Kishore Semalla

Action Crime Thriller

4.7  

Kishore Semalla

Action Crime Thriller

ఫింగర్ ప్రింట్స్.ఎపిసోడ్-2

ఫింగర్ ప్రింట్స్.ఎపిసోడ్-2

5 mins
765


ఎవరు అయ్యి వుంటారు??? ఇదెక్కడి గోల రా బాబు. ప్రశాంతంగా పిజ్జా తిని పని చూసుకుందాం అంటే అనుకుని డోర్ తెరచింది.

చూస్తే డెలివరీ బాయ్. మేడమ్!!! మర్చిపోయాను చెప్పడం......రేటింగ్ ఇవ్వండి ప్లీజ్... అని అడిగాడు.

రేటింగ్ ఏ కదా!!! ఇస్తాను. ఇంకా ఏమన్నా వున్నాయా?? మళ్ళీ గుర్తు తెచ్చుకుని కాలింగ్ బెల్ కొడతావా??? అని అడిగింది శ్వేతా.

అదేంటి మేడమ్ రేటింగ్ ఏ కదా అడిగాను అని బాధపడ్డాడు.

అమ్మో!!!! వీడు బాధ పడుతున్నాడు. కల నిజమయిపోద్ది. నువ్వు ఆగరా బాబు అని వెళ్తున్నవాడ్ని వెనక్కి పిలిచింది. రేటింగ్ ఏ కదా అడిగావ్. ఆకలితో వున్నారా!!!! అందుకే అలా మాట్లాడాను. ఇదిగో ఫైవ్ రేటింగ్ ఇచ్చాను చూస్కో అని చెప్పి బై అని చెయ్యి ఊపింది.

ఇక ప్రశాంతంగా పిజ్జా తిని కూర్చుంది ఏం చేద్దామా??? అని.

ఇంటికి ఫోన్ చేసింది మాట్లాడదం అని.

అమ్మా!!! నేను వచ్చేస్తానే ఒకటే భయం వేస్తుంది. కరోనా గోల అనుకుంటే ఈ సైకో గాడి వల్ల ఇంకో బాధ. మైగ్రేషన్ కి పెర్మిషన్ అడిగి నాలుగు రోజులు అవుతుంది. ఈ పోలీసులు ఏమో అస్సలు పట్టించుకోవట్లేదు. ఏడుపు వచ్చేస్తుంది. ఇక్కడ తోడుగా ఒక్కరు కూడా లేరు.

వినిపిస్తుందా!!!! నా మాట. ఐనా మీరెందుకు పట్టించుకుంటారు లే, నీ ముద్దుల కొడుకు వచ్చి ఉంటాడు కదా వాడికి మంచిగా బిరియాని, చికెన్ వండి పెట్టు. నేను ఇక్కడ పాచిపోయిన అన్నం, రాత్రి మిగిలిపోయిన కూరలు తింటూ బ్రతికేస్తాను అని ఒకటే గ్యాప్ లేకుండా మాట్లాడుతుంది.

ఒసేయ్!!! కాస్త ఊపిరి పీల్చుకోవే మధ్య మధ్యలో ఒకటే వాగుతున్నావ్ అప్పటినుంచి. అది నోరా??? విడిచిపెట్టిన కుళాయా??? ఆపకుండా ఒకటే మాట్లాడుతున్నావ్ అని శ్వేత వాళ్ళ అమ్మ గాయత్రి గారు కలగజేసుకున్నారు.

మీ నాన్న అదే పని మీద వున్నారు.. అందర్నీ అడుగుతున్నారు. కరోనా ఉధృతి ఎక్కువ గా ఉండడం వల్ల ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి పంపించడానికి అనుమతులు అంత త్వరగా ఇవ్వడం లేదు. అందుకే నీకు పెర్మిషన్ రావడానికి టైం పడుతుంది అని చెప్పారు గాయత్రి గారు.

ఈ ముక్క వినడానికే ఫోన్ చేసాను. ఛ!! మీకు మీ కొడుకు అంటేనే ఇష్టం వాడ్ని మాత్రం లోక్డౌన్ కి ముందే ఇంటికి రప్పించేశారు అని కోప్పడింది.

