Suvarna Marella

Comedy Drama

5.0  

Suvarna Marella

Comedy Drama

"పరంధామయ్య పెళ్లి యాత్ర"

"పరంధామయ్య పెళ్లి యాత్ర"

9 mins
644


    చక్కగా పీట మీద కూర్చుని ఎదురు గా ఉన్న అరటి ఆకు లో చారు అన్నం జుర్రుతున్నాడు పరంధామయ్య .ఒక పక్క ఎర్రటి ఆవకాయ అప్పుడప్పుడు నాలికకు తగిలిస్తూ ....

" ఏరా లింగడు చారులో అంత ఎక్కువ ఇంగువ వెయ్యకూడదు రా అని ఎన్ని సార్లు చెప్పినా నీ బుర్రకి అర్థం కాదు. ఏమిటో చారు రుచి నా ఇంటి ఇల్లాలు చారులత తోనే పోయింది ."

అని నిట్టూరుస్తూ మిగిలిన అన్నం లో కాస్తంత గడ్డ పెరుగు వేసుకుని సుతారం గా కలుపు కుంటున్నాడు పరంధామయ్య.

అన్నట్టు పరంధామయ్య ఎవరో చెప్పలేదు కదూ!రైల్వే లో 35 సంవత్సరాలు పని చేసి. పచ్చటి అరిటాకు నీ,ఎర్రని ఆవకాయని వదల్లేక రిటైర్ అయిన తరువాత శుద్ధ పల్లెటూరు అయిన తన స్వగ్రామం నీ కే వచ్చి స్థిరపడ్డాడు. అన్నింటా అనుకూలం గా ఉండే తన సహసహా ధర్మచారిని చారులత అతని దురదృష్టం కొద్ది కాలం చేసింది .పది సంవత్సరాల నుండి ఒంటి కాయి శొంఠి కొమ్ము లా ఆ లింగడు చేసే వంట తింటూ కాలక్షేపం చేస్తున్నాడు. పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డారు. అమ్మా బతికుండగా సంవత్సరానికి ఒకసారైనా వచ్చే పిల్లలు ,ఇప్పుడు నాలుగు సవత్సరాల్కి ఒకసారి వచ్చి నాన్నని చూసి పోతారు .భార్య పోవడం వళ్లో స్వతహాగా అంత కలివిడిగా ఉండే మనిషి కాకపోవడం వల్లో గాని ఈ పదేళ్ల నుండి ఏ పెళ్ళి ,పేరంటం కి గాని అటెండ్ అవ్వలేదు.

ఇంటి ముందు కార్ వచ్చి ఆగడం తో పరంధామయ్య అటు చూసాడు. ఎవరు వచ్చారా అని అనుకుంటుండగా .చిన్నాన్న !చూడు వరాలు వదిన ,వాళ్ళ ఆయన వచ్చారు అంటూ వాళ్ళని లోపలికి తీసుకు వచ్చాడు విశ్వం .ఆ ఊరి "వీ ఇ ఓ "గా పనిచేస్తూ అక్కడే పక్క ఇంట్లో ఉండే తన అన్న కొడుకు విశ్యం మే తనకి ఆలంబన,ఆసరా.

" ఏమే వరాలు ఎలా ఉన్నావు అంతా కులాసాన"అని విప్పారిన వదనం తో అడిగి గబగబా చెయ్యి కడుగుకొని ప్రేమ గా దగ్గర కు తీసుకున్నాడు పరంధామయ్య ,తన అక్క కూతురు అయిన వరాలని.

మావయ్య !మా చిన్న వాడికి పెళ్ళి కుదిరింది. నువ్వు తప్పకుండా రావాలి .విశ్వం కి చెప్పాను వాడు వచ్చేటప్పుడు నీకు కూడా టికెట్ బుక్ చెయ్యమని. నువ్వు తప్పకుండా రావాలి అని చెపుతూ భర్త వైపు చూసింది .

