kondapalli uday Kiran

Abstract Inspirational Children

4  

kondapalli uday Kiran

Abstract Inspirational Children

సమయం యొక్క విలువ.

సమయం యొక్క విలువ.

1 min
387



ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారి పేరు శివ, రవి. వాళ్ళిద్దరూ పదో తరగతి చదువుతున్నారు. శివ మాత్రం ఎప్పటికప్పుడే చెప్పేవన్నీ చదివేవాడు. రవి మాత్రం చదువుదాం లే... సమయం చాలా ఉంది కదా అని చదువు ని పక్కన పెట్టి చిన్న చిన్న వాటికి సమయాన్ని కేటాయించేవాడు. కొన్ని రోజులు అయ్యాయి. ఇంకా పరీక్షకు ఒక్కరోజే మిగిలుంది. శివ మాత్రం చదివినా వన్నీ ఇంకొకసారి చదువుతున్నాడు. రవి మాత్రం అరే... పరీక్షకు ఒక్కరోజే ఉంది ఎలాగైనా రాత్రంతా చదవాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఒక్క ముక్క కూడా బుర్రకెక్కక లేదు. పరీక్షకు సమయం అయింది.ఇద్దరు పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష రాసి బయటకు వచ్చారు. శివ మాత్రం ఆనందంగా ఉన్నాడు రవి మాత్రం చాలా బాధ తో బయటకు వచ్చాడు. అరే ఏమైంది రా రవి! అరే శివ నేను పరీక్ష సరిగ్గా రాయలేదు రా. నేను నీకు ముందే చెప్పాను సమయాన్ని వృధా చేయకు మళ్లీ తిరిగి రాదు, సమయం అనేది చాలా ముఖ్యమైనది జీవితానికి మరియు మనిషికి కూడా ఇప్పటికైనా మిగతా పరీక్షలన్ని మంచిగా చదివి సరిగ్గా రాయడానికి ప్రయత్నించు. సరే రా శివ.నీ వల్లనే నాకు సమయం యొక్క విలువ ఏంటో తెలిసిందిరా. ఇంకెప్పుడూ నేను వేరే పనులకు సమయాన్ని కేటాయించాను.


Rate this content
Log in

Similar telugu story from Abstract