ఇదెక్కడి గోలే, వాడి పరీక్షలు అయిపోయాయి.... వచ్చేసాడు.....దానికి నన్నేం చెయ్యమంటావ్..... అని పాపం శ్వేత తో మాట్లాడలేక అలసిపోతున్నారు గాయత్రి గారు.

సరేలే!!!! సమర్దించుకోకు. ఎంతైనా నీకు మీ కొడుకు అంటేనే ఇష్టం ఒప్పుకో అని చెప్పింది శ్వేత.

సరే!!! అదేదో మీ నాన్న గారు వచ్చారు ఆయనతో చెప్పు అని ఫోన్ పరశురాం చేతికి ఇచ్చింది.

ఎమ్మా!!! అక్కడ అంతా సవ్యంగా ఉందా??? చాలా ప్రయత్నిస్తున్నా, ఒక్క రెండ్రోజులు ఎలాగోలా ఇబ్బంది పడు. ఇక్కడికి వచేస్తావ్ అని చెప్పాడు.

అయ్యో!!!! పర్లేదు నాన్న. అంతా అయ్యాక చెప్పండి బయల్దేరుతాను అని ఇప్పటివరకు పులి లా అమ్మ పైన విరుచుకుపడి, నాన్న రాగానే పిల్లి లా మారిపోయింది శ్వేత. ( ఎందుకంటే శ్వేత భయపడే ఒకే ఒక వ్యక్తి వాళ్ళ నాన్నగారు పరశురాం).

సరే అమ్మ జాగ్రత అని ఫోన్ పెట్టేసాడు పరశురాం.

పోలీస్ స్టేషన్ లో:

పోలీస్ స్టేషన్ బయట ప్రెస్....అందరూ మాస్క్ లు పెట్టుకుని.....

"సైకో ఎప్పుడు దొరకుతాడు సర్???"

"అసలు ఆ ఫింగర్ ప్రింట్స్ ఎవరివో కనిపెట్టారా???"

"తరువాత ఇంకో హత్య జరగకుండా ఉంటుంది అన్న నమ్మకం ఏంటి???"

ఇలా ఒక్కో న్యూస్ ఛానల్ నుంచి వచ్చిన ఒక్కొక్కడు ప్రశ్నలు మీద ప్రశ్నలు వేస్తున్నారు ఇన్స్పెక్టర్ రంజిత్ ని. ఏం చెప్పాలో కూడా తెలియని పరిస్థితుల్లో వున్నాడు రంజిత్.... ఎందుకంటే ఎటువంటి సమాధానం ఇవ్వాలో కూడా తెలీదు.

అప్పుడే కమిషనర్ జీప్ అక్కడికి వచ్చింది. ప్రెస్ అంతా ఆ జీప్ చుట్టూ మూగిపోయారు. అవే ప్రశ్నలు మళ్ళీ వేయడం మొదలుపెట్టారు.

హాంతకుడ్ని ఇంకో రెండ్రోజుల్లో పట్టుకుంటాం. అందరం అదే పనిలో వున్నాం. మీరు దయచేసి దీన్ని పెద్ద ఇష్యూ చేయకండి. ఒక పక్క కరోనా వల్ల సగం మంది పోలీసులు పెట్రోలింగ్ లోనే వుంటున్నారు. హంతకుడు ఎక్కడికి తప్పించుకోలేడు. 'థాంక్ యు" అని చెప్పి లోపలికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.

లోపల అందర్నీ ఒక గదిలో మీటింగ్ కి పిలిచాడు.

ఏం జరుగుతుందో చూస్తున్నారు కదా!!!!! బయట ఏకి పడేస్తున్నారు అయ్యా. నా పైన చాలా ప్రెషర్ వుంది ఇప్పుడు. IG గారు నన్ను ఈ కేస్ ని త్వరగా క్లోజ్ చెయ్యమని కాఫీ ఇచ్చి మరీ చెప్పారు. ఆయన కాఫీ ఇచ్చారు అంటే వార్నింగ్ ఇస్తున్నట్టు గుర్తుపెట్టుకోండి.

ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా??? అసలు ఆ ఫింగర్ ప్రింట్స్ ఎవరితో ఐనా మ్యాచ్ అవుతున్నాయా???అని అడిగాడు కమిషనర్.

సర్!! ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న క్లూస్ జీరో. అతను ముసుగు లో వస్తున్నాడు. ఫలానా ప్లేస్ అని లేదు, చాలా చోట్ల హత్యలు జరుగుతున్నాయి. ఆడ, మగ, ముసలి అని తేడా కూడా లేదు వాడికి. వాడి మెయిన్ 'మోటో' ఏంటో ఈ హత్యలు వెనుక అర్ధం కావడం లేదు సర్ అని చెప్పాడు రంజిత్.

అవును సర్!!! మనకి ఉన్న ఒకే ఒక్క క్లూ ఆ ఫింగర్ ప్రింట్స్. తెలివిగా వదిలివెళ్తున్నాడు అంటే తనని ఎవరూ పట్టుకోలేరు అనే కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది అని CI ప్రభు చెప్పాడు కమిషనర్ తో.

నాకైతే అది కాన్ఫిడెన్స్ లా అనిపించడం లేదు. ఎందుకో ఆ సైకో నన్ను పట్టుకోండి చూద్దాం.... అని మనతో ఆటలు ఆడుతున్నాడని అనిపిస్తుంది అని రంజిత్ చెప్పాడు.

ఎందుకు అలా అనిపిస్తుంది నీకు అని కమిషనర్ రంజిత్ ని అడిగాడు.

వెంటనే రంజిత్ ప్రక్కనే ఉన్న బల్ల పైన మార్కర్ తీసుకుని.......సర్!!!! ఇప్పటి వరకు 22 హత్యలు జరిగాయి. అందులో మొదట హత్య లో మనకి దొరికిన క్లూస్ జీరో.

తర్వాత ప్రతి మర్డర్ స్పాట్ లో మనకి దొరికిన ఒకే ఒక క్లూ తన "ఫింగర్ ప్రింట్స్" మాత్రమే. మనం వాటిని మాత్రం పట్టించుకుని కేస్ ని రాంగ్ గా స్టడీ చేస్తున్నాం అనిపిస్తుంది.

మొదటి మర్డర్ ఐన రీనా జోసెఫ్ చనిపోయిన స్పాట్ లో ఏం దొరకలేదని రిపోర్ట్ లో వుంది. బట్ మనం ఏమైనా మిస్ అయ్యుండొచ్చు అక్కడ అని నాకు ఎందుకో అనుమానంగా వుంది. "విత్ యూర్ పెర్మిషన్" నేను మళ్ళీ ఒక్కసారి కేస్ ని అక్కడ నుంచి మొదలుపెట్టాలి అనుకుంటున్నా అని రంజిత్ కమిషనర్ ని అడిగాడు.

నీకు అన్ని పెర్మిషన్లు ఇస్తున్నా. ఏమైనా చెయ్యి కానీ హాంతకుడ్ని పట్టుకో అని చెప్పి బయల్దేరాడు.

రాత్రి అయ్యింది......

శ్వేత ఏం వస్తుందో చూద్దాం అని టీవీ పెట్టింది. ఛానెల్స్ మారుస్తూ వుంది.

"నగరం లో మరో హత్య". రాహుల్ హత్య ఇంకా జీర్ణించుకునే లేదు ప్రజలు హంతకుడు అప్పుడే ఇంకో హత్య తో నగరాన్ని భయపెట్టాడు. ఈసారి ఏకంగా ఇందుష్ట్రియాలిస్ట్ జయరాం కూతురు ఐన మేఘన ని చంపేశాడు. కార్ లో బెంగళూర్ నుంచి హైదరాబాద్ ఒంటరి గా వస్తున్న మేఘన ని అతి క్రూరంగా చంపి తన రాక్షతత్వాన్ని చూపించాడు.

అమ్మో!!!! మళ్ళీ వీడేనా న్యూస్ లో అని టీవీ కట్టేసింది శ్వేత. మళ్ళీ గుండె బరువెక్కుతుంది. చెమటలు పడుతున్నాయి. కూల్ డౌన్ శ్వేత కూల్ డౌన్ .....అని తనకి తానే చెప్పుకొని మరేం భయం లేదు.....పడుకుందాం టైం అయ్యింది అని బెడ్రూం లోకి పరిగెత్తింది.

