Suvarna Marella

Romance

5.0  

Suvarna Marella

Romance

లేఖ

లేఖ

4 mins
350


" ఏమిటి శ్రీ వెతుకుతున్నావు "అంటూ శ్రీవల్లి పిలిచింది. ఏమి లేదు మన అమ్మాయి ఫోన్ చేసింది. తను బిటెక్ చదివేటప్పుడు "చెస్ "లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన సర్టిఫికేట్  అక్కడ కని పించడం లేదట ఇక్కడ ఏమయినా ఉందేమో నని ఫోన్ చేసింది. అదే వెతుకుతున్నాను అన్నాను ."ఆ పైన లాఫ్ట్ లోన్న సూట్ కేస్ లో ఉన్నాయేమో అక్కడ చూడండి "అంటూ చెప్పి, "నన్ను ప్రమీల ఇంటికి రమ్మంది. వాళ్ల ఇంట్లో ఏదో పూజ ట. అక్కడి కి వెళ్లి వస్తాను. వన్ అవర్ పడుతుంది .నువ్వు ఒక్కడవే లాఫ్టు ఎక్కి అది తీయకు. ఈ వయసు లో పడిపోతే ప్రమాదం. నేను వచ్చాక ఎవరినయినా హెల్ప్ అడిగి తీద్దాం "అని చెప్పి మరీ వెళ్ళింది.


తను చెప్పింది నిజమే ఈ ఆరు పదుల వయస్సులో అలాంటి సాహసాలు చెయ్యడం అంత మంచిది కాదు . అలాని తను వచ్చేవరకు ఉండలేక వాచ్ మేన్ సహాయం తో సూట్ కేజ్ దింపి. అందులో వెతకటం స్టార్ట్ చేసాను.ఈ లోగా ఆ కాగితాల మధ్య దోబూచులాడుతూ ఒక గోల్డ్ కలర్ ఎన్వలప్ కనపడింది. వెటనే అది పెళ్లికి ముందు శ్రీవల్లి తనకు రాసిన లెటర్ కదా అని గుర్తుకు వచ్చి పదిలం గా దాన్ని చేతిలోకి తీసుకున్నాను. ఎన్విలప్ మీద స్టాంప్ 3-11-2005 అని వుంది . సరిగ్గా 28 ఏల్లక్రితం ఈ ఉత్తరం చేతిలో ఉన్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉంది ఇప్పుడు అదే ఫీలింగ్ .ఎంత హాయిగా ఉంది ఆ ఫీలింగ్. వెంటనే పాత జ్ఞాపకాలు వెంటాడాయి. చాటింగ్, వీడియో కాలింగ్, ఎప్పుడు అంటే అప్పుడు కాల్ చేసుకోవడానికి మొబైల్ ఫోన్ లు ఉండగా ఈ లెటర్ రాయడం ఏమిటి అని నేను అంటే దీని విలువ మీకు ఇప్పుడు తెలీదు అని అనేది. అవును శ్రీవల్లి చెప్పింది నిజమే గంటలు గంటలు ఫోన్ లో మాట్లాడు కున్నా అవన్నీ ఇప్పుడు కొంచం కూడా గుర్తు లేవు .ఇంక ఓపెన్ చేసి చదవటానికి కొంచం కూడా లేట్ చెయ్యలనిపించలేడు.


లెటర్ ఓపెన్ చేయగానే శ్రీ వల్లీ దస్తూరి ముత్యాల మాల లా ఎంత బాగుంది. ప్రతి అక్షరము లోనూ తన నవ్వు మొహం కనపడుతోంది .