వెంటనే అతను కూడా "బాబాయ్ గారు మీరు తప్పకుండా రావాలి. ఐదు రోజుల పెళ్ళి ప్లాన్ చేస్తున్నాం. మన బంధువులు అందరూ వస్తున్నారు మీరే మా పెద్దదిక్కు తప్పకుండా రావాలి." అని చెప్పాడు.

ఐదు రోజుల పెళ్ళి అనగానే పరంధామయ్య కి కళ్ళు మెరిసాయి. కొంచం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే

"అప్పుడు పరంధామయ్య కి పదకొండు ఏళ్లు ఉంటాయేమో పెద్ద అక్క పెళ్లి ధూం ధాం గా జరిగింది ఐదు రోజులు.ఆ వయసు మహత్యమో ఏమో కానీ ఎలా అయిన తన పెళ్లి కూడా ఐదు రోజులు చేసుకోవాలని గట్టిగా నిర్ణయించు కున్నడు."

పరంధామయ్య కి పెళ్లి వయసు రానే వచ్చింది. చారులత తో పెళ్ళి నిశ్చయం అయ్యింది. మెల్లగా తన కోరిక తన తండ్రి కి,కాబోయే మామగారికి చెప్పనే చెప్పాడు."అయ్యో ఈ రోజుల్లో ఎవరు ఐదు రోజుల పెళ్ళి చేసుకుంటున్నారు బాబు. అయినా అంత ఖర్చు ఎందుకు ఎవరు తిన్నది.ఆ డబ్బెదో నీ పేరున ,అమ్మాయి పేరున బ్యాంక్ లో వేస్తాను భవిష్యత్తులో ఉపయోగ పడుతుంది ".అని మావగారు చెప్పగానే అతని తండ్రి కూడా తందాన అంటూ ఇద్దరు పరంధామయ్య నీ ఒప్పించారు.

చేసేదేమీ లేక తన ఐదు రోజుల పెళ్ళి కల నీ తుంగలో తొక్కి ఒక రోజు లోనే చారులత మెల్లో తాళి కట్టి తన జీవితం లోకి తీసుకు వచ్చాడు.ఆ తరువాత దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. కానీ మళ్ళీ ఇప్పడు ఐదు రోజుల పెళ్ళి గురించి వింటున్నాడు.

అంత సేపు మౌనంగా ,ఆలోచనలో ఉన్న మావయ్య నీ చూసి రాను అంటాడు అనుకుందేమో వరాలు

"మావయ్య నువ్వు రానంటే నేను ఒప్పుకోను .అమ్మా కూడా పోయింది నా పుట్టింటి వైపునుంచి నాకు ఉన్నది నువ్వు ఒక్కడివే ."అని కల్ల నీళ్ళు పెట్టుకుంది .

మేనకోడలు కంట తడి కరిగించిందో, ఐదు రోజుల పెళ్ళి ఊరించిందో తెలీదు కానీ పరంధామయ్య రావడానికి ఒప్పుకున్నాడు. కాసేపు ఏవో పిచ్చాపాటీ మాట్లాడి వాళ్ళు మరలా వెళ్లిపోయారు.

పెళ్లికి వెళ్లాల్సిన రోజు రానే వచ్చింది. టిక్కెట్ గోవా కి ఉండడం తో

"అదేమిటి రా విశ్వం పెళ్ళి హైదరాబాద్ లో కాదా?గోవా కి టికెట్ చేయించావు పెళ్లి కూతురు వాళ్ళది గోవా న ఏమిటి "

అని అడిగాడు పరంధామయ్య .

అదేమీ కాదు చిన్నాన్న ,వాళ్ళది డెస్టినేషన్ పెళ్ళిట. ఇరు వైపుల కుటుంబాలు ఏదో ఒక ఊరికి వెళ్లి అక్కడ పెళ్ళి చేస్తారంట . ఇప్పుడు ఈ ట్రెండ్ బాగా నడుస్తోంది లే. వీళ్ళు గోవా లోచేస్తున్నరు అన్నమాట అది సంగతి అన్నాడు విశ్వం.

సరేలే ఎక్కడ అయితేనేమి టి వెల్లేఉద్దేసం ఉన్నప్పుడు అనుకున్నాడు పరంధామయ్య.