పొద్దునే లేవాలి, ఈరోజు లా చేస్తే మళ్ళీ ఫుడ్ కోసం వెతుక్కోవాలి జోమటో ని స్విగ్గి ని. వాళ్ళతో లేనిపోని తలనొప్పి మనకెందుకు అని పడుకుంది శ్వేత.

పొద్దునే అలారం మోగింది. అప్పుడే తెల్లారిపోయిందా అనుకుని లేచి టైం చూసింది. వామ్మో!!! ఏడు అవుతుంది. త్వరగా వెళ్లకపోతే మార్కెట్ మూసేస్తారు అనుకుని పళ్ళు కూడా తోముకోకుండా లగెత్తింది మార్కెట్ కి స్కూటీ తీసుకుని....

ఈ హడావిడి లో మాస్క్ మర్చిపోయింది. పోలీసులు దారిలో బైక్ ని ఆపేశారు. వెయ్య రూపాయిలు జరిమానా కట్టించుకుని ఒక మాస్క్ చేతిలో పెట్టారు.

ఇచ్చేదేదో N95 మాస్క్ ఇవ్వొచ్చుగా వెయ్య రూపాయిలు తీసుకున్నారు. బోడి గుడ్డ ముక్క కి అటూ ఇటూ తాడులు కట్టి ఇచ్చేసారు పిసినారాల్లో అని తిట్టుకుని వెళ్ళిపోయింది అక్కడి నుంచి....

మార్కెట్ జనాలతో నిండిపోయి వుంది. వీళ్ళకి కరోనా అంటే భయమే లేనట్టుంది తెగ తిరుగుతున్నారు. మనం జాగ్రత్తగా ఉందాం అనుకుని ఎవర్ని తాకకుండా వెళ్తుంది.

ఇంతలో ఒకడు చాలా దగ్గరగా వచ్చి ఆపుకోలేక తుమ్మాడు. అంతే సంగతులు ఇంకా.....

ఎరా!!!! చూస్తే చదువుకున్నవాడిలా ఉన్నావ్. ఒక మాస్క్ లేదు చేతికో గ్లౌస్ లేదు. ఏంట్రా అంటే పబ్లిక్ ప్లేస్ లో మొఖానికి అడ్డుపెట్టుకోకుండా తుమ్ముతున్నావ్. నీ వల్ల ఇక్కడ ఎంత మందికి కరోనా వస్తుందో తెలుసా గాడిద అని తిట్టిపోసింది.

మేడమ్ కరోనా నన్నేం చేస్తాది. హుక్కు బాడీ ఇక్కడ అని కింకరించాడు తనని.

ఎదవ బీన్ బ్యాగ్ అంత పొట్ట ఏసుకుని.... వాచి పోయిన కండలు... పాచిపోయిన మొఖం బానే ఉన్నావ్ ఎదవ పేడు మొఖం వేసుకుని. బయలుదేరు పొద్దునే వచ్చావ్ కరోనా ని అంటించడానికి అని మార్కెట్ లో అందరి ముందు వాడి పరువు తీసిపారేసింది.

ఏం సైక్ ఉన్నాది రా భై.... ఆ సైకో గాడు ఎవడో దీన్ని ఏసేస్తే బాగుణ్ణు. ఇజ్జత్ మొత్తం తీసిపడేసింది అని వెళ్ళిపోయాడు అక్కడ నుంచి.

ఇంత లో పొడుగ్గా నల్ల జాకెట్ వేసుకుని ఒక వ్యక్తి కాయగూరలు కొంటున్నాడు. వీడ్ని ఎక్కడో చూశానే???? మొఖం కనిపిస్తే బాగుణ్ణు కనిపెట్టేయవచ్చు అనుకుని ఫాలో అవుతుంది.......

మిగతా కథ తరువాయి భాగం లో చూద్దాం....

            *****************************


Rate this content
Log in

Similar telugu story from Action