమ్మే అలవాట్ల నుంచి నాకు స్వేచ్ఛ కావాలి.


అదేంట్రా. నువ్వే సమస్యలు క్రియేట్ చేసుకుని ఇప్పుడు స్వేచ్ఛ లేదు అంటూ వ్యాసాలు వ్రాస్తున్నావు అన్నాడు శంకర్.


ప్రదీప్ తల ఎత్తి చూశాడు. డైరీ వ్రాస్తున్నానురా. ఎంత జీతం వచ్చినా సరిపోవట్లేదు. ఎవరు డబ్బులు అడిగినా కాదనలేక ఇవ్వడం. వాళ్ళు నాకు తిరిగి ఇవ్వకపోయినా అడగలేకపోవడం. ఇదే నడుస్తోంది ప్రతి నెలా.

ప్రదీప్ మాటల్లో ఏదో నిస్సహాయత ధ్వనిస్తోంది. 


చీటీ అన్నా వేసుకోక పోయావూ. అసలు నీకు జీతం రాగానే ఖర్చులకు కావలసినంత డబ్బు పక్కన పెట్టుకుని, మిగతాది చీటీ కట్టడమో, ఇంకేదైనా ఇన్వెస్ట్ చేయడమో ప్రయత్నించి చూడు.


అప్పుడు నీ దగ్గరే డబ్బులు ఎక్కువ ఉండవు. ఇక వేరే వాళ్ళకి లేదని అబద్ధం చెప్పినట్లు అవదు. నీకున్న డబ్బుతో స్వేచ్ఛ కూడా ఉన్నట్లే కదా అని సలహా ఇచ్చాడు శంకరం.


ప్రదీప్ సరేనన్నట్టు తల ఊపాడు.


Rate this content
Log in

Similar telugu story from Abstract