ప్రయాణం ముగుంచుకుని గోవా చేరేసరికి సాయంత్రం ఐదు గంటలు కావస్తోంది. స్టేషన్ బయటకు రాగానే వరాలు పంపించిన కార్ వచ్చింది. అందులో పరంధామయ్య మరియు విశ్వం కుటుంబం నీ ఎక్కించి ఆరు గంటలు అయ్యేసరికి నిర్మానుష్యం గా ఉన్న గేట్ లోంచి కార్ ముందుకు పోనిచ్చాడు డ్రైవర్ .అసలే ఊరు కాని ఊరు పైగా మెల్లగా చీకట్లు మసురుతున్నాయి ఏమో పరంధామయ్య కి గాబరా మొదలయ్యింది. పెళ్ళి సందడి ఏమి కనిపించట్లేదు.

"ఒరేయ్ విశ్వం మనం కరెక్ట్ అడ్రెస్స్ కే వచ్చామా ఒక సారి వరాలకు ఫోన్ చేసి కనుక్కో ".అన్నాడు.

లేదు చిన్నాన్న పెళ్ళి కార్డ్ లో ఈ అడ్రెస్స్ నే ఉంది. అదిగో వారాల ఒదిన అని విశ్వం చెప్పెలోపలే కార్ ఆపాడు డ్రైవర్. పరంధామయ్య కార్ దిగుదాము అనుకునే లోపునే రూం కెళ్ళి ఫ్రెష్ అవ్వండి మావయ్య మేము కాసేపట్లో వచ్చి కలుస్తాము అని చెప్పి కార్ రూం నెంబర్ 602,603 కి తీసుకెల్లు అని డ్రైవర్ కి చెప్ప్పింది వరాలు.

కార్ మళ్లీ బయలు దేరింది చుట్టూ పెద్ద పెద్ద చెట్లు రోడ్డు కి ఇరువైపులా బారులు తీరి ఉన్నాయి. చక్కని పూల మొక్కలు చాలా అందం గా ఎదురు అవుతున్నాయి. నందన వన్ రిసార్ట్ నిజంగా పేరుకు తగ్గట్టుగా ఉంది అనుకున్నాడు పరంధామయ్య.ఈ లోగా విద్యుత్ దీపాల కాంతులతో పెద్ద భవంతి కనిపించింది. ఓహో అదే కాబోసు కళ్యాణ మండపం అనుకున్నారు వాళ్ళు అంతా. అలా అర కిలో మీటర్ ప్రయాణం చేసేటప్పటికి పెద్ద భవంతి వద్ద డ్రైవర్ కార్ ఆపి వాల్లని వాళ్ళ రూమ్ కి పంపించి వెళ్లి పోయాడు.

కాసేపు తరువాత వరాలు వాళ్ళ ఆయన వాళ్ళని పలకరించడానికి వచ్చారు. మావయ్య ఈ రూమ్ లో మీరు రెస్ట్ తీసుకోండి .ఏమయినా కావాలంటే ఈ నంబర్ కి ఫోన్ చెయ్యి విశ్వం , మరేమో ఇది మెను కార్డ్ మీకేమి కావాలో మొహమాట పడకుండా తెప్పించుకుని తినండి. మావయ్య ఏమి కావాలన్న మొహమాట పడకు,ఏదయినా ఇబ్బంది అయితే విశ్వం కి ఇచ్చాను నంబర్ కాల్ చెయ్యి అని చెప్పింది.

అయ్యో ఎందుకు అమ్మా , పంతి లోనే తింటాములే,మళ్లీ ఈ తెప్పించు కోవడాలు ఆవి ఎందుకు అన్నాడు పరంధామయ్య కాస్త మొహమాటం తో. దానికి వరాలు అదేమీ లేదు మావయ్య రేపు ఫంక్షన్ స్టార్ట్ కదా ఈ రోజు అందరూ గెస్ట్స్ రిసీవ్ చేసుకుని రూమ్స్ ఇవ్వటమే. రేపటి నంచి అందరం గేదర్ అవుతాము అని చెప్పి వెళ్ళిపోవడానికి సిద్ధం గా ఉన్నారు.