               

కాబోయే శ్రీవారికి ప్రేమతో,


           ఏమిటి శ్రీ , నా కొత్త సంభోధన కొత్త గా ఉందా!నాకు మాత్రం చాలా బాగుంటుంది అలా అంటే. పెళ్ళి చూపుల్లో నిన్ను మొదటి సారి చూసి చూడు గానే నా ఊహల రాకుమారుడు కల్ల ముందుకు వచ్చిన ఫీలింగ్ . రెప్ప వాల్చడం మరిచిపోయి మిమ్మల్ని చూస్తూ ఉండి పోతే నా కళ్ళలో కళ్ళు పెట్టీ చూడడానికి ఎంత అవస్త పడ్డారో తలుచుకుంటేనే సిగ్గు వేస్తోంది. రోజు ఫోన్ లో గంటలు మాట్లాడుకున్నా ఈ విషయాలు నీకు ఎలా చెప్పను. శ్రీ నీకు తెలుసా!


."నిను చూసినాక నిదురైన రాక మనసే పెళ్ళి మంత్రాలు కోరిందని......." ఈ పాట రాసిన కవి ఎంత చక్కగా నా భావాన్ని అర్థం చేసుకున్నారు గాని ఆ రోజు నుంచి ఎప్పుడెప్పుడు మన పెళ్లి అవుతుందో అని ఎదురు చూస్తున్నాను.


       మొబైల్ నెట్ వర్క్ కి అందని ఊరుకు వెళుతున్నాను అని నువ్వు కొంచం అలిగావు కదూ !ఆ "నీ ముఖం" నాకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది."అలిగిన వీలనే చూడాలి గోకుల కృష్ణుని అందాలు....". అయిన నీ కోపం నీ తగ్గించే మందు నా దగ్గర ఉందిలే!


ఏమి చెయ్యమంటారు శ్రీ ,నేను పెరిగిన ఊరు అది . అక్కడకు వెళ్లి అక్కడ అందరినీ మన పెళ్లికి పిలవాలి గా!అయినా నీకు తెలుసా నువ్వు ఎప్పుడూ నాతోనే, నా ఊహల్లనే ఉన్నావు. నీతో ఫోన్ లో మాట్లాడి పెట్టే టప్పటికి ఘాట్ రోడ్డు స్టార్ట్ అయ్యింది. కిటికీ పక్కన కూర్చున్న నాకు చల్లని గాలి చెంపకూ తాకగానే కిటికీ లోంచి బయటకు చూసాను . ఎన్నో చెట్లతో లోతయిన లోయ. మిరియాలు తోట అనుకుంటా ప్రతి తీగ పెద్ద చెట్లను పెనవేసుకున్నాయి. వాటి స్థానం లో మన ఇద్దరినీ ఊహించుకుంటే "అబ్బా ఛీ " ఎంత సిగ్గు వేసింది అనుకుంటున్నావు. ప్రయాణం మెత్తం ఏవో చిలిపి ఊహలు.


      ఉదయం 8:00 అవుతూ ఉన్నా మబ్బుల దుప్పటి నుండి బయటకు రావడానికి బద్దక పాడుతూ ఉన్న సూర్యుడు తన నులివెచ్చని కిరణాలు తో నన్ను తాకుతూ ఉంటే నీ వెచ్చని ఊపిరి నా చెంపలు కు తాకుతున్న ఫీలింగ్. విరబూసిన గులాబీ తోట ఇంటికి దగ్గర్లో ఉండటం తో మేమంతా చూడడానికి వెళ్ళాము. ఎంత బాగుంది అనుకున్నవ్, ఆ గులాబీలను    చూడగానే చటుక్కున పువ్వును ముద్దు పెట్టుకున్నా, అంతే దానికి ఉన్న ముళ్ళు గుచ్చుకుంది. వెంటనే ఒళ్ళు జల్లు మంది ,బుగ్గలు ఎరుపెక్కాయి ఎందుకో తెలుసా శ్రీ! నువ్వు ముద్దు పెట్టినప్పుడు నీ మీసాలు గుచ్చు కున్నప్పుడు కూడా నాకు అదే అనుభూతి కలిగేది. అలా రోజు అంతా నీ ఊహలతోనే గడిపేసాను.

 రాత్రి అందరం భోజనాలు చేసి కూర్చున్నాము . చల్లని చలి చిన్నగా వణికిస్తోంది. అమ్మ కుంపటి లో నిప్పులు రాజేసి తెచ్చింది . నేను నీకు ఉత్తరం రాస్తున్నాను. రేడియో లో సన్నగా సాంగ్ ప్లే అవుతోంది.


"మేలుకొనిన నా మదిలో నేవో మెళ్లని పిలుపులు విననాయే ! ఉలికిపాటు తో నా కనులు తెరవగా హృదయ ఫలకమున నీవాయే, కనులు తెరిచినా నీ వాయే,నే కనులు మూసినా నేవాయే......"


    పాట లో సాహిత్యం నాకు ఎంత చక్కగా అన్వయం అయింది కదా ! ఈ పది రోజులు ఎలా గడిచాయో తెలీలేదు నీ తో ఫోన్ లో మాట్లాడక పోయిన నీ ఊహల్లో ఉండడం ఎంతో బాగుంది.ఈ లేఖ లో ఉన్న ప్రతి అక్షరం నిన్ను చేరుకుంటుంది అదే ఆనందం. అదే ఆనందం నాకు కూడా కావాలని చిన్న ఆశ .బహుశా ఈ ఉత్తరం చేరే టైమ్ కి మనం పెళ్లి ముస్తాబు లో ఉండి ఉడవచ్చు. అమ్మా , నాన్న మాట్లాడుకుంటూ ఉంటే విన్నాను.ఈ విషయం ప్రస్తావించడానికి కొంచం బిడియం గా ఉన్నా అడిగేస్తున్నను .మన మొదటి రాత్రి లో కొంగున బహుమతి కట్టే సంప్రదాయం ఉందట కదా. దాని కోసం మీరు నాకు డైమండ్ రింగ్ ఆర్డర్ ఇచ్చారని తెలిసింది. వాటికన్నా శ్రీ !నా ఉత్తరానికి ప్రత్యుత్తరం నీ స్వదస్తూరితో రాసి మొదటి రాత్రి కానుకగా నాకు ఇవ్వండి. ఇదే నేను మీ నుంచి ఆశించే అపురూపమైన కానుక.


                ఈ రోజు లెటర్ పోస్ట్ చెయ్యలి తమ్ముడు పక్క ఊరికి వెళుతున్నాడు. పోస్ట్ ఆఫీస్ అక్కడే ఉంది. సో ఈ లెటర్ ఇక్కడితో ముగిస్తున్నాను. నా కోరికను మన్నిస్తారని ఆశిస్తూ!

                                           ఇట్లు

                                             నీ

                                          శ్రీవల్లి

                            

         

             ఏదో తెలియని అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉత్తరం క్లోస్ చేసాను. చటుక్కున నేను శ్రీవల్లి కి రాసిన ఉత్తరం గుర్తుకు వచ్చింది. ఆ లెటర్ కోసం వెతుకులాట మొదలెట్టాను. ఈలోగా శ్రీవల్లి వెనక నుంచి వచ్చి "ఇంకా వెతకడం అవ్వలేదా ఉండండి నేను సాయం చేస్తా "అంది. నేను వెతుకుతున్నది సర్టిఫికెట్ కాదు నేను నీకు రాసిన లెటర్ , అదే మన మొదటి రాత్రి " కొంగున కట్టిన లేఖ" అని కన్ను గీటాను. ఇప్పుడు అది ఎందుకు గుర్తుకు వచ్చింది ,అయినా ఇవన్నీ ఎందుకు వెతుకుతున్నారు ,ఉండండి నేను తీసుకొస్తాను అని బీరువా తలుపు తీసి పదిలంగా దాచుకున్న పెళ్లి పట్టుచీర మడత లోంచి ఉత్తరం తీసి నా చేతిలో పెట్టింది. నా ఉత్తరాన్ని అంత పదిలంగా దాచుకున్న తనని పదిలంగా గుండెలకు హత్తుకుని ఉత్తరం చదవడం మొదలు పెట్టాను.


Rate this content
Log in

Similar telugu story from Romance