నయనం ప్రధానం
నయనం ప్రధానం
మెల్లగా కళ్ళు తెరువమ్మా అంటుటే చిన్నగా కళ్ళు విప్పి చూసింది నయన.
మసక మసకగా కనిపిస్తుంటే కళ్ళు విప్పార్చుకుని మరీ చూసింది.
ఎదురుగా ఉంది తల్లి తండ్రులు అని గుర్తు పట్టింది.
వెంటనే కళ్ళ నుండి కన్నీరు వస్తుంటే డాక్టర్ నాకు కళ్ళు కనబడుతున్నాయి,
నాకు అందరూ కనబడుతున్నారు అంటూ గట్టి గట్టిగా అరుస్తున్న నయనను చూసి,
డాక్టర్ కంగారుగా అంత ఆవేశపడకు నయనా కళ్ళకి వత్తిడి ఇవ్వద్దు అని అందరి వైపు చూసి ఆపరేషన్ సక్సెస్ అంటూ నవ్వాడు.
నయన చిన్నప్పుడు కళ్ళు పెద్ద పెద్దగా ఎంతో అందగా ఉండేవి.
ఆ కళ్ళను చూసే నయన తండ్రి ఎంతో ప్రేమగా నయన అని పేరు పెట్టాడు.
కానీ..
నయనకి పదేళ్ల వయసులో ఒక ఆక్సిడెంట్ లో కళ్ళు పోయాయి.
ఎంతో అందమైన ఊహలు ఉన్న నయన జీవితం అంధకారంలో మునిగిపోయింది.
అయినా నయన తండ్రి కూతురుని కళ్ళలో పెట్టుకుని దగ్గర ఉండి మరీ చదివించాడు.
ఎన్నో అందమైన కథలు చెప్పి ప్రకృతి గురించి, మనుషుల గురించి కళ్ళకు కట్టినట్టు చెప్పేవాడు.
ఇప్పుడు నయనకి ఇరవై ఏళ్ళు.
ఒకరోజు హఠాత్తుగా తెలిసిన డాక్టర్ పిలిచి కళ్ళు దానం చేసే వాళ్ళు దొరికారు అని అప్పటికప్పుడు ఆపరేషన్ చేసి కళ్ళు పెట్టారు.
ఇప్పుడు కళ్ళు కనిపిస్తున్న నయనకి ఎప్పుడూ ఊహల్లోనే చూసిన ప్రపంచం ఎంతో అందగా అంతా వింతగా కనిపిస్తుంది.
నయనకి మనసులో ఒక ఆలోచన తళుక్కున మెరిసింది.
తనకి కళ్ళు ఎవరు ఇచ్చారు అని.
డాక్టర్ ని అడిగింది.
డాక్టర్ చెప్పిన విషయం విని కళ్ళు చెమర్చాయి.
తన కళ్ళు ఒక ఇరవై ఐదేళ్ల చిత్రాకారిణివి అని,
ఆమెకు హఠాత్తుగా ఆక్సిడెంట్ అయి మరణించడం వల్ల తనకి కళ్ళు వచ్చాయి అని.
ఆమె మరణించక ముందే తన కళ్ళు దానం చేసిందని చెప్పారు.
ఆమె మంచి మనసుకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది నయన.
కళ్ళు: మనిషికి ఎంతో ముఖ్యం.
కళ్ళు ఉన్నవాళ్ళకి వాటి విలువ తెలువకపోవచ్చు.
కానీ కళ్ళు లేని వారి పరిస్థితి చాలా బాధాకరం.
ఒక్కసారి కళ్ళు లేకపోతే అని ఊహించుకోండి.
మన ప్రపంచం అగమ్యగోచరంగా ఉంటుంది.
అందుకే కళ్ళు దానం చేయండి.
మనం మరణించాక మట్టిలో బూడిద అయ్యే కళ్ళు మరోకరి చీకటి జీవితంలో వెలుగులు నింపుతాయి..
