kondapalli uday Kiran

Abstract Tragedy Inspirational

4  

kondapalli uday Kiran

Abstract Tragedy Inspirational

పదవ తరగతి కుర్రాళ్ళ ఆలోచన.

పదవ తరగతి కుర్రాళ్ళ ఆలోచన.

1 min
352


బొల్లారం అనే గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అనే పాఠశాల ఉండేది. ఆ పాఠశాలలో 6 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు తరగతి గదులు ఉంటాయి.పదో తరగతి పిల్లలు ఒకటీ గమనించారు.వాళ్ళ చిన్న తరగతి పిల్లల చిత్తు కాగితాలను చింపి వేస్తున్నారని దాంతో పాఠశాల చెత్త గా మారుతోందని గమనించారు. ఒకసారి చెప్పి చూశారు వినలేదు.అప్పుడు పదవ తరగతి పిల్లలు ఆ చిత్తు కాగితాలను ఒక దగ్గర పోగుచేసి , అన్ని కాగితాలను కొన్ని పుస్తకాలు గా తయారు చేశారు. దాన్ని అమ్మితే చాలా డబ్బులు వచ్చాయి. దాంతో ఆ పాఠశాలకు ఒక బహుమతి ఇద్దాం అనుకున్నారు. అదేమిటంటే కొత్త పుస్తకాలను కొని చిన్న పిల్లలకు ఇచ్చారు. ఉపాధ్యాయులు అభినందించారు. అప్పుడు పదవతరగతి కుర్రాళ్ళు ఇదంతా మా డబ్బులు కాదు సార్ . మా చిన్న తరగతి వాళ్ళవే. ఎలాగంటే వాళ్లు చింపి పారేసిన చిత్తు కాగితాలను పోగుచేసి కొన్ని పుస్తకాలు గా తయారుచేసి అమ్మిన డబ్బులతో పుస్తకాలను వీళ్ళకేకొన్నాము. అప్పటి నుంచి పాఠశాలలో ఎవ్వరు చిత్తు కాగితాలను చింపివేయడం లేదు. దాంతో పాటు పాఠశాల అంతా చెత్త రహితంగా మారింది, ఇంకా మనం ఎన్నో చెట్లను కాపాడిన వాళ్ళం అవుతాము.

చూసారా పదవ తరగతి కుర్రాళ్ళు ఆలోచన


Rate this content
Log in

Similar telugu story from Abstract