పరంధామయ్య ఆ సమాధానానికి ఒకింత ఆశ్చర్యం పొంది తేరుకుని రేపు ఏమిటి కార్యక్రమం ఎన్ని గంటలకు ముహూర్తం అని అడిగాడు.

దానికి వరాలు వాళ్ళ ఆయన రేపు హల్ది ఫంక్షన్ అంటే పెళ్ళి కొడుకుని చెయ్యడం అణమాట. ఫోటో గ్రాఫర్ 8:00 కి అయితే పిక్స్ బాగా వస్తాయి అన్నాడు. షార్ప్ 8:00 మొదలు పెట్టేస్తామ బాబాయ్ గారు మీరు పెద్ద వారు ఆ టైమ్ కు వచ్చెయ్యండి తప్పకుండ అని చెప్పి ఇద్దరు వెళ్లి పోయారు.

పరంధామయ్య తనకు కావలసినవి తెప్పించికుకుని తిని హాయిగా బెడ్ మీద పడుకుని ఇలా అలోచించు కో సాగాడు. ఇంట్లో పెళ్లి అయితే ముసిలి వాళ్లకి ,మన్నన

ఇవ్వగలిగిన వాళ్లకి,చంటి పిల్లలకు తప్ప పడుకునెందుకు చోటు ఉండేది కాదు. ఒక వేళ ఉన్నా పనులు ల లో సతమతం అవుతూ పడుకునే తీరికే ఉండేది కాదు,పోని ఎప్పుడయినా ఖాళీ అయిన సరదాగా తోటి వాళ్ళ తో ఆటలు పాటలు ఆడుకునే సరికి తెల్లారి పోయేది. ఇప్పుడు చూడు ఎవరికీ వారే సౌకర్యవంతమైన జీవితానికి అలవాటు పడ్డారు. అందుకే కనీసం పక్క గదిలో ఎవరున్నారో తెలుసు కోవలనుకోడం లేదు నా తో సహితం గా .ఇలా ఆలోచిస్తూ వుండగానే నిద్ర పట్టేసింది అతనికి.

ఉదయం 8:00 గంటలకి హడావిడి పాడుతూ వరాలు చెప్పిన స్థలం కి చేరుకున్నాడు పరంధామయ్య. పచ్చటి పందిరి మాత్రమే కాదు, అక్కడ ఎవ్వరూ లేక పోవడం తో ఒక ఇంత ఆశ్చర్య పోయి తేరుకుని ఎదురుగా వస్తున్న వరాలుని ఏమిటీ ఎవ్వరూ లేరు నేను సరీయినే ప్లేస్ కే వచ్చానా అని అడిగాడు.

అయ్యో మావయ్య ఇక్కడే హల్డి ఫంక్షన్ నువ్వు కరెక్ట్ గానే వచ్చావు 8:00 అంటే సో ఎర్లీ కదా అందుకే ఇంకా ఎవ్వరూ లేచి నట్టు లేదు. కూర్చో మావయ్య అరుణ్ కాసేపట్లో వస్తాడు అక్షింతలు వెద్దువు గాని చెప్పి అందంగా తెల్ల ముసుగు వేసిన కుర్చీ వైపు చూపించి తను వడివడిగా అడుగులు వేస్తూ వెళిపోయింది వరాలు.

చక్కటి దుస్తులలో కాఫీ అందిస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉన్న సర్వర్స్ తప్ప అక్కడ ఎవ్వరూ తెలిసిన వారు కనపడలేదు.ఈ లోగా పెళ్ళి కొడుకు అరుణ్ వచ్చాడు తన ముందు ఇద్దరు ఫొోగ్రాఫర్లు అడుగు అడుగునా రకరకాల ఫోజేస్ లో ఫోటోస్ తీసుకుంటూ...

