Suvarna Marella

Drama

5.0  

Suvarna Marella

Drama

అమ్మకు ప్రేమతో

అమ్మకు ప్రేమతో

2 mins
306


   

అమ్మకు ప్రేమతో,

          

             ఎప్పుడూ లాగా ఇది క్షేమ సమాచారం తెలిపే ఉత్తరం కాదు.  ఇది నాకు నీ మీద ఉన్న ప్రేమ సమాచారం తెలిపే ప్రేమ లేఖ.

  "అమ్మా!!!!!!"

  ఈ పిలుపు నీకు కొత్తగా అనిపించక పోవచ్చు.

కానీ నాకు కొత్తగానే అనిపించింది నా కూతురు నన్ను మొదట సారి పిలిచినప్పుడు తెలిసింది నాకు

ప్రతీసారీ "అమ్మా!!! అని పిలిచినప్పుడు అల్లా నీ కళ్ళలో మెరుపు ఎందుకు వచ్చేదో !!!

     

పెళ్లి అయ్యి అత్తారింటికి వెళ్లే వేల నీ బాధ నీ,ఏడుపు నీ చూసి

ఏమిటో... "పిచ్చిఅమ్మ" హాయిగా ఇష్టమయిన వాడిని చేసుకుని హ్యాపీ గా ఉంటే ఎందుకిలా చిన్నపిల్లల ఏడుస్తోంది ,నేను హ్యాపీగా ఉంటే తనకు హ్యాపీ నే కదా అని నిర్లక్ష్యంగా తీసి పారేసాను.

      అర్థమయ్యింది నాకు 

నా కూతురి పెళ్లి అయిన రోజు ఆ మానసిక వ్యధ. ఎంతమంది మధ్యలో ఉన్న ఒంటరినై పోయాను అన్న భావన. ఆ బాధ వర్ణనాతీతం.

      తెలుస్తోంది నాకు,

నీ పెంపకానికి నిలువెత్తు నిదర్శనం నేనే ఉండగా " పో అమ్మా నీకేమి తెలీదు. ఇలా మెల్లగా చెబితే నా కూతురు నా మాట వినదు"అని నేను అన్నప్పుడు నవ్వుతూ నాకు నచ్చచెప్పే నీ ఓపిక ఎలా వచ్చిందో !!!నా కూతురు అదే మాటలు నాతో అన్నప్పుడు...

      అర్థమవుతోంది నాకు,

నీ ఆరోగ్య పరిస్తితి ని కూడా లెక్క చెయ్యకుండా నాకోసం చేసిన నవకాయ పిండివంటలును కాలు క్రింద పెట్టకుండా లొట్టలు వేసుకుంటూ తింటూనే ...

" సమయపాలన,మన కోసం మనం సమయాన్ని ఎలా కల్పించుకోవాలి,మన ఆరోగ్యం కోసం మనం ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలి అని నీకే సలహాలు ఇస్తూ ఉంటే ,చిరునవ్వు తో ఊకొట్టే ఓపిక ఎలా వచ్చిందో

ఇప్పుడు నా కూతురు నా ఇంటికి వచ్చినప్పుడు ఉన్న ఒకటి,రెండు రోజులు లో తనకు ఇష్టమైన వంటలు చేసేయాలని అనిపింన్చినపుడు ..

  అనుభవం లోకి వస్తుంది నాకు,

  సంక్రాంతి  పండగ కి నీ దగ్గరకి రాకుండా భర్త తో పిల్లల తో విహార యాత్ర కి వెళ్ళినప్పుడు నేను లేని పండగ నీకు శూన్యం గా ఉన్నా !! ఒక పక్క నా ఆనందం లో పాలు పంచుకుంటు కూడా నీకు కూడా తెలీకుండా నీ గొంతు లో సన్నని జీర!!!!

    ఏమని చెప్పను అమ్మా!! నీ పాప గా నీలో నేను చూడని అమ్మతనాన్ని అమ్మ నయ్యక చూడగలిగాను అమ్మా!!!

ఇప్పుడు "అమ్మా "అని పిలుపు విన్నప్పుడు వచ్చే పారవశ్యం "అమ్మా" అని నిన్ను పిలిచి నప్పుడు కూడా కలుగు తోంది.

   నీ వయసు నా వయసు ఎంత పెరిగినా ఇప్పటి కి నీ చేత "పాప "అని పిలవబడే  

                        నీ 

                       " పాప"

   

    

                                               

      

   

     


Rate this content
Log in

Similar telugu story from Drama