Dinakar Reddy

Abstract Drama

3  

Dinakar Reddy

Abstract Drama

స్కూలు పిల్లలు

స్కూలు పిల్లలు

1 min
201


ఇవాళ మూవీ నైట్ కదా. ఏ సినిమా చూద్దాం అన్నాడు రాజీవ్ తన ఫ్రెండ్స్ తో. 

పార్కులో దూరం నుంచి ఆ పిల్లల గుంపును చూస్తున్న రఘు ఇలా అన్నాడు. ఏడో క్లాసు చదివే ఈ పిల్లలు హోమ్ వర్క్ చేయాలి అని చెప్పి స్నేహితుల్లో ఎవరో ఒకరి ఇంట్లో కలుస్తారు. ల్యాప్టాప్ లో వారానికో సినిమా చూస్తారు అని మరో యోగాసనం వేసాడు.


ముప్పై ఏళ్ళు వచ్చినా ఇంకా పిల్లల మీద కుళ్లుకోవడం మానడం లేదు అన్నాడు అతని ఫ్రెండ్ శివ. 

కుళ్లుకోవడం కాదురా. వాళ్ళు ఏం చూస్తున్నారో , వయసుకు తగ్గ పనులు చేయకుండా ఎలా తయారవుతున్నారో తెలుసా నీకు.


ప్రోగ్రెస్ రిపోర్టులో ఉన్న మార్కుల గురించి చూసే అమ్మా నాన్నలు తమ పిల్లలు ఇంటర్నెట్లో ఎలాంటి కంటెంట్ చూస్తున్నారో తెలుసుకోవద్దా. ఒకడేమో పిల్లల ముందే బూతులు మాట్లాడుతాడు. ఇంకొకడు బూతులు మాట్లాడటం సహజం అంటాడు. చిన్న పిల్లలకి ఏం తెలుస్తుంది. వాడెవడో సిగరెట్ తాగడం స్టైల్ అంటే వీళ్ళూ అదే పని చేస్తారు. ఆ చెప్పినోడికి కంట్రోల్ ఉంటుంది అనుకున్నా అందరికీ అదే తెలివి ఉండదు కదా.


మనం చిన్నప్పుడు ఆదివారం పంచతంత్ర కథలు చూస్తే గొప్ప. ఇప్పటి పిల్లల ఆలోచనలను చూస్తే భయమేస్తుంది అన్నాడు రఘు. 

మరీ ఇంతలా ఆలోచిస్తే కష్టమే అన్నాడు శివ. పిల్లలప్పటికే వెళ్ళిపోయారు.


Rate this content
Log in

Similar telugu story from Abstract