కార్యక్రమం మొదలైంది పరంధామయ్య అక్షింతలు వేసి మళ్ళీ తన కుర్చీలో కూర్చున్నడు. వాళ్ళు ప్రతి చిన్న విషయాన్ని ఫొటోస్ లో భందించడం కోసం అందరూ తెగ తాపత్రయం పడిపోతున్నారు.9:30కవస్తున్నట్లు ఉంది ఎండ వల్ల ఒళ్ళు,ఆకలి వల్ల కడుపు మండుతోంది పరంధామయ్య కి. ఏమి చేయాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియక అటూ ఇటూ చూస్తూ ఉన్న అతనికి విశ్వం కనిపించాడు.

చిన్నాన్న ఇక్కడ ఉన్నవా నీ కోసం వెతుకు తున్నను టిఫిన్స్ అక్కడ ఏసి హాల్ లో ఏర్పాటు చేశారు అని చెప్పి

పరంధామయ్య నీ తీసుకు వెళ్ళాడు. అక్కడ కార్న్ ఫ్లాక్ దగ్గర నుంచి కారపు పొడి తో ఇడ్లీ వరకు అన్ని రకాల టిఫిన్స్ ఉన్నాయి. తను తనకి కావలసిన వి తిన్నాడు. వచ్చిన ఇంత సమయానికి తన బంధువులను ఇప్పటికీ కలుసుకో కలిగాడు. మాటల సందర్భం లో ఎవరెవరు వచ్చారో తెలిసినా, వాళ్ళని కలూసుకో లేక పోయాడు కారణం కొంత మంది ఇంకా బ్రేక్ ఫాస్ట్ కి రాలేదు. కొంత మంది వచ్చి తిని వాళ్ళ రూమ్ లోకి వెళ్లిపోయారు. పరంధామయ్య కి అంతా అయోమయం గా ఉంది ఈ లోగా వాళ్ళ టిఫన్లు ముగించుకుని అందరూ వాళ్ళ వాళ్ల రూమ్స్ కి వెలిపోతున్నరు. చేసేది, చూసేది ఏమి లేక తను కూడా తన రూం కి చేరుకున్నాడు.

ఏమిటో పెళ్ళి కి వచ్చి ఇలా ఒక్కడు ఉండడం తనకి రుచించట్లేదు. పెళ్ళి భాజాలు వినపడనంత దూరం లో అందరం ఎవరికీ వారే యమునా తీరే. పెళ్ళి అనగానే గరిట జారుగా గా ఉన్న ఉప్మా గుర్తు వచ్చింది. వేడి వేడి ఉప్మా అడ్డాకులు లో పెట్టీ అందరికీ అందిస్తూ ఉంటే గుండిగల కొద్ది చేస్తూ నే ఉండేవారు ఆ రుచే వేరు. డైనింగ్ హాల్ కి వెళ్ళడం భోజనం చెయ్యడం,ఆ సమయం లో ఎవరయినా కనిపిస్తే త్తిన్నంత సేపు మాట్లాడం మల్ల రూమ్ కి రావడం ఇలా రెండు రోజులు గడిచాయి.

రాత్రి 7:30 అయ్యింది పరంధామయ్య అన్యమనస్కంగా ఫంక్షన్ దగ్గరకు వచ్చాడు కాస్త లేట్ గా. కానీ దానికి విరుద్ధంగా గా ఈ రోజు ఫంక్షన్ హాల్ కాస్త కోలాహలం గా ఉంది. అవునట్టు ఈ రోజు సంగీత్ ట ఏమిటో మధ్యాహ్నం భోజనాలు వేళప్పుడు అనుకున్నారు. మైక్ లో పెద్ద గా "పుట్టింటోళ్లు తరిమేసారు కట్టుకున్నాడు వదిలేసాడు"అంటూ పాట వినిపిస్తోంది. ఓహో ఏదో డాన్స్ ట్రూప్ నీ పెట్టినట్టు ఉన్నారని అంకుంటూ ఒక కుర్చీలో కూర్చున్నాడు పరంధామయ్య .

మెల్లిగా సర్దుకుని డాన్స్ చూద్దుడు కదా వరాలు వియ్యపురాలు,వియ్యంకుడు స్టేజ్ మీద డాన్స్ వేస్తున్నారు. అలా ఒక్కకలు డాన్స్ చేస్తూ పెళ్ళి కూతురు,పెళ్ళి కొడుకు వంతు వచ్చింది. వాళ్ళు రక రకాల శృంగార భంగిమలతో ఏదో కొత్త పాట కి డాన్స్ చేస్తున్నారు. అందరూ చప్పట్లు , ఈలలు తో వాళ్ళని ప్రోతసహిస్తున్నారు. ఎందుకో అది అంత పరంధామయ్య కి కాస్త వెగటుగా అనిపించింది.

మా చిన్నతనంలో రికార్డింగ్ డాన్స్ లు ఊర్లోకి వస్తే పెద్ద వాళ్లకి తెలియకుండా మా కుర్ర కారు అంతా వెళ్లి చూసే వాళ్ళము. ఇప్పుడు పెద్ద వాళ్లే ఇలా వేలం వెర్రి గా మారడం కొంచం ఎబ్బెట్టుగా తోచింది తనకి.

మొత్తానికి పెళ్ళి రోజు వచ్చింది. పెళ్ళి ఔట్ డోర్ కావటం వల్ల స్టేజ్ అంతా తాజ్ మహల్ సెట్టింగ్ వేశారు. పెళ్ళి ముహూర్తం తెల్లవారుజాము 2:00 గంటలకి. ఇప్పుడు రిసెప్షన్ ట పెళ్ళి కూతురు,పెళ్ళి కొడుకు షాజహాన్,ముంతాజ్ వేషధారణ తో స్టేజ్ మీద కూర్చున్నారు. పరంధామయ్య కి ఆ తతంగం చూసి అసహనంగా ఉంది. శుభమా అని పెళ్ళి చేసుకుంటూ ఈ సమాధి సెట్టింగ్ ఏమిటి అని. చూసిన వాళ్లంతా ఆహా, ఓహో అంటూ ఉంటే ఏమీ అన లేక ఊరుకుండి పోయాడు.

ఒక్క ఒక్క ఫ్యామిలీ స్టేజ్ మీదకు వెళ్ళడం ఫొటోస్ తీసుకోవడం కిందకి దిగడం డైనింగ్ హాల్ కి వెళ్ళడం అదే జరుగుతోంది అక్కడ అర గంట నుంచి. మధ్య మధ్య లో వాళ్ళు ఇద్దరూ ఏవో ఫోటో లకి ఫోజ్ లు ఇవ్వటం.

7:30 సమయానికి భోజనం చేద్దామని డైనింగ్ హాల్ కి వెళ్ళాడు పరంధామయ్య అక్కడ ఒకటే కోలాహలం మొత్తం భోజనంలో 150రకాల వంటకాలు ట ఎవరో చెప్పుకుంటూ ఉంటే విన్నాడు. రకరకాల రంగులలో అన్నాలు,ఏవేవో స్వీట్స్ అలా ఏవేవో ఎన్ని పదార్థాలు పెట్టాలో అన్ని అందరూ పల్లాల నిండా పోలేరమ్మ కి నైవేద్యం పెట్టి నట్టు పెట్టుకుని వస్తున్నారు. కంచాలు ఖాళీ అవుతున్నాయి కానీ వాళ్ళు పారేసిన పదార్ధాలతో డస్ట్ బిన్ లు నిండుతున్నాయి. మనసు ఉసూరు మంది మ అమ్మా అంటూ ఉండేది మన ఇంటి శుభకార్యం నలుగురికి ఆకలి తీర్చాలి అని పనివాల్లతో పాటు ఊరిలో బీద బిక్కి కి కూడా చక్కగా భోజనాలు ఏర్పాటు చేసేది.ఈ దుబారా ఎవరికీ పట్టదు కేటరింగ్ వాళ్లకు ప్లేట్స్ లెక్క ,డబ్బు ఇచ్చేవల్లకు మూటలు లెక్క . ఎలాగో ఆ జనం లో తోసుకుంటూ తెల్లని అన్నం ,పెరుగు తెచ్చుకుని తినడానికి తన తల ప్రాణం తోకకు వచ్చింది పరంధామయ్య కి.

