సహజీవనం - పెళ్లి
సహజీవనం - పెళ్లి
సహజీవనం ఒక పెళ్ళి లాంటిదే. ఎటొచ్చీ పెళ్ళీలో ఉండే సంతానం ఉండకపోవచ్చు. కాని మిగతా బంధాలు పెళ్ళి బంధం అంత చికాకు పెట్టేవే. సహజీవనం చేస్తున్నప్పుడు ఏక స్త్రీ/ఏక పురుష వ్రతం అవలంబించపోతే ఆ పెళ్ళి, సారీ, సహజీవనం పెటాకులవుతుంది.
ఇంకా ఈ మధ్యన ముంబాయిలో ఒకావిడ సహజీవనం చేసినందుకు భర్త, సారీ, మొగుడు, సారీ, సఖుడి ఆస్తిలో వాటా అడుగుతూ కోర్టుకెక్కింది. ఇంకో ఆవిడ భరణం అడిగింది. వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ సంపాదించుకుంటున్న వారే.
పెళ్లి ముఖ్యంగా ఆర్ధిక బంధం. సహజీవనం కూడా అలాగే పరిణమిస్తోంది. సాంఘిక జీవనంలో పెళ్లి రెండు కుటుంబాల మధ్య జరిగేది. ఇప్పుడు అది ఇద్దరు వ్యక్తులకు పరిమితమై పోయింది. అంచేత సహజీవనానికి, పెళ్ళికి తేడా కనిపించడం లేదు.
సంతానాన్ని పెంచడం, ముసలి అత్తమామలను చూసుకోవడం, సహజీవనంలో భ
ాగం కావు. ఇవి ఇప్పుడు పెళ్ళిలోనూ భాగంగా లేవు. అంచేత కూడా సహజీవనానికి, పెళ్ళికి తేడా తెలియడం లేదు.
సహజీవనంలో బాధ్యత, బంధం లేవు. అనురాగము, ఆప్యాయత కూడా లేవు. ఏదో కాలక్షేపంలా తయారయింది. పెళ్ళీ అలాగే ఉంది. అందుకనే పెళ్ళి కన్న సహజీవనం వైపు
మొగ్గు చూపిస్తున్నారు, యువతీయువకులు.
సహజీవనంలో పెద్దలు వారితో కలిసి ఉండడం
ఉండదు. ఇప్పుడు పెళ్ళిలోనూ అంతే. అత్తమామలు కూడా ఉంటారంటే ఆ పెళ్లి జరగడానికి పెళ్లి కూతురు, ఆమె తల్లీ ససేమిరా అంటున్నారు. అసలు ఆ ఒక్క కారణం వల్లే పెళ్ళిళ్ళు ఆగిపోతున్నాయి, లేదా జరిగిన పెళ్ళిళ్ళు పెటాకులవుతున్నాయి.
సహజీవనంపై మోజు పెళ్ళిని దెబ్బ కొట్టక పోయినా, పెళ్ళిని సహజీవనంలా మార్చేసింది. మొగుడు, పెళ్ళాం, పెళ్ళి ఆసక్తి లేని విషయాలయ్యాయి. సహచరి, సహచరుడు, సహజీవనం ఆకర్షణీయమయ్యాయి.