శుభలగ్నం
శుభలగ్నం
సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, ఆకాశము, భూమి,
పగలు, సంధ్యలు, రాత్రి, నాలుగు దిక్కులు,నడిచే కాలము.
అన్ని అన్ని తనని నేను కలిసే "శుభలగ్నం" ఎప్పుడని ఎదురు చూస్తున్నాయి.
కదిలే కాలానికి కన్ను కుట్టిందేమో...
తనది తప్పా అంటే కాదేమో...
నాది తప్పా అంటే కాదేమో...
నాది ఆకాశమంత ప్రేమ అనుకుంటాను...
తనది అవధులు దాటిన ప్రేమ ఏమో...
అయినా విధి ఆడిన వింత నాటకంలో బలి అయ్యాము.
కానీ...
తనని వదిలి వచ్చినా...
అనుక్షణం తన ఊసు నాతోనే ఉంది.
వదలలేని జ్ఞాపకాలను పట్టుకుని...
మనసు మాట విననంటుంది.
మౌనమై ఉన్న మది కదలికలు వద్దంటే నిశ్చలంగా ఉండలేని ఊసులన్నీ విశ్వ భ్రమరమై ఊరేగుతున్నాయి.
మనసు వద్దంటే తన తలపులతో తటాకమై తలుపులు తెరిచి చూస్తుంది.
తాము కలిసే శుభతరుణం ఎప్పుడని పంచభూతాలతో పాటు, కదిలే కాలాన్ని అడుగుతుంది.
ఎప్పుడు ఆ శుభలగ్న ముహూర్తం అని మది పదే పదే కలవరిస్తుంది.