రాత్రి 1:00 కి పెళ్ళి తంతు మొదలయింది. చాలా దగ్గర వాళ్ళు అంటే కన్యాదాతలు,పెళ్ళి కొడుకు, పెళ్లి కూతురు అందరూ కలిపి పట్టు మని పాతిక మంది లేరు మడపం లో..పంతులు గారు మంత్రాలు వినే ఓపిక తీరిక ఎవ్వరికీ లేవు .ఫొటోస్ ,వీడియో లకి ఫోజులు ఇస్తూ అందరూ బిజీగా ఉన్నారు. తాళి కట్టే వేళ అయ్యింది వీడియో గ్రాఫర్ వివరిస్తున్నాడు వధూవరులకు తాళి కట్టగానే ఆమె వీపు మీద గిచ్చాండి,దానికి మీరు సిగ్గు పడండి అంటూ ఏవేవో డైరెక్షన్ ఇచ్చాడు. పెళ్ళి తంతు అంతా అయ్యింది అనిపించారు.

మరసటి రోజు బరువు ఎక్కిన గుండెలతో ట్రైన్ ఎక్కాడు పరంధామయ్య .ఇన్నాళ్లు తను ఏ శుభకర్యాలు కి వెళ్ళక పోవటం తను ఎంతో తప్పుగా ఫీల్ అయ్యేవాడు. అందరితో కలిసే గుణం తక్కువగా ఉండడం ,హుషారు గా అంతా కలివిడిగా తిరిగే చారులత తనకి దూరం అవ్వడం తో తను వెళ్ళడం మాను కున్నాడు. ఈ పెళ్లికి అందరూ హాజరు అయ్యారు అన్న విషయం భోజనాలు వద్ద తప్ప ఇంకెక్కడ తెలియని పరిస్తితి.ఎవరూ వారి అలవాట్లు,సౌకర్యాలు ఒక్కరోజు కయినా వదిలి పెట్టరు. ముహూర్తం మించి పోతున్నా వాళ్ళ నిద్దర,ఆకలి వాటికే ప్రాధాన్యత .సరదాగా పలకరించు కోడాలు లేవు , పదిరి లో అడుకోవడలు లేవు , బావ మరదళ్ల గిల్లి కజ్జాలు లేవు ,మేనమామలు,ఆడపడుచుల వేళ కోలాలు లేవు. సన్నాయి శబ్దానికి పిల్లలు భయపడతారు అని వాళ్ళని ఈ వాతావరణానికి దూరం గా ఉంచుతారు. అట్టహసలు కి ,ఆడబరాలకి ఇచ్చే విలువ ఆప్యాయత,అనురాగం నికి ఇవ్వటం లేదు. పెళ్ళి లో సహజత్వం లేదు . మనుషులను దగ్గరకు చేర్చే ఎన్నో సాధనాలు ఈ రోజుల్లో ఉన్నాయి కానీ వారు సౌకర్యం అనే గిరి గీసుకుని ( కంఫర్ట్ జోన్ )అందులోనే ఉండి పోతున్నారు. బాహ్యం గా అందరూ ఒక చోట ఉన్నా అవి వారి మధ్య దూరాన్ని పెంచుతోనే ఉంటోంది. ఇన్నాళ్లు తను దేనికి హాజరు కాకున్నా,వీరు అందరూ హాజరు అయినా పెద్ద తేడా ఏమీ లేదు అనిపించింది పరంధామయ్య కి.

తను ఊహించు కున్న ఐదు రోజుల పెళ్లి కి ఈ ఐదు రోజుల పెళ్లికి నక్కకి నాగ లోకానికి ఉన్న తేడా ఉంది.ఇక ఇలాంటి అసహజమైన ఏ పెళ్లికి హజరవకూడదని నిర్ణయానికి వచ్చి హాయిగా నిద్రలోకి జారుకున్నాడు.

********** స్వస్తి*********


Rate this content
Log in

Similar telugu story from